ETV Bharat / science-and-technology

లైఫ్‌ స్టైల్‌ని మార్చేస్తాయ్‌.. ఓ లైక్‌ వేసుకోండి.! - హైదరాబాద్​ వార్తలు

ఒకటా.. రెండా.. ఎన్నో గ్యాడ్జెట్‌లు రోజూ మార్కెట్‌లో సందడి చేస్తుంటాయి‌. కానీ, వాటిల్లో కొన్నే భిన్నమైన ప్రయోజనాలతో టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకుంటాయి‌. లైఫ్‌స్టైల్‌ని మార్చుకునేలా చేస్తాయి‌. వాటిల్లో కొన్ని ఇవిగోండి. కావాలంటే.. మీరూ ప్రయత్నించొచ్చు..!

లైఫ్‌ స్టైల్‌ని మార్చేస్తాయ్‌.. ఓ లైక్‌ వేసుకోండి.!

author img

By

Published : Mar 5, 2021, 12:47 PM IST

ఎగిరే సెక్యూరిటీ కెమెరా...

ఎగిరే సెక్యూరిటీ కెమెరా...
ఎగిరే సెక్యూరిటీ కెమెరా...

ఇంట్లో రక్షణ నిమిత్తం సెక్యూరిటీ కెమెరాల్ని వాడుతున్నాం. పలుచోట్ల వాటిని గోడకో.. గుమ్మానికో.. టేబుల్‌పైనో బిగిస్తాం. కెమెరాల సామర్థ్యం మేరకు నిత్యం అవి నిఘా కళ్లతో చూస్తుంటాయి. ఇక మీరు ఎక్కడున్నా ఫోన్‌లో ఆయా కెమెరాల్ని ఇన్‌స్టాల్‌ చేసిన చోట ఏం జరుగుతుందో నిత్యం గమనించొచ్చు. బాగానే ఉందిగానీ.. మీరెప్పుడైనా ఎరిగే సెక్యూరిటీ కెమెరాల్ని చూశారా? అంటే.. ఇంట్లో ఒకేఒక కెమెరా ఉంటుంది. దానికి ఇంట్లో ఏదైనా అలికిడి అయినట్టుగా అనుమానం వస్తే.. బేస్‌ స్టేషన్‌ నుంచి ఎగిరి ఇల్లు మొత్తాన్ని చుట్టేస్తుంది. నలుమూలల్లోనూ ఎవరైనా ఉన్నారా? అని చెక్‌ చేస్తుంది. ఇదిగోండి.. ఇదే ఆ ఫ్లైయింగ్‌ సెక్యూరిటీ కెమెరా. పేరు ‘రింగ్‌’. డ్రోన్‌లో ఇంట్లో ఎగిరేలా చేయొచ్చు. ప్రత్యేక రింగ్‌ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఎగిరే సమయంలో వీడియో స్ట్రీమింగ్‌ని చూడొచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్నప్పటికీ త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది.

ఇంటికో డిజిటల్‌ తాళం..

ఇంటికో డిజిటల్‌ తాళం..
ఇంటికో డిజిటల్‌ తాళం..

ఏదైనా ఊరు వెళ్లేటప్పుడు తాళం సరిగా వేశామా? లేదా? అని వెనక్కి వెళ్లి చెక్‌ చేస్తుంటాం. తాళం చెవిని భద్రంగా బ్యాగులోనో.. జేబులో వేసుకుంటాం. ఇది ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయ పద్ధతి. కానీ, ఇకపై ఇళ్లన్నీ స్మార్ట్‌గా మారిపోనున్నాయ్‌. డిజిటల్‌ తాళాలతో రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. కావాలంటే.. ‘హఫిల్‌ ఆర్‌ఈ-వీల్‌ డిజిటల్‌ డోర్‌ లాక్‌’ని చూడండి. సంప్రదాయ చెక్క తలుపుకే ఈ స్మార్ట్‌ తాళాన్ని అమర్చుకోవచ్చు. తాళం వేశాక.. మీ ముఖమే కీ. డోరు ముందు నిలబడితే చాలు. అన్‌లాక్‌ అవుతుంది. కావాలంటే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌తోనూ ఓపెన్‌ చేయొచ్చు. మరో మార్గం.. పాస్‌వర్డ్‌. ఫోన్‌కి పిన్‌ నెంబర్‌ని పెట్టుకున్నట్టుగానే ఇంటికీ పాస్‌వర్డ్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఇతరులు ఎవరైనా ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. వారి ఫొటోలు తీయడంతో పాటు యజమానుల్ని అలారం ద్వారా అప్రమత్తం చేస్తుంది.

అతికించండి.. దొరికేస్తాయ్‌!

అతికించండి.. దొరికేస్తాయ్‌!
అతికించండి.. దొరికేస్తాయ్‌!

అర్జెంటుగా బయటికి వెళ్లాలి.. సమయానికి కార్‌ కీస్, పర్సు ఇలా అవసరమైంది దొరకదు.. అప్పుడు తెగ ఇబ్బంది పడతాం. ఇంకెప్పుడైనా ఫోన్‌ సైలెంట్‌లోకి వెళ్లిపోతుంది.. ఎంత వెతికినా కనబడదు. ఇలాంటి సందర్భాల్లో సింపుల్‌గా మీ ఫోన్‌ లేదా వస్తువు ఎక్కడుందో చెప్పే ఓ పరికరం ఉంటే.. బాగుంటుంది కదా..! అవును అలాంటిదే ఈ ‘టైల్‌’. మీ స్మార్ట్‌ఫోన్‌లో టైల్‌ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ టైల్‌ని కనెక్ట్‌ చేసుకుంటే సరి. మీ ఐప్యాడ్, ట్యాబ్, కార్‌ కీస్, కెమెరా, ల్యాప్‌టాప్, పర్సు ఇలా కావాల్సిన వస్తువుకు దీన్ని అతికించుకొని ఆ వస్తువులను కనుక్కోవచ్చు. ఆ వస్తువు ఎక్కడుందో తెలిపేందుకు టైల్‌ ఒక రింగ్‌ ఇస్తుంది. మ్యాప్స్‌ ద్వారా చివరిసారిగా ఆ వస్తువు ఉన్న ప్రదేశం చెబుతుంది కూడా. బ్లూటూత్‌తో ఇది పని చేస్తుంది. మీ ఫోన్‌ కనిపించకపోతే సింపుల్‌గా మీ టైల్‌ డివైజ్‌ని రెండు సార్లు క్లిక్‌ చేస్తే చాలు.. ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా రింగ్‌ అవుతుంది. మీ ల్యాపీ లేదా ఫోన్‌కి ఏవైనా గ్రాఫిక్స్‌తో కూడిన స్కిన్స్‌ని వాడుతున్నట్లయితే.. వాటికి తగిన డిజైన్‌ని టైల్‌లో సెలెక్ట్‌ చేసుకోవచ్చు.

అన్నింటికీ ఒక్కటి చాలు..!

అన్నింటికీ ఒక్కటి చాలు..!
అన్నింటికీ ఒక్కటి చాలు..!

ల్యాప్‌టాప్‌తో ఫోన్‌ని ఛార్జ్‌ చేయాలంటే యూఎస్‌బీ కేబుల్‌ని కనెక్ట్‌ చేస్తాం. ఫోన్‌తో పాటు ఐప్యాడ్, ట్యాబ్లెట్‌.. ఇలా మిగతా పరికరాల్ని కనెక్ట్‌ చేయాలంటే మరో కనెక్టర్‌ ఏదైనా జోడిస్తాం. అదీ సరిపోకపోతే.. అప్పుడేంటి పరిస్థితి? అందుకే ఈ ‘ఆల్‌హబ్‌’. ఇది యూఎస్‌బీ-టైప్‌ సీ హబ్‌. మూడు యూఎస్‌బీ 3.0 పోర్టుల సదుపాయం ఉండటంతో పలు డివైజ్‌లను ఒకేసారి ఛార్జ్‌ చేయవచ్చు. డేటాని వేగంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు కూడా. అంతేకాదు దీనిపై భాగంలో స్మార్ట్‌ఫోన్‌ని ఉంచి వైర్‌లెస్‌గా ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఎస్‌డీ, మైక్రోఎస్‌డీ కార్డుల్ని ఇన్‌సర్ట్‌ చేయడానికి ప్రత్యేక స్లాట్‌లు ఉన్నాయి. ఈథర్నెట్, హెడ్‌ఫోన్‌ జాక్, మైక్రోఫోన్‌ సదుపాయాలున్నాయి. తక్కువ బరువుండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.

ప్రయాణాల్లో రక్షణ

ప్రయాణాల్లో రక్షణ
ప్రయాణాల్లో రక్షణ

బ్యాగు సర్దుకునేటప్పుడే దుస్తుల్లో ఒదిగిపోతుంది. దూర ప్రాంతాలకు విమానాల్లో వెళ్లాల్సివస్తే మీ మొత్తం లగేజికీ ఈ బుజ్జి ‘ట్రాక్‌డాట్‌’ పరికరం రక్షకుడిగా మారిపోతుంది. అందుబాటులో ఉన్న సెల్యులర్‌ నెట్‌వర్క్‌ని వాడుకుని తన ఉనికి చేరవేస్తుంది. ఉదాహరణకు విమాన ప్రయాణాల్లో చెక్‌ఇన్‌ అయ్యాక లగేజీ దారిన అది వెళ్లిపోతే తిరిగి మీ చేతికి వచ్చే వరకూ బ్యాగు లేదా సూట్‌కేస్‌ని కృత్రిమ మేధస్సుతో నిఘా వేస్తుంది. విమానం టేకాఫ్‌ అవ్వగానే విమానయాన షరతుల ప్రకారం ప్రత్యేక సెన్సర్‌ వ్యవస్థతో ఆటోమాటిక్‌గా పరికరం స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. తిరిగి ఎప్పుడైతే విమానం ల్యాండ్‌ అవుతోందో వెంటనే ఆన్‌ అయ్యి లైవ్‌ ట్రాకింగ్‌ ద్వారా బ్యాగు మీ చేతికి చేరే వరకూ మొబైల్‌ తెరపై చూపిస్తుంది. ఊదాహరణకు మన దేశంలో రుచికరమైన వంటల్ని అమెరికాలో ఉన్న బంధులకు పంపుతున్నట్లయితే ట్రాకర్‌ని పార్సిల్‌లో ఉంచితే చాలు. పంపిన అడ్రస్‌కి చేరే వరకూ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ చూడొచ్చు అన్నమాట. ఒకవేళ తప్పు అడ్రస్‌కి చేరితే వెంటనే అలర్ట్‌ అవ్వొచ్చు.

ఇదీ చూడండి: ఆరోగ్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. టింటో ర్యాంగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.