ETV Bharat / science-and-technology

కీబోర్డ్​ను ముట్టుకోకుండా.. కంప్యూటరే టైప్ చేస్తే! - MIT lab

కీబోర్డుని ముట్టుకోకుండా, నోరు తెరిచి చెప్పకుండా మీరు అనుకున్నది కంప్యూటరు టైప్‌ చేయగలిగితే..! ఆ అసాధ్యాన్నీ సాధ్యం చేసి చూపించారు ఎంఐటీ మీడియా ల్యాబ్‌ పరిశోధకులు. మనం చేయాల్సిందల్లా ఒక చిన్న హెడ్‌సెట్‌ తలకు పెట్టుకోవటమే.

MIT lab innovated alert ego
కీబోర్డ్​ను ముట్టుకోకుండా.. కంప్యూటరే టైప్ చేస్తే
author img

By

Published : Dec 27, 2020, 2:43 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

సీరియస్‌గా పనిచేసేటప్పుడు సడెన్‌గా పాప పుట్టినరోజు ఏ వారమయ్యిందో అన్న సందేహం వచ్చిందనుకోండి, అది తెలుసుకోడానికి చేస్తున్న పని ఆపి కంప్యూటర్‌లోనో, ఫోన్‌లోనో క్యాలెండర్​ తెరిచి చూడాలి. ఎంఐటీ ఆల్టర్‌ఈగోతో ఆ అవసరం ఉండదు. తెలుసుకోవాలనుకున్న విషయాన్ని బయటకు వినపడకుండా నోట్లో అనుకుంటే చాలు. అది కంప్యూటర్‌కి సూచనలు పంపించి గూగుల్‌లో సెర్చ్‌ చేసేసి మీ సందేహానికి సమాధానాన్ని మీకు మాత్రమే విన్పించే స్పీకర్‌ ద్వారా చెప్పేస్తుంది.

రోడ్డు మీద వెళ్తున్నారు, టైమ్‌ ఎంతయిందో తెలుసుకోవాలి. టైమ్‌ అన్న మాట లోపల అనుకుంటే చాలు సమాధానం వినిపిస్తుంది. తలనీ, మెడనీ, దవడనీ కలుపుతూ ఉండే హెడ్‌సెట్‌ మీద ఉన్న ఎలక్ట్రోడ్స్‌ మనం మనసులో అనుకున్న మాటని గొంతుకు చేరవేసే సంకేతాల్ని డీకోడ్‌ చేస్తాయన్నమాట. అర్ణవ్‌ కపూర్‌, శ్రేయస్‌ కపూర్‌లు దీన్ని తయారు చేశారు. ఈ సరికొత్త ఇంటర్‌ఫేస్‌.. మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, ఏఎల్‌ఎస్‌ లాంటి జబ్బులతో బాధపడేవారికీ గొంతు సమస్యలు ఉన్నవారికీ వరమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.