ETV Bharat / science-and-technology

ఐఫోన్​ యూజర్లకు గుడ్​న్యూస్.. సులభంగా పేమెంట్! - UPI payment in iphone

ఐఫోన్​ వినియోగదారులకు శుభవార్త అందించింది యాపిల్ సంస్థ. ఇకపై సులభంగా పేమెంట్స్​ చేసుకునేలా మూడు పేమెంట్ పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

apple, iphone
ఐఫోన్, యాపిల్
author img

By

Published : Jul 31, 2021, 9:54 PM IST

Updated : Jul 31, 2021, 10:04 PM IST

ఐఫోన్​ యూజర్లకు శుభవార్త. ఇకపై యాప్​ స్టోర్​ సంబంధిత పేమెంట్లు జరిపేలా మూడు పేమెంట్​ విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. ఇప్పటివరకూ వినియోగదారులు.. యాప్స్​ సబ్​స్క్రిప్షన్ తీసుకునేందుకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వివరాలను యాడ్​ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం.. యూపీఐ అకౌంట్, రూపే, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసే అవకాశం కలిపించింది యాపిల్ సంస్థ.

ఇకపై.. నెలవారీ ఐక్లౌడ్​ సబ్​స్క్రిప్షన్​ల కోసం, పెయిడ్​ యాప్స్​ ఆటో రెన్యూవల్​ కోసం యూపీఐ వివరాలను జతచేయవచ్చు. యాప్​లో కొత్త ఫీచర్లు కొనుక్కునేందుకు, కొత్త యాప్​లను కొనేందుకూ ఈ వ్యాలెట్​ను ఉపయోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది.

ఈ కొత్త ఫీచర్లను పొందేందుకు యూజర్లు ఐఓఎస్, ఐప్యాడ్, మ్యాక్ ఓఎస్ వెర్షన్లను అప్డేట్ చేయాల్సి ఉంది.

న్యూ పేమెంట్​ మోడ్​ను పొందండిలా...

  • ఐఫోన్​, ఐప్యాడ్​లో సెట్టింగ్స్​ మెనూకు వెళ్లాలి.
  • స్క్రీన్​​పై కనిపించే యాపిల్ ఐడీపై క్లిక్​ చేయాలి.
  • పేమెంట్ అండ్​ షిప్పింగ్ ఆప్షన్​ను సెలక్ట్ చేయాలి. యాపిల్ ఐడీ వివరాలను ఎంటర్ చేయాలి.
  • న్యూ పేమెంట్ మోడ్​ను పొందేందుకు యాడ్​ పేమెంట్ మెథడ్​పై క్లిక్ చేయాలి.
  • యూపీఐ, రూపే వివరాలను యాడ్​ చేసుకునేలా యాపిల్​ గైడ్ చేస్తుంది. దాని ప్రకారం వివరాలను ఎంటర్ చేయాలి.
  • యాపిల్​ ఐడీకి మల్టిపుల్ పేమెంట్ మోడ్​లను కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంది.

మ్యాక్​బుక్​లో అయితే...

  • యాప్​ స్టోర్​లోకి వెళ్లి సైన్​ ఇన్​లో యాపిల్ ఐడీ, పాస్​వర్డ్​ వివరాలు ఇవ్వాలి.
  • వ్యూ ఇన్ఫర్మేషన్​లోకి వెళ్లి మేనేజ్​ పేమెంట్స్​పై క్లిక్​ చేయాలి.
  • యాడ్​ పేమెంట్స్​పై క్లిక్​ చేసి యూపీఐ, రూపే లేదా నెట్​ బ్యాంకింగ్​ ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చదవండి:ఐఫోన్ల విక్రయాలతో 3 నెలల్లో రూ.3 లక్షల కోట్ల ఆదాయం!

Last Updated : Jul 31, 2021, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.