ETV Bharat / science-and-technology

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్​.. పిల్లలు ఏం చేసినా తెలిసిపోయేలా! - ఇన్​స్టాగ్రామ్ తాజా వార్తలు

Instagram New Feature: ఇన్​స్టాగ్రామ్​లో పిల్లలు ఎలాంటి కంటెంట్​ను చూస్తున్నారనేది తెలుసుకునేందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది ఇన్​స్టాగ్రామ్. దీని సాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఏయే ఖాతాలను అనుసరిస్తున్నారు? అనే కాకుండా ఇతరుల ఖాతా గురించి పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ వస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ పేర్కొంది.

Instagram
ఇన్‌స్టాలో
author img

By

Published : Mar 19, 2022, 6:36 PM IST

Instagram New Feature: ఫొటో/వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించే పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారనేది తెలుసుకునేందుకు వీలుగా తల్లిదండ్రుల కోసం పేరెంటల్‌ సూపర్‌ విజన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

దీని సాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఏయే ఖాతాలను అనుసరిస్తున్నారు? అనేది తెలుసుకోవడమే కాకుండా ఇతరుల ఖాతా గురించి పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ వస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ పేర్కొంది.

పేరెంటల్‌ సూపర్‌విజన్‌ ఫీచర్‌ కావాలనుకునే వారు ముందుగా తమ పిల్లల ఖాతాల నుంచి ఫీచర్‌ యాక్టివ్‌ చేయాలని ఇన్‌స్టాగ్రామ్‌ను కోరాలి. తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపయోగించే ఖాతాలకు పేరెంటల్‌ సూపర్‌విజన్‌ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. సదరు రిక్వెస్ట్‌ను పిల్లలు ఓకే చేస్తే తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికన్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సెరీ తెలిపారు.

దీంతో పాటు క్వెస్ట్‌ హెడ్‌సెట్స్‌లో కూడా వర్చువల్‌ రియాల్టీ పేరెంటల్ సూపర్‌విజన్‌ టూల్స్‌ను పరిచయం చేయనున్నట్లు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ప్రకటిచింది. దీంతో పిల్లలు అభ్యంతరకరమైన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయకుండా కట్టడి చేయొచ్చని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ పరిమితి మించి వినియోగించకుండా స్వీయ నియంత్రణ కోసం 'టేక్‌ ఏ బ్రేక్‌' ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

ఇదీ చూడండి: వాట్సాప్ గ్రూప్​ చాట్​లో పోల్స్​ ఫీచర్.. అసలేంటిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.