ETV Bharat / science-and-technology

గూగుల్​ పే షాక్​! మొబైల్​ రీచార్జ్​ చేస్తే ఎక్స్​ట్రా కట్టాల్సిందే! - మొబైల్ రీఛార్జ్​లపై గూగుల్​పే నూతన ఛార్జిలు

Google Pay Charges For Mobile Recharge : గూగుల్ పే ద్వాారా చేసే మొబైల్ రీఛార్జ్​లపై ఆ సంస్థ కన్వీనియన్స్ ఫీజును విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ నెటిజన్​ సామాజిక మాద్యమం ఎక్స్​లో పోస్ట్ చేశారు. అయితే దీనిని గూగుల్ పే సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

google pay charges for mobile recharge
google pay charges for mobile recharge
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 4:45 PM IST

Google Pay Charges For Mobile Recharge : వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది ఆన్​లైన్​ చెల్లింపుల సంస్థ గూగుల్ పే. యూపీఐ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు కొత్తగా రూ. 3 కన్వీనియన్స్ ఛార్జీలను విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, రూ.3 ఛార్జీ విధించిన విషయాన్ని ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రూ. 3 కన్వీనెన్స్​ ఫీ
Google Pay Convenience Fee : ఇప్పటికే ఫోన్​ పే, పేటీఎం లాంటి సంస్థలు యూపీఐ ద్వారా చేసే మొబైల్​ రీఛార్జ్​లకు రుసుమును వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్ పే కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ముకుల్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్​లో సంబంధిత పోస్ట్​ను షేర్​ చేశారు. ఆయన గూగుల్ పే యాప్ ద్వారా రూ. 749 రూపాయలు జియో ప్రీపెయిడ్ రీచార్జ్​ చేసుకున్నారు. దీనిపై రూ.3 కన్వీనియన్స్ ఫీజు​ విధించినట్లుగా మెసేజ్​ వచ్చింది.

'రూ.100 లోపు రీఛార్జ్​లకు వర్తించదు'
అయితే రూ. 100లోపు గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఈ నిబంధన వర్తించదని ముకుల్ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్​లో షేర్​ చేశారు. ఆ పోస్ట్ ప్రకారం రూ. 100 నుంచి రూ.200 వరకు కన్వీనియన్స్​ ఛార్జ్​ రూ.2లు, రూ. 200 నుంచి రూ.300 వరకు చేసే రీఛార్జ్​లపై రూ.3 లు ఛార్జ్ చేస్తుంది. రూ.300పైన చేసిన రీఛార్జులకు కూడా రూ. 3 ఛార్జీ ఉందని ముకుల్ శర్మ తెలిపారు.

కన్వీనియన్స్​ ఫీజుకు సంబంధించి నవంబర్ 10న అప్​డేట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గూగుల్ పే నిబంధనల ప్రకారం ఏదైనా కొనుగోలు పూర్తి చేయడానికి ముందు సంబంధిత ఖర్చుల గురించి వినియోగదారులకు తెలియజేస్తామని పేర్కొంది. మరోవైపు గూగుల్ తన సేవా నిబంధనలను భారత్​ వినియోగదారులకు ఇటీవలే అప్​డేట్ చేసింది. అయితే ఈ కన్వీనియన్స్​ ఫీజు విధింపు నవంబర్ 10న అప్​డేట్ చేసిన నిబంధనల్లో భాగమా అనేది అస్పష్టంగా ఉంది. లావాదేవీనీ పూర్తి చేయడానికి ముందు వర్తించే ఛార్జ్​ల గురించి వినియోగదారులకు తెలుసుకునేవిధంగా ఈ నిబంధనలు ఉన్నాయి.

ఉచితంగా "నెట్​ఫ్లిక్స్" సబ్​స్క్రిప్షన్ కావాలా​? మొబైల్ రీఛార్జ్ చేస్తే చాలు!!

ఈ చిన్న పనితో- బ్యాంక్​ అకౌంట్​కు 30వేల రూపాయలు, ఇప్పుడే ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.