ETV Bharat / science-and-technology

ఫోన్ పోయిందా? గూగుల్ పే, పేటీఎంలను బ్లాక్ చేసేయండిలా.. - పేటీఎం ఖాతా బ్లాక్ చేసేందుకు ఏం చేయాలి?

అనుకోకుండా ఫోన్‌ను పోగొట్టుకున్నా.. లేదా చోరీకి గురైనా అందులోని విలువైన సమాచారం ఇతరుల చేతికి చిక్కినట్లే. ఇలాంటి సందర్భాల్లో డిజిటల్ పేమెంట్స్ యాప్స్​ అయిన ఫోన్​ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఖాతాలను బ్లాక్ చేయడం ఎలానో తెలుసుకోండి..

google pay
ఫోన్ పే గూగుల్ పే పేటీఎం
author img

By

Published : Jul 23, 2021, 1:01 PM IST

ఆన్​లైన్ పేమెంట్స్​ కోసం ఇప్పుడు ప్రతీ ఫోన్​లో డిజిటల్ పేమెంట్స్ యాప్స్ తప్పనిసరి అయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్​తో(యూపీఐ) అనుసంధానమై పనిచేసే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే సహా ఇతర యాప్​ల్లో ఏదో ఒకటి ప్రతీ ఒక్కరి ఫోన్లో ఉంటుంది. ఫోన్‌ను పొగొట్టుకున్న సందర్భాల్లో ఆన్​లైన్​ చెల్లింపులకు సంబంధించిన యాప్​లలోని సమాచారం దుర్వినియోగం కావొద్దంటే ఏం చేయాలో చూద్దాం..

పేటీఎం ఖాతాను తాత్కాలికంగా ఎలా బ్లాక్ చేయాలి?

  • పేటీఎం హెల్ప్‌లైన్ నంబర్ 012 0445 6456కు కాల్ చేసి.. 'ఫోన్​ లాస్ట్ ఆప్షన్​'ను ఎంచుకోవాలి.
  • కొత్త నెంబర్​ నమోదు ఆప్షన్​ను ఎంచుకోండి.
  • పోగొట్టుకున్న ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి.
  • 'లాగ్ అవుట్ ఫ్రం' ఆల్​ డివైసెస్​ను(అన్ని ఫోన్ల నుంచి) ఎంపిక చేయండి.
  • పేటీఎం వెబ్‌సైట్‌కు వెళ్లి 24 గంటల సహాయాన్ని ఎంచుకోండి.
  • 'రిపోర్ట్ ఏ ఫ్రాడ్' లేదా మరే కారణంపైన అయినా క్లిక్ చేయండి.
  • ఇంకేమైనా చెప్పాలనుకుంటే.. 'ఎనీ ఇష్యూ'పై క్లిక్ చేసి సంస్థకు మెసేజ్ చేయాలి.
  • పేటీఎం ఖాతా లావాదేవీలను ధ్రువీకరించే డెబిట్/క్రెడిట్ కార్డ్ స్టేట్​మెంట్​ను సమర్పించాలి. అలాగే ఫోన్ పోగొట్టుకున్న/దొంగతనానికి సంబంధించి నిర్ధరణను ఇవ్వాల్సి ఉంటుంది.
  • పైన పేర్కొన్న అంశాలు పూర్తయిన తరువాత పేటీఎం మీ ఖాతాను ధ్రువీకరించి బ్లాక్ చేస్తుంది. అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ నెంబర్​కు నిర్ధరణ సందేశం వస్తుంది.

గూగుల్​ పే ఖాతాను బ్లాక్ చేయడం ఎలా?

  • గూగుల్ పే హెల్ప్‌లైన్ నెంబర్ 1800 4190 157కు కాల్ చేసి మాతృభాషను ఎంచుకోవాలి.
  • ఇతర సమస్యల కోసం సరైన ఎంపికను చేసుకోవాలి.
  • ఖాతాను బ్లాక్ చేసేందుకు నిపుణులతో మాట్లాడే ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోండి.
  • ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు 'రిమోట్ వైప్' ద్వారా వారి డేటాను రిమూవ్ చేయవచ్చు.

ఫోన్ పే ఖాతాను బ్లాక్ చేయాలంటే ఎలా?

  • ఫోన్ పే యూజర్లు 0806 8727 374 లేదా 0226 8727 374కు కాల్ చేసి వివరాలను తెలపవచ్చు.
  • వారి భాషను ఎంచుకున్న తరువాత సమస్యను తెలిపేందుకు తగిన నెంబర్​ను క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
  • ధ్రువీకరణ కోసం ఒక ఓటీపీ వస్తుంది.
  • అయితే ఓటీపీ రాలేదనే ఆప్షన్​ను ఎంపిక చేయాలి.
  • సిమ్/మొబైల్ పోయినట్లు చూపించే ఆప్షన్​లలో ఒకదాన్ని ఎంచుకోవాలి.
  • ఫోన్ నంబర్, ఈ-మెయిల్, ఫోన్​పై ద్వారా చేసిన చివరి చెల్లింపు/లావాదేవీ విలువ వంటి వివరాలను అడుగుతుంది.
  • అనంతరం మీ అకౌంట్ బ్లాక్ చేసేందుకు సంస్థ నిపుణులు అందుబాటులోకి వస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.