ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్ పేరు మార్పుతో మనకేంటి లాభం? - ఫేస్​బుక్ మెటా

మెటావర్స్​తో సరికొత్త సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపారు ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్. ఫేస్​బుక్ మాతృసంస్థ పేరును మెటావర్స్​(facebook new name)గా మార్చుతున్నట్లు ప్రకటించారు. మార్కె చెప్పిన ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేయబోతుంది? వర్చువల్ ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక మార్పులు(facebook name change) ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

facebook-changes-its-name-to-meta
ఫేస్​బుక్ పేరు మార్పుతో మనకేంటి లాభం?
author img

By

Published : Oct 29, 2021, 6:00 PM IST

మెటావర్స్(facebook new name)​.. మనం భవిష్యత్తులో అడుగుపెట్టబోయే వర్చువల్ ప్రపంచం. సరికొత్త సాంకేతిక యుగానికి నాంది. మనం ఉన్నచోటు నుంచే ప్రపంచాన్ని చుట్టి రావచ్చనే ఉహాకందని ఆలోచనకు ప్రతిరూపం. ఈ వర్చువల్ ప్రపంచంతో మనిషి జీవిన విధానమే మారబోతుందని ముందే పసిగట్టిన మార్క్ జుకర్​ బర్గ్​.. తమ మాతృసంస్థ పేరును 'మెటావర్స్'​(facebook name change) మార్చుతున్నట్లు ప్రకటించారు. అసలు మెటావర్స్ అంటే ఏమిటి?(metaverse facebook) భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం

మెటావర్స్​ అంటే ఏమిటి?

మెటావర్స్ అంటే కంప్యూటర్​ ద్వారా సృష్టించే వర్చువల్ ప్రపంచం(facebook name change meta). ఈ సాంకేతికత ద్వారా మనిషి ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్లవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తితోనైనా ఇంటరాక్ట్ కావచ్చు. దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్​గానే కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్​గా, రియల్​టైమ్​లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. వర్చువల్ షాపింగ్​లూ చేసుకోవచ్చు. మెటావర్స్ అన్న పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్​సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల 'స్నో క్రాష్'లో దీని గురించి ప్రస్తావించారు.

మెటావర్స్ లోగో ఎలా ఉంది?

మోటావర్స్ లోగో(metaverse logo facebook) చూడటానికి ఇన్​ఫినిటీ గుర్తును పోలి ఉంటుంది. మెలికలు తిరిగి ఉండే జర్మనీ, ఇటలీ ప్రసిద్ధ బేకరీ వంటకం ప్రెట్​జెల్​లా కన్పిస్తుంది. 'అవధుల్లేని ప్రపంచం' అని అంతరార్థం వచ్చేలా ఈ లోగోను డిజైన్​ చేసినట్లు అర్థమవుతోంది.

ఫేస్​బుక్, వాట్సాప్ పేర్లు మారతాయా?

తమ మాతృ సంస్థ 'పేస్​బుక్​ ఐఎన్​సీ' పేరు 'మెటావర్స్​ ప్లాట్​ఫామ్స్ ఐఎన్​సీ'​గా(facebook new name) మారుతుందని జుకర్​బర్గ్ తెలిపారు. సింపుల్​గా దీన్ని మెటా అని పిలవచ్చు. సామాజిక మాధ్యమాలు ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్​ యాప్​ల పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని జుకర్​బర్గ్ స్పష్టం చేశారు. డిసెంబర్​ 1 నుంచి స్టాక్​ మార్కెట్లో మాత్రం 'ఎంవీఆర్​ఎస్​' పేరుతో ట్రేడింగ్ ఉంటుందని వెల్లడించారు.

మెటావర్స్ ఎలా ఉంటుంది?

మెటావర్స్(metaverse facebook) ఎలా ఉండబోతుందో వీడియో డెమో ద్వారా వివరించారు జుకర్​బర్గ్. అవతార్​ రూపంలో ఉన్న వ్యక్తులు డిజిటల్ వెర్షన్​గా మారి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం, కాలచక్రంలోని ప్రవేశించి పాత యుగంలోకి ప్రయాణించడాన్ని చూపించారు.

వ్యక్తిగత గోప్యత భద్రమేనా?

ఇప్పటికే.. యాడ్​ల కోసం వ్యక్తిగత డేటాను విక్రయిస్తోందన్న ఆరోపణలు ఫేస్​బుక్​పై ఉన్నాయి. మెటావర్స్​లో(metaverse news) వ్యక్తిగత గోప్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తామని జుకర్​బర్గ్ హామీ ఇచ్చారు. పేరెంటల్ కంట్రోల్, డేటా వినియోగానికి సంబంధించిన పకడ్బందీగా ఉంటామన్నారు. సామాజిక మాధ్యమ వ్యూహంలో యాడ్స్​(ప్రకటనలు) కీలక భాగంగా ఉన్నాయని, మెటావర్స్​లోనూ అది కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మెటావర్స్​లో మనం ఏం పనులు చేయొచ్చు?

మెటావర్స్​లో(metaverse facebook) వర్చువల్ కాన్సర్ట్​లు, ఆన్​లైన్ పర్యటనలు చేపట్టవచ్చు. అంతర్జాలంలోనే దుస్తులు ధరించి మనకు సరిపోయే సైజులను గుర్తించవచ్చు. వర్క్​ ఫ్రం హోమ్​ విషయంలో విప్లవాత్మకంగా నిలవనుందీ మెటావర్స్. వీడియో కాల్స్​లోనే సహోద్యోగులతో చూడటానికి బదులుగా.. వర్చువల్​ వాతావరణంలో కలిసి పనిచేసుకోవచ్చు. ఫేస్​బుక్ ఇప్పటికే కంపెనీల కోసం హొరైజాన్ వర్క్​రూం సాఫ్ట్​వేర్లను అభివృద్ధి చేసింది. ఈ సంస్థే తయారు చేసిన 'ఆక్యులస్ వీఆర్' హెడ్​సెట్లను ధరించి ఈ వర్క్​రూంలలో పని చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Facebook New Name: 'ఫేస్‌బుక్' పేరు మారింది.. ఇక నుంచి 'మెటా'గా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.