అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడం సులభమైపోయింది. మన శరీరంలో ఏ అవయం ఎలా పని చేస్తుంది? స్పందన ఎలా ఉంటుందన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు.. "గూగుల్ఫిట్" యాప్‌తో ఇది మరింత తేలికైంది. ఐఫోన్ కెమెరా సాయంతో మనిషి హృదయ స్పందనను గూగుల్ ఫిట్ ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కుడా అవసరం లేకపోవడం విశేషం. కాబట్టి దీనిని ఎక్కడైనా, ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.
ఐఫోన్లో గూగుల్ఫిట్ ఎలా పని చేస్తుంది?
గూగుల్ఫిట్ హార్ట్ రేట్ ట్రాకర్ తొలుత పిక్సెల్ ఫోన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. ఇకపై ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. తమ హృదయ స్పందన రేటును కొలవడానికి మీ చేతి వేలిని ఐఫోన్ వెనుక కెమెరాపై ఉంచి.. కాస్త నొక్కి పట్టుకోవాలి. ఫ్లాష్‌ని కూడా ఆన్ చేయాలి. దీని వల్ల గుండె స్పందన రేటు మరింత కచ్చితంగా కొలిచే వీలుంటుంది. ఇందుకు 30 సెకన్ల సమయం పడుతుంది. కాబట్టి.. మీ వేలిని దాని కంటే కొంచెం ఎక్కువ సమయం ఉంచడం మంచిది. వేలు తీసిన తర్వాత.. స్క్రీన్‌పై ప్రివ్యూ గ్రాఫ్, నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చూడవచ్చు. ఆ వివరాలను డిలీట్ చేయవచ్చు లేదా భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవచ్చు.
Google Fit breathing tracker
దీంతోపాటు ఐఓఎస్ కోసం గూగుల్ మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఇది యూజర్ శ్వాసను ట్రాక్ చేస్తుంది. గూగుల్ఫిట్ బ్రీతింగ్ రేట్ ట్రాకర్ ద్వారా యూజర్ తమ ఐఫోన్ ఫ్రంట్ కెమెరా ముందు ఛాతీభాగం కనిపించేలా ఫేస్ ఉంచాలి. పని పూర్తయిన తర్వాత.. తదుపరి అనుసరించాల్సిన దశల గురించి యాప్ మార్గనిర్దేశం చేస్తుంది. మీ తల, ఛాతీ కదలికల ఆధారంగా మీ శ్వాస రేటును గూగుల్ఫిట్ లెక్కిస్తుంది.
గూగుల్ ఇంతకుముందు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే ఫీచర్లను ప్రవేశపెట్టింది. తర్వాత ఆరోగ్యం, శ్వాసకోశ ఫీచర్లు పిక్సెల్ ఫోన్‌లకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకురానుంది. అయితే గూగుల్ఫిట్ ఇంకా యాపిల్ యాప్‌స్టోర్‌లో దాని యాప్ పేజీని అప్‌డేట్ చేయలేదు. అందువల్ల వీటికోసం యూజర్లు మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు.
ఈ ఫీచర్లు.. యూజర్ తమ గుండె, శ్వాస రేటును ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. అయితే దీనిని వైద్య రోగ నిర్ధారణ కోసం ఉపయోగించలేమని గుర్తుంచుకోవాలి.
ఇవీ చూడండి:
ఆ ఫీచర్‌తో మీ ఐఫోన్లో డేటా సేఫ్!