ETV Bharat / science-and-technology

జియో వెబ్​క్యామ్​తో ఇకపై నేరుగా టీవీ నుంచే వీడియో కాల్స్​! - జియో టీవీ కెమెరా ధర ఫీచర్లు

How To Set Up JioTVCamera For TV Calling In Telugu : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్​ జియో కంపెనీ ఇటీవలే 'జియో టివీ కెమెరా'ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్​క్యామ్​తో నేరుగా మీ టీవీ నుంచే వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది. మరి దీని పూర్తి వివరాలు సహా, సెటప్ ప్రాసెస్ గురించి తెలుసుకుందామా?

How to Configure JioTVCamera with  JioCall app
How To Set Up JioTVCamera For TV Calling
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 11:07 AM IST

Updated : Nov 20, 2023, 11:43 AM IST

How To Set Up JioTVCamera For TV Calling : రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్టులను అందుబాటులోకి తెస్తోంది. అందుభాగంగా ఇటీవలే జియో టీవీ కెమెరాను మార్కెట్లోకి తెచ్చింది. ఈ వెబ్​క్యామ్​తో మీ టీవీ నుంచే నేరుగా వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ వెబ్​క్యామ్​లో ఉన్న ఫీచర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

సూపర్ క్వాలిటీ ఫీచర్స్ ఉన్నాయ్​!

  1. జియో వెబ్​క్యామ్..​ ఆల్ట్రా-వైడ్ హెచ్​డీ వీడియో కాలింగ్​తో సహా, లాంగ్​ రేంజ్​​ ఆడియోను కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు దీనికి ప్రైవసీ షట్టర్ కూడా ఉంది. అందువల్ల కెమెరా ఉపయోగించనప్పుడు కెమెరాను క్లోజ్ చేసుకోవచ్చు.
    JioTVCamera video calling
    జియో టీవీ కెమెరా వీడియో కాలింగ్
  2. ఈ జియో టీవీ కెమెరా 120 డిగ్రీ ఫీల్డ్​ వ్యూ కలిగి ఉంటుంది. కనుక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫ్యామిలీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్​ మీటింగ్స్​ కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే పర్షనల్​ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకోవచ్చు.
  3. ఈ కెమెరాలో ఉన్న ​బిల్ట్ఇన్​​ మైక్రోఫోన్​ 4 మీటర్ల రేంజ్​ వరకు క్లియర్​గా ఆడియోను క్యాప్చర్ చేస్తుంది. కనుక ఆడియో కూడా​ చాలా స్పష్టంగా వినబడుతుంది.
  4. ఈ జియో వెబ్​క్యామ్​లోని బిల్డ్-ఇన్​ ఆల్గారిథమ్​ వల్ల తక్కువ వెలుతురులోనూ ఇమేజ్​లు చాలా క్లియర్​గా కనిపిస్తాయి.
    JioTV webcam
    జియో టీవీ కెమెరాతో ఫ్యామిలీ వీడియో కాలింగ్​
  5. రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఈ టీవీ కెమెరా.. జియో టీవీ కాలింగ్​, జియో మీట్ అప్లికేషన్​లతో సహా, మైక్రోసాఫ్ట్ టీమ్స్​, జూమ్ లాంటి పాప్యులర్ అప్లికేషన్లు అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది.

జియో టీవీ కెమెరా ధర :
ఈ జియో యూఎస్​బీ వెబ్​క్యామ్​ ధర రూ.2,999గా ఉంది. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్​లో​, జియోమార్ట్​ల్లో లభిస్తుంది. ఈ వెబ్​క్యామ్​కు ఒక సంవత్సరం మాన్యుఫ్యాక్చురర్​ వారెంటీ కూడా అందిస్తున్నారు.

How To Set-Up JioTVCamera :

How To Set Up JioTVCamera For TV Calling
జియో టీవీ కెమెరా సెటప్​ ప్రాసెస్
  • 1. ముందుగా ఈ జియో వెబ్​క్యామ్​ను యూఎస్​బీ ద్వారా జియో సెట్​-టాప్​ బాక్స్​తో అనుసంధానం చేయాలి.
  • 2. తరువాత JioJoin యాప్​ను లాంఛ్ చేసి, అన్ని పర్మిషన్లు ఇవ్వాలి.
  • 3. వెంటనే మీకు కాన్ఫిగరేషన్ స్టార్ట్​ చేయడం కోసం Generate OTP అనే సందేశం వస్తుంది.
  • 4. మీరు దానిని క్లిక్​ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు OTP వస్తుంది.
  • 5. ఆ OTPని ఎంటర్ చేసి, Proceed బటన్​పై క్లిక్ చేయాలి.
  • 6. వెంటనే జియో సెట్​-టాప్ బాక్స్​ మీ 10 అంకెల జియో ఫిక్స్​డ్ వాయిస్ నంబర్​తో కాన్ఫిగర్ అయిపోతుంది. అంతే సింపుల్​!
  • ఈ విధంగా జియో వెబ్​క్యామ్​తో నేరుగా మీ స్మార్ట్​టీవీ నుంచే వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

చంద్రయాన్​-4కు ఇస్రో రెడీ- జాబిల్లి నుంచి మట్టి తీసుకురావడమే టార్గెట్​

ఓవర్ స్పీడింగ్ చలాన్ నుంచి తప్పించుకోవాలా? గూగుల్ మ్యాప్స్​లోని ఈ ఫీచర్ వాడండి!

Last Updated : Nov 20, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.