కమాండ్ కంట్రోల్స్ ఉపయోగించకుండా కేవలం ఆలోచనలతో యంత్రాలను నడిపించగల టెక్నాలజీపై చేస్తోన్న పరిశోధనల్లో ముందడుగు పడింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీకి చెందిన పరిశోధకులు.. ఓ కోతికి కొద్దిరోజుల ముందు చిప్‌ను అమర్చారు. పక్కన ఉండే వ్యక్తి జాయ్ స్టిక్‌తో వీడియో గేమ్ ఆడుతుండగా.. అన్నీ గమనించిన ఆ కోతి.. కొద్ది వారాల తరువాత ఎటువంటి పరికరం లేకుండా తన సొంత ఆలోచనలతో గేమ్‌ను కంట్రోల్ చేసింది. కోతి ఇలా చేయడం గమనించిన పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎటువంటి కమాండ్ కంట్రోల్స్ లేకుండా ఇలా జరగడం అసాధారణం. కానీ ఈ లైవ్ వీడియో చూసిన తరువాత కోతికి చిప్ ఇన్‌ప్లాంట్ చేస్తే వీడియో గేమ్స్ ఆడగలదని అందరు నమ్ముతున్నారు. అయితే ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. పక్షవాతానికి గురైన వ్యక్తి బీర్ తాగడానికి న్యూరాలింక్ సాయంతో రోబోటిక్ చేతిని ఉపయోగిస్తున్నారు.
-
First @Neuralink product will enable someone with paralysis to use a smartphone with their mind faster than someone using thumbs
— Elon Musk (@elonmusk) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">First @Neuralink product will enable someone with paralysis to use a smartphone with their mind faster than someone using thumbs
— Elon Musk (@elonmusk) April 9, 2021First @Neuralink product will enable someone with paralysis to use a smartphone with their mind faster than someone using thumbs
— Elon Musk (@elonmusk) April 9, 2021
మస్క్ ట్వీట్..
ఇలాంటి వాటికి సంబంధించి ఎలాన్ మస్క్ 2019లోనే ఓ ట్వీట్ చేశారు. న్యూరాలింక్ ఇంప్లాంట్ చేయడం వల్ల కోతి కంప్యూటర్ను ఆపరేట్ చేయగలిగిందని చెప్పారు. అప్పటి నుంచి ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా న్యూరాలింక్ సాయంతో కోతి వీడియో గేమ్‌ను ఆడిన వీడియోను చూసిన మస్క్ మరో ట్వీట్ చేశారు. న్యూరాలింక్ ఇంప్లాంటేషన్‌తో పక్షవాతం వచ్చిన వ్యక్తి మిగతా వారి కంటే వేగంగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ 9ఆర్ 5జీ!