Free Apple Music Subscription : యాపిల్ అభిమానులకు శుభవార్త. కొత్త ఐఫోన్ సహా, ఎయిర్‌పాడ్స్, హోమ్‌పాడ్స్, బీట్స్ లాంటి ఎలిజిబుల్ ఆడియో డివైజ్‌లు కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా సరికొత్త యాపిల్ పరికరాలు కొన్న కొత్త కస్టమర్లకు 6 నెలలపాటు యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.
100 మిలియన్స్‌కు పైగా!
యాపిల్ కంపెనీ ప్రకారం, 'కస్టమర్లు డాల్బీ అట్మోస్‌తో కూడిన స్పేషియల్ ఆడియోతో 100 మిలియన్లకు పైగా పాటలను వినవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ప్రకటనలు, అంతరాయాలు లేకుండా.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగానూ సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.'
యాపిల్ ఆడియో డివైజ్‌లు కొన్నవారు.. ఫ్రీ యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ పొందడం ఎలా?
How To Get Free Apple Music With New Airpods :
- యాపిల్ మ్యూజిక్ వాడాలంటే.. ముందుగా మీ ఐఫోన్ లేదా ఐపాడ్లో లేటెస్ట్ iOS లేదా iPadOS వెర్షన్ ఉండాలి. ఒక వేళ లేకపోతే అప్డేట్ చేసుకోవాలి.
- మీ ఐఫోన్ లేదా ఐపాడ్‌కు.. యాపిల్ ఆడియో డివైజ్‌ను అనుసంధానం (Pair) చేయాలి.
- మీ ఐఫోన్ లేదా ఐపాడ్లో యాపిల్ మ్యూజిక్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
- యాపిల్ మ్యూజిక్ యాప్‌లో .. యాపిల్ ఐడీతో సైన్ ఇన్ కావాలి.
- మీకు అక్కడ 6 నెలల యాపిల్ మ్యూజిక్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది.
- ఒక వేళ మీకు అక్కడ ఉచిత మ్యూజిక్ ఆఫర్ కనిపించకపోతే.. Listen Now Tabని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఫ్రీ మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తుంది.
- మీరు Get 6 months Free ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే ఇకపై మీరు ఉచితంగా లక్షలాది యాపిల్ పాటలను ఆస్వాదించవచ్చు.
ఫ్రీ యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ - ఎలిజిబుల్ డివైజ్‌లు
Free Apple Music Eligible Devices : ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్‌పాడ్స్ (సెకెండ్, థర్డ్ జనరేషన్), ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, హోమ్‌పాడ్, హోమ్‌పాడ్ మినీ, బీట్స్ ఫిట్ ప్రో, బీట్స్ స్టూడియో బడ్స్, పవర్‌బీట్స్, పవర్‌బీట్స్ ప్రో, బీట్స్ సోలో ప్రో, బీట్స్ స్టూడియో బడ్స్ +, బీట్స్ స్టూడియో ప్రో.
ఐఫోన్ వినియోగదారులు ఫ్రీ యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ పొందడం ఎలా?
How To Get Free Apple Music With New iPhone :
- మొదటిగా మీరు కొన్న కొత్త ఐఫోన్లో యాపిల్ ఐడీతో సైన్ ఇన్ కావాలి.
- మీ సరికొత్త ఐఫోన్లో లేటెస్ట్ వెర్షన్ ఐవోఎస్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తరువాత..
- యాపిల్ మ్యూజిక్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
- యాప్ ఓపెన్ అయిన వెంటనే.. మీకు యాపిల్ మ్యూజిక్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది.
- ఒక వేళ అక్కడ కనిపించకపోతే.. Listen Now Tabను క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఫ్రీ మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తుంది.
- Get 6 months free ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే మీరు లక్షలాది పాటలు ఉచితంగా, ఎలాంటి అంతరాయం లేకుండా 6 నెలలపాటు ఆస్వాదించవచ్చు.
నోట్ : ఐఫోన్లను నేరుగా యాపిల్ స్టోర్‌లో కొనుక్కోవచ్చు. లేదా ఆథరైజ్డ్ యాపిల్ రీసెల్లర్స్ దగ్గర అయినా కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి లేటెస్ట్ వెర్షన్ ఐవోఎస్ రన్ అవుతున్న ఏ ఐఫోన్లో అయినా.. ఈ యాపిల్ మ్యూజిక్ యాప్‌ను వాడుకోవచ్చు.
ఐఫోన్ 15 లాంఛ్ ఎప్పుడంటే!
IPhone 15 Launch Date : యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 12 రాత్రి 10.30 గంటలకు 'వండర్లస్ట్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నారు. బహుశా ఆ ఈవెంట్లోనే న్యూ ఐఫోన్ 15 సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ ఆల్ట్రా 2 సహా పలు డివైజ్‌లను లాంఛ్ చేసే అవకాశం ఉంది.