గూగుల్ తన ప్రైవసీ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల సమాచారాన్ని అడ్వర్టైజింగ్ కంపెనీలు పసిగట్టకుండా కొత్త అప్డేట్ను తీసుకొస్తోంది. యాడ్ కంపెనీలు తమ ఫోన్లను ట్రాక్ చేయకుండా ఉంచే ఆప్షన్‌ను ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్‌ను సంస్థ ప్రవేశపెట్టనుంది. గూగుల్ ప్లే(Google Play) సర్వీస్ అప్డేట్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. ఈ ఆప్షన్‌ను వినియోగదారులు ఎంచుకుంటే.. డెవలపర్లు యూజర్ల అడ్వర్టైజింగ్ ఐడీని చూసే అవకాశం ఉండదు. దీని ద్వారా వ్యక్తిగత ప్రాధాన్యమైన(personalized ads) యాడ్లు రావడం తగ్గుతుంది.
యాడ్ ట్రాకింగ్‌పై యూజర్లకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్(Google) కొన్ని నెలల నుంచి ప్రయత్నిస్తోంది. 2022 నాటికి ప్లే స్టోర్‌లో సేఫ్టీ సెక్షన్‌ను తీసుకురానున్నట్లు ఇదివరకే వెల్లడించింది.
ఇదీ చదవండి- భారత్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే...