సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు టెక్ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హ్యాకర్స్(Cyber hackers) కొత్త పద్ధతుల్లో యూజర్ డేటాపై దాడులు చేస్తూనే ఉన్నారు. టెక్ సంస్థలు యూజర్‌కు అందించే సెక్యూరిటీ ఫీచర్లలో పటిష్ఠమైనదిగా చెప్పుకునే టూ-ఫాక్టర్ అథెంటికేషన్(రెండు అంచెల ధ్రువీకరణ)(Two factor authentication) ద్వారా కూడా మోసాలకు(Cyber hackers) పాల్పడుతున్నట్లు గుర్తించామని సైబర్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి. అమెజాన్, పేపాల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వినియోగదారులు లక్ష్యంగా ఈ మోసాలు(Cyber attack news) ఎక్కువగా జరుగుతున్నట్లు వెల్లడించాయి. ఈ తరహా మోసాల కోసం హ్యాకర్స్ ఆటోమేటెడ్ బాట్స్(యూజర్ కమాండ్ ఆధారంగా పనిచేసే రోబోట్లు)(Automated bots) ద్వారా గొంతు మార్చి యూజర్స్‌ను ఏమారుస్తున్నారని సైబర్ సంస్థలు పేర్కొన్నాయి. మోసపోతున్న వారిలో ఎక్కువ మంది టూ-ఫాక్టర్ అథెంటికేషన్ గురించి అవగాహనలేని వారే ఉన్నట్లు తెలిపాయి.
ఎలా మోసం చేస్తున్నారంటే?
ఈ-మెయిల్ లేదా ఇతర ఆన్‌లైన్ ఖాతాలకు అదనపు రక్షణ కోసం టూ-ఫాక్టర్ అథెంటికేషన్(Two factor authentication) ఫీచర్‌ను పరియం చేశారు. దీని సాయంతో యూజర్ రెండు అంచెల ధ్రువీకరణను పూర్తి చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది. వీటిలో మొదటిది ఖాతా యూజర్ నేమ్, పాస్‌వర్డ్. రెండోది యూజర్ ఈ-మెయిల్, మొబైల్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్. వీటిలో ఏది సరిగా ఎంటర్ చేయకపోయినా ఖాతాను యాక్సెస్ చేయలేం. ఇప్పుడు హ్యాకర్స్ ఈ రెండో దశలో వచ్చే వెరిఫికేషన్ కోడ్ లక్ష్యంగా యూజర్స్‌కు(Cyber attack news) ఫోన్ చేసి అధీకృత కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా వారిని నమ్మిస్తున్నారు. ఆటోమేటెడ్ బాట్స్ సాయంతో కాల్స్ చేస్తుండటంతో యూజర్స్ వాటిని నకిలీవిగా గుర్తించలేకపోతున్నారు.
రోబోట్ వాయిస్ కావడంతో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారనే భ్రమలో యూజర్స్ ఉండిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్స్ యూజర్ నుంచి వెరిఫికేషన్ కోడ్‌ను సేకరించి వారి డేటా దొంగలించడం సహా, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సైబర్ సంస్థలు వెల్లడించాయి. ఒకవేళ యూజర్ వెరిఫికేషన్ కోడ్ గురించి ప్రశ్నిస్తే.. ఖాతాలను మరింత భద్రత కల్పించడం సహా, అనుమానాస్పద లావాదేవీలు జరగకుండా ఉండేందుకేనని నమ్మిస్తున్నారని తెలిపాయి. దీంతో టూ-ఫాక్టర్ గురించి అవగాహనలేని యూజర్స్ వెరిఫికేషన్ కోడ్‌ను హ్యాకర్స్‌కు(Cyber hackers) చెప్పేస్తున్నారు. దాంతో వారు సులువుగా యూజర్స్ డేటాను దొంగలిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో చర్చలు
హ్యాకర్స్ కోసం ఆటోమేటెడ్ బాట్స్(Automated bots) సాంకేతికతను సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తున్నారని సైబర్ సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాకుండా వీటిని ఎలా ఉపయోగించాలి? వాటితో ఎంత మందిని మోసం చేశామనే వివరాలను కూడా హ్యాకర్స్ సామాజిక మాధ్యమాల్లో ఇతరులతో షేర్ చేసుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. ఇందుకోసం హ్యాకర్స్ సామాజిక మాధ్యమాల్లో గ్రూపులుగా ఏర్పడి రహస్య సంభాషణలు సాగిస్తున్నారని వెల్లడించాయి.
మరి టూ-ఫాక్టర్ అథెంటికేషన్ భద్రమేనా?
హ్యాకర్స్‌కు యూజర్ వెరిఫికేషన్ కోడ్ చెప్పనంత వరకు టూ-ఫాక్టర్ అథెంటికేషన్(Two factor authentication) ఖాతాలకు పటిష్ఠమైన రక్షణ కల్పిస్తుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే యూజర్ వెరిఫికేషన్ కోడ్‌ను ఇతరులతో షేర్ చేస్తారో ఆ క్షణమే భద్రత కోల్పోతారని చెబుతున్నారు. యూజర్స్ ఎప్పుడూ టూ-ఫాక్టర్ అథెంటికేషన్ కోడ్‌ను ఇతరులతో షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: