ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో​ ఐదు సరికొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్​లో సూపర్​ ఫన్! - టెక్నాలజీ వార్తలు

Whatsapp new features: వినియోగదారుల కోసం వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన ఈ మెసెంజర్​ దిగ్గజం త్వరలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ వెర్షన్ల కోసం ఐదు కొత్త ఫీచర్‌లను పరిచయం చేయనుంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

five new features whatsapp bringing to its users very soon
వాట్సాప్​లో​ ఐదు సరికొత్త ఫీచర్లు.. చాటింగ్​లో కొత్త ఆప్షన్లు!
author img

By

Published : Mar 2, 2022, 2:03 PM IST

Whatsapp latest Features: ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులను కలిగిన మెసెంజర్​ వాట్సాప్​. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్యను మరింత పెంచుకుంటోంది. మెటాలో భాగమైన ఈ దిగ్గజ యాప్​ త్వరలోనే ఆండ్రాయిడ్​, ఐఓఎస్ యూజర్ల కోసం ఐదు అత్యాధునిక ఫీచర్‌లను తీసుకురానుంది. డెస్క్​టాప్​, వెబ్​ వెర్షన్లను కూడా అప్డేట్ చేయనుంది. సరికొత్త సెక్యూరిటీ ఫీచర్​ను జతచేయనుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. అడ్మిన్​కు ఆ అధికారం..

వాట్సాప్​ గ్రూప్​లలో ఎవరైనా మేసేజ్​లు పెడితే వాటిని డిలీట్​ చేసే అధికారం ఆ యూజర్​కు తప్ప మరెవరికీ లేదు. అయితే కొత్త ఫీచర్​తో ఈ సమస్య తొలగిపోనుంది. గ్రూప్​లో ఎవరు పోస్ట్​ పెట్టినా దాన్ని డిలీట్ చేసే అధికారం ఇకపై అడ్మిన్​కు ఉండనుంది. దీనివల్ల అనవసర, అభ్యంతరకర కంటెంట్​ను గ్రూప్​ నుంచి తొలగించవచ్చు.

2. రెండు దశల వెరిఫికేషన్​

వెబ్​​/ డెస్క్​టాప్​ వెర్షన్​లలోనూ 2 స్టెప్ వెరిఫికేషన్​ను తీసుకురానుంది వాట్సాప్​. ఈ ఫీచర్​లో మీ ఖాతాను మరే ఇతర కంప్యూటర్​లోనూ ఎవరూ ఉపయోగించలేరు.

3. రియాక్షన్​ ఆప్షన్..

మెసెంజర్​, ఇన్​స్టాగ్రామ్​లో మెసేజ్​లకు రియాక్షన్​ పంపే వెసులుబాటు ఉంది. ఇప్పుడు అలాంటి ఫీచర్ వాట్సాప్​లో కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్ల మధ్య సంభాషణ మరింత బాగా జరుగుతుందని సంస్థ భావిస్తోంది.

4. యానిమేటెడ్ ఎమోజీలు..

చాటింగ్​లో యానిమేటెడ్ ఎమోజీలు చాలా తమాషాగా ఉంటాయి. టెలిగ్రామ్​లో ఈ ఫీచర్​ వినియోగదారులను బాగా ఆకర్షించింది. దీంతో తాను కూడా ముందుండాలని కొత్త యానిమేటెడ్​ ఎమోజీలను యూజర్లకు అందుబాటులో ఉంచాలని వాట్సాప్​ భావిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్​ను కూడా తీసుకురానుంది.

Whatsapp communities feature

5. కమ్యూనిటీ ఫీచర్​..

కమ్యూనిటీస్​ అనే ఆసక్తికరమైన కొత్త ఫీచర్​ను తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. ఇది గ్రూప్​ చాట్ ఫీచర్​. అంటే ఒక గ్రూప్​లో ఉన్న సభ్యులతో అందులోనే వేర్వేరు కమ్యూనిటీలను క్రియేట్​ చేసుకునే సదుపాయం. సింపుల్​గా చెప్పాలంటే గ్రూప్​లో మరో గ్రూప్​ అన్నమాట.

ఇదీ చదవండి: ఈ తప్పులు చేస్తున్నారా?.. అయితే మీ వాట్సాప్​ అకౌంట్​ బ్లాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.