ETV Bharat / science-and-technology

ఫాస్ట్​ ఛార్జింగ్​తో స్మార్ట్​ ఫోన్​ బ్యాటరీ లైఫ్​ తగ్గుతుందా? - ఫాస్ట్​ ఛార్జింగ్​ లాభాలు

మొబైల్​ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు వచ్చే దాదాపు అన్ని మోడళ్లు ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్​తోనే వస్తున్నాయి. అయితే.. ఫాస్ట్​ ఛార్జింగ్​తో బ్యాటరీ డ్యామేజ్​​ అవుతుందని.. ఫోన్​ పేలిపోతుందని అంటుంటారు. ఇంతకీ ఫాస్ట్​ ఛార్జింగ్​ మంచిదేనా? ఫాస్ట్​ ఛార్జింగ్ ఫోన్లు​ వాడొచ్చా..? అనే విషయాలు తెలుసుకుందాం.

fast charging disadvantages fast charging myths

author img

By

Published : Apr 6, 2023, 1:14 PM IST

స్మార్ట్​ ఫోన్స్​ను మోడ్రన్​ మార్వెల్స్ అంటుంటారు​. వీటి వల్ల కుర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. అనేక పనులను ఫింగర్ టిప్​తో చేయవచ్చు. సాంకేతికత పెరగడం వల్ల స్మార్ట్​ ఫోన్లలో రకరకాల ఫీచర్లు వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఫాస్ట్ ​ఛార్జింగ్​. అయితే, దీనిపై చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్​ వల్ల ఫోన్​ ఎక్కువ వేడెక్కితే బ్యాటరీ డ్యామేజ్​​ అవుతుందని.. ఫోన్​ పేలిపోతుందని అనుకుంటారు. అలాంటి వాటి గురించి నిజానిజాలు ఏమిటో తెలుసుకుందాం.

ఫోన్​ బ్యాటరీలలో కెమికల్​ ప్రాసెస్​ నిరంతరాయంగా జరుగుతుంది. సాధారణంగా ఫోన్​ బ్యాటరీలలో లిథియం కోబాల్ట్​ ఆక్సైడ్​, గ్రాఫైట్​ అనే రెండు లేయర్లు ఉంటాయి. అయాన్లు.. గ్రాఫైట్​ లేయర్ నుంచి ఎలెక్ట్రోలైట్​ ద్రావణం గుండా కోబాల్ట్​ లేయర్​కు వెళతాయి. దీంతో ఎలక్ట్రాన్స్​ రిలీజ్​ అవుతాయి. మనం ఛార్జింగ్​ చేసేటప్పుడు అపశవ్య దిశలో వెనుక్కు వెళ్లి.. మనం ఫోన్​ వాడుతున్నప్పుడు తిరిగి అదే ప్లేస్​లో స్టోర్ అవుతాయి. రిలీజ్​ అయిన ఎలక్ట్రాన్​ ఫ్లో వల్ల మన ఫోన్​ నడుస్తుంది. ఈ సమయంలో విడుదలయ్యే ఎనర్జీ.. వేడిని పుట్టిస్తుంది. అదే మనం అప్పుడప్పుడు ఫోన్​ ఛార్జింగ్​ చేసినప్పుడు ఫీల్​ అవుతుంటాం. అయితే, సుదీర్ఘ కాలంలో ఆ వేడి.. ఫోన్​ బ్యాటరీని డ్యామేజ్​​ చేస్తుంది.

ఫాస్ట్​ ఛార్జింగ్​లో​.. ఇదే జరుగుతుంది!
ఇలాంటి ఛార్జింగ్​​ సైకిల్స్​ జరిగేకొద్దీ.. బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది. దానికి కారణం అందులో ఉన్న ఎలెక్ట్రోలైట్​ ద్రావణం.. ఘన పదార్థంగా మారుతుంది. కాని కారణంగా ఐయాన్ల ఫ్లోను అడ్డుకుంటుంది. అందుకే పాతబడ్డకొద్దీ ఛార్జింగ్​ కెపాసిటీ దెబ్బతింటుంది. ఫోన్​కు ఫాస్ట్​ ఛార్జింగ్​.. పెడితే.. ఎక్కువ పవర్​ వెళ్లి ఎలెక్ట్రోలైట్​ ద్రావణం త్వరగా ఘన పదార్థంగా మారుతుంది. దీంతో బ్యాటరీ చాలా వేగంగా వేడెక్కి బ్యాటరీ లైఫ్​ తగ్గుతుంది. అంతేకాకుండా, వేడి వాతావరణంలో ఫోన్​ను ఉంచినా ఇలాగే జరుగుతుంది.

ఫాస్ట్​ ఛార్జింగ్..​ మంచిది కాదా?
ఫాస్ట్​ ఛార్జింగ్​ మన ఫోన్​కు మంచిది కాదా? ఈ ప్రశ్నకు అవును, కాదు.. అని రెండు జవాబులున్నాయి. ఫాస్ట్​ ఛార్జర్​తో ఎక్కువ పవర్​ను ఎక్కువసేపు ఫోన్​కు ఇస్తే.. బ్యాటరీ పాడైపోతుంది. అయితే, ఇప్పుడు వస్తున్న ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ మేనేజ్​మెంట్​ ఫీచర్లు ఉంటున్నాయి. దాంతో అలాంటి బ్యాటరీ డ్యామేజ్​​లు అరుదుగా జరుగుతాయి.

ఫాస్ట్​ ఛార్జింగ్​ వాడొచ్చా..?
ఇంతకుముందు వచ్చిన ఫాస్ట్​ ఛార్జింగ్​లో.. ఛార్జింగ్​ త్వరగా అయి బ్యాటరీలు ఎక్కువ వేడెక్కేవి. అప్పటి ఫోన్లలో వేడి త్వరగా బయటకు వెళ్లడానికి ఏ ఆప్షన్లు ఉండేవి కావు. ప్రస్తుతం ఉన్న ఫోన్లు మంచి వెంటిలేషన్​తో వస్తున్నాయి. అందుకే ఇలాంటి సమస్యలు తగ్గుతున్నాయి. బ్యాటరీలకు ఎంత పవర్​ వెళ్లాలి అని మనం నిర్ణయించుకోవచ్చు. వేడిని కూడా నియంత్రించొచ్చు. దానికోసం ఫోన్లకు హీట్ షీల్డ్స్​, థర్మల్​ లేయర్లతో పాటు వేడిని బయటకు పంపడానికి కూలింగ్​ పైపులు కూడా అమర్చుతున్నారు. ఇక, బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్​గా ఆగిపోవడానికి ప్రోగ్రామింగ్​ చేస్తున్నారు. కొన్ని ఫోన్లు కూలింగ్​ ఫ్యాన్లతో కూడా వస్తున్నాయి.
మన బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ పవర్​ అవసరం అవుతుంది. అదే ఫోన్​ 100 శాతం ఛార్జింగ్ ఉన్నప్పుడు.. 80W పవర్​ అవసరం ఉండదు. అంటే ఛార్జింగ్​ అవుతున్నంత సేపు పవర్​ ఒకేలా అవసరం రాదు. దీంతో మీరు రాత్రంగా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టుకున్నా.. సమస్య ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.