స్మార్ట్‌ఫోన్ అంటే ఈరోజుల్లో కేవలం ఇద్దరి మధ్య సంభాషణలకే పరిమితం కాదు. అంతకుమించి. బ్యాంకు లావాదేవీలు, ఆన్‌లైన్ పాఠాలు, వ్యాపార సమావేశాలు, ఈ కామర్స్‌లో షాపింగ్ ఇంకా ఎన్నెన్నో. ఇంత కీలకమైన ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఎవరైనా లాక్ వేసుకోవడం సహజమే కదా! మరి ఒకవేళ ఆ పాస్‌వర్డ్ లేదా పాస్ కోడ్ మర్చిపోతే ఎలా? ఎక్కువసార్లు తప్పుడు పాస్‌వర్డ్ కొట్టి ఫోన్ లాక్ అయినప్పుడు హైరానా పడొద్దు. దీనికీ ఓ మార్గముంది. కోల్పోయిన ప్రతి డేటా ఐ క్లౌడ్‌లో భద్రంగా ఉంటుంది.
పాస్‌వర్డ్ రికవరీ చేయాలంటే ముందు యూఎస్‌బీతో మన ఐఫోన్‌ని కంప్యూటర్‌తో అనుసంధానం చేయాలి. తర్వాత ఐట్యూన్స్ స్టోర్ తెరవాలి. ఫోన్‌ని రీస్టార్ట్ చేయాలి. ఇలా జరగాలంటే దీనికి ముందు కొన్ని టెక్నిక్స్ పాటించాలి. మీ ఫోన్ ఐఫోన్8 దానికి మించి అనుకోండి. ముందు వాల్యూమ్ పెంచే బటన్‌ని కొద్ది క్షణాలు నొక్కి పట్టుకోవాలి. తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ వంతు. అదేసమయంలో సైడ్ బటన్‌ని నొక్కాలి. అదే ఐఫోన్ 7 మోడల్ విషయానికొస్తే వాల్యూమ్ డౌన్, సైడ్ బటన్లను ఒకేసమయంలో నొక్కి పట్టుకోవాలి. వెంటనే 'దెర్ ఈజ్ ఏ ప్రాబ్లెమ్ విత్ ది ఐఫోన్ దట్ రిక్వైర్స్ ఇట్ టు బి అప్‌డేటెడ్ ఆర్ రీస్టోర్డ్' అని కనిపిస్తుంది. 'రీస్టోర్'ని ఎంపిక చేసుకోవాలి.
ఫోన్ రీస్టోర్ అవుతున్నప్పుడు గమనించాల్సిన విషయాలు
ఈ ప్రాసెస్ పూర్తవడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. పదిహేను నిమిషాలు అయినా పూర్తి కాలేదంటే మొత్తం ప్రక్రియను మరోసారి ముందు నుంచి మొదలుపెట్టాలి.
ఈమధ్యలో ఫోన్‌ని ఎప్పుడూ అన్‌ప్లగ్ చేయొద్దు.
రీస్టోర్ ప్రక్రియ పూర్తైన తర్వాతే ఫోన్‌ని ఉపయోగించాలి.
డేటా రీస్టోర్ చేయాలంటే..
- యాప్స్ అండ్ డేటాలోకి వెళ్లి రీస్టోర్ ఫ్రం ఐ క్లౌడ్ బ్యాకప్ ఎంచుకోవాలి.
- ఐ క్లౌడ్‌లో లాగిన్ అయిన తర్వాత మోస్ట్ రీసెంట్ బ్యాకప్ తీసుకోవాలి.
- యాపిల్ ఐడీ లాగిన్ అయితే గతంలోని యాప్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇది చదవండి:'బిట్కాయిన్తోనూ టెస్లా కారు కొనొచ్చు'