ప్రతి ఒక్కరికి డేటా ప్రైవసీ అనేది ఇప్పుడు అత్యంత కీలకం. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం వేరే వారి చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఆధునిక యుగంలో అన్ని పనులకు స్మార్ట్‌ఫోన్ వినియోగించడం పెరిగిపోయింది. మరి అందులో ఉన్న మీ వ్యక్తిగత, ఆర్థిక పరమైన సున్నిత సమాచారాన్ని ఎలా కాపాడుకోవడం చాలా మఖ్యం. అదెలానో ఇప్పుడు చూద్దాం.
వాటిని తేలిగ్గా తీసుకోకూడదు..
కొన్ని సెట్టింగ్స్‌తో మీకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయి. మరికొన్ని మ్యాప్స్ డేటా షేరింగ్ లాంటివి వ్యక్తిగత అభిష్టాలకు అనుగుణంగా ఎనేబుల్ చేసుకునేవి ఉంటాయి. అయితే ఇలాంటి వాటి వల్ల కూడా సున్నితమైన డేటా లీకయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీకు ఉపయోగం లేని సెట్టింగ్స్‌ను డిసేబుల్ చేయడం మేలు.
యాడ్స్ పర్సనలైజేషన్
గూగుల్ మీ అభిష్టానికి అనుగుణంగా ప్రకటనలను ఇస్తుంది. మీ డేటాను సేకరించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకు.. మీరు ల్యాప్‌టాప్ కొనుగోలు కోసం.. గూగుల్‌లో సెర్చ్ చేశారనుకోండి. ఆ తర్వాత వేరే ఇతర యాప్‌లు వాడినప్పుడు, వేరే వెబ్సైట్లు చూస్తున్నప్పుడు.. అందులో మీకు ల్యాప్‌టాప్‌లకు సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా వస్తుంటాయి.
యాడ్స్ పర్సనలైజేషన్ డిసేబుల్ చేయటం ద్వారా ఇలాంటి ప్రకటనలను తగ్గించుకోవచ్చు.
ఎలా డిసేబుల్ చేయాలి?
గూగుల్ యాప్‌లో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ డిసెబుల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
గూగుల్ ప్లే ఇన్స్టంట్ ఉపయోగం
చాలా మంది ఒక్క సారి అవసరానికి యాప్ డౌన్లోడ్ చేస్తుంటారు. ఆ యాప్ అడిగిన ప్రతి పర్మిషన్స్‌ను ఇస్తుంటారు. అవసరం అయిపోయాక.. ఆ యాప్‌లను అన్ ఇన్స్టాల్ చేస్తుంటారు. అయినప్పటికీ.. యాప్‌లు మీ డేటాను సేకరిస్తుంటాయి. కొన్ని యాప్‌లు డిలిట్ అకౌంట్ సదుపాయాన్ని అస్తుటాయి. దీని ద్వారా ఆ యాప్‌లు డేటాను సెకరించడం ఆపేస్తాయి. కొన్ని యాప్‌లు మాత్రం ఈ సదుపాయం ఇవ్వవు.
అలాంటి యాప్‌లను వినియోగించేందుకు.. గూగుల్‌ప్లే ఇన్ స్టంట్ అనే ఫీచర్‌ను కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇన్ స్టాల్ చేసుకునే ముందే యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌తో వ్యక్తిగత డేటా థర్డ్ పార్టీ యాప్‌ల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఎలా చేయాలి?
గూగుల్‌ప్లే యాప్ సెట్టింగ్స్‌లో జనరల్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో గూగుల్ ప్లే ఇన్ స్టంట్‌ను ఎనేబుల్ చేసుకుని.. వినియోగించుకోవచ్చు.
ప్రైవసీ సెట్టింగ్స్/డేటా యూసేజ్ షేరింగ్
సెండ్ డయగ్నోస్టిక్ డేటా, రిసీవ్ మార్కెటింగ్ ఇన్ ఫర్మేషన్ వంటి ఆప్షన్లతో స్మార్ట్‌ఫోన్.. డేటా షేరింగ్ అనుమతి అడుగుతుంది. వీటికి చాలా మంది అనుమతి ఇస్తుంటారు. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మీ డేటాను సేకకరిస్తుంటాయి. అందుకే ఈ ఆప్షన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డేటా సేకరించే ఆప్షన్‌ను ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
ఎలా చేయాలి?
ఫోన్ సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో యూసేజ్ అండ్ డయగ్నోస్టిక్ను క్లిక్ చేశాక... ఆఫ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
గూగుల్ లోకేషన్
ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా గూగుల్ మన లోకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు. ఎప్పుడు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు? దగ్గర్లోని చూడదగ్గ ప్రాంతాలు తదితరాలను వినియోగదారులకు ఈ డేటాను ఉపయోగించుకుంటుంది గూగుల్. ఇది కాస్త ప్రయోజనకరమైందే అయినప్పటికీ.. మీరు తిరిగే ప్రతి ప్రాంతం వివరాలను గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. అందుకే అవసరమైనప్పుడు తప్ప మిగతా అన్ని సార్లు లొకేషన్ డేటాను ఆఫ్ చేసుకోవడం మంచిది.
ఎలా చేయాలి?
సెట్టింగ్స్‌లో లోకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో గూగుల్ లొకేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి. అక్కడ లోకేషన్ హిస్టరీ ఉంటుంది.. దానిని డిసేబుల్ చేసుకోవాలి.
నోటిఫికేషన్లు ఆపేయండి
ఆండ్రాయిడ్‌లో అన్ని నోటిఫికేషన్లు లాక్ స్కీన్‌పై చూసుకోవచ్చు. ఈ-మెయిల్స్, ఓటీపీ సంబంధింత సందేశాలు ఎవరికైనా చాలా ముఖ్యమైనవి. పబ్లిక్‌గా ఫోన్‌ను ఉపయోగించేటప్పుడు ఇది సురక్షితం కాదు. అందుకే ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి.
ఎలా చేయాలి?
సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ కనిపిస్తాయి. అందులో ఏ యాప్ అవసరం నోటిఫికేషన్ లాక్ స్క్రీన్‌పై అవసరం లేదో దానిని డిసేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
ఇదీ చదవండి:ఫోన్ పోయిందా? గూగుల్ పే, పేటీఎంలను బ్లాక్ చేసేయండిలా..