ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో ఇకపై 'అన్​ డూ' ఆప్షన్​.. మెసేజ్ ఎడిట్.. గ్రూప్​ నుంచి సైలెంట్​ ఎగ్జిట్!

WhatsApp new features: ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్.. వినియోగదారుల కోసం త్వరలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. యూజర్లకు మరింత ఈజీ చేసేందుకు.. తీసుకొస్తున్న అప్డేట్లు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్.

WhatsApp
వాట్సాప్
author img

By

Published : Jun 6, 2022, 5:02 PM IST

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ ఉంటుంది దిగ్గజ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​. వాట్సాప్​ వినియోగం మరింత అనువుగా ఉండేలా.. మరికొన్ని సరికొత్త అప్డేట్లను సిద్ధం చేస్తోంది మెటా యాజమాన్యం. నూతన ఫీచర్లు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి. త్వరలో అని పరీక్షలను పూర్తి చేసుకొని.. వియోగదారులుకు ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ అవి ఏంటో తెలుసుకుందాం.

Undo button for deleted messages: మనం ఎవరికైనా మెసేజ్ చేసిన తర్వాత దానిని వద్దనుకుంటే డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. ఒక అరగంటలోపు ఆ మెసేజ్​ను డిలీట్​ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా అవసరమైన మెసేజ్​ను పొరపాటుగా డిలీట్ కొడితే ఎలా..? మళ్లీ దాన్ని ఎలా తిరిగి పొందాలి? అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు 'అన్ డూ' ఫీచర్​ను వాట్సాప్ తీసుకొస్తోంది. ఈ ఆప్షన్​తో డిలీట్ చేసిన సందేశాలన్నింటినీ తిరిగి పొందవచ్చు. ఈ ఫీచర్​ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది.

Edit message feature: వాట్సాప్‌లో త్వరలో మెసేజ్‌ 'ఎడిట్‌' బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లో ఏవైనా పొరబాట్లు ఉంటే దాన్ని డిలీట్‌ చేయడం తప్పితే మరో అవకాశం లేదు. అలా కాకుండా.. మెసేజ్‌ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని ఈ 'ఎడిట్‌' ఆప్షన్‌ కల్పించనుంది. ప్రస్తుతం దీనిపై వాట్సాప్‌ టెస్టింగ్‌ చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది.

Media visibility: వాట్సాప్ తీసుకొస్తున్న 'మీడియా విజిబిలిటీ' ఫీచర్​ ద్వారా యూజర్లకు సరికొత్త అనుభూతి అందనుంది. ఈ కొత్త ద్వారా వినియోగదారులు తాము వాట్సాప్‌లో ఓపెన్ చేసే ఫొటోలు, వీడియోల‌ను ఫోన్ గ్యాల‌రీలో క‌నిపించ‌కుండా చేయ‌వ‌చ్చు. అందుకు యూజ‌ర్లు వాట్సాప్​లో సెట్టింగ్స్‌, డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ విభాగంలోకి వెళ్లి కింద ఉండే మీడియా విజిబిలిటీ అనే ఆప్ష‌న్‌కు ఉన్న టిక్ మార్క్ తీసేయాలి. దీంతో ఫోన్ గ్యాల‌రీలో వాట్సాప్ ఫొటోలు, వీడియోలు క‌నిపించ‌వు. ఐఫోన్ యూజర్లయితే 'సేవ్ టూ కెమెరా రోల్' డిసేబుల్ చేసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయోగం పూర్తయ్యాక.. త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ పూర్తిస్థాయిలో ఈ ఫీచ‌ర్ ల‌భిస్తుంది.

Save disappearing messages: వాట్సాప్‌లో 'డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌' ఫీచర్‌ ఇప్పటికే అందరికీ అందుబాటులోకి ఉన్న సంగతి తెలిసిందే. నిర్దిష్ట కాంటాక్ట్‌కు ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేస్తే.. ఎంచుకున్న సమయానికి అనుగుణంగా మెసేజ్‌లను వాటంతటవే ఆటోమేటిక్‌గా వాట్సాప్‌ డిలీట్‌ చేస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ ద్వారా కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లు కూడా డిలీట్‌ అవుతున్నాయి. దీనికి చెక్‌ పెట్టేలా వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

ఇకపై కాంటాక్ట్‌లు, గ్రూపుల్లో వచ్చే ముఖ్యమైన మెసేజ్‌లను ప్రత్యేకంగా ఓ జాబితా చేసుకోవచ్చు. తద్వారా ముందే ఎంపిక చేసుకున్న మెసేజ్‌లు చాట్‌ నుంచి డిస్‌అప్పియర్ అయినా.. సేవ్‌ చేసిన జాబితాలో అందుబాటులో ఉంటాయి. గ్రూపుల్లోని ప్రతి ఒక్కరూ మెసేజ్‌లను అన్‌-కీప్‌ చేసే అవకాశం ఉంది కాబట్టి.. ఈ ఫీచర్‌ను మరింత సులభతరం చేయడానికి వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది.

Exit groups silently: మనం ఏదైనా గ్రూప్​ నుంచి లెఫ్ట్ అయినప్పుడు అందులోని సభ్యులందరికీ ఆ విషయం తెలుస్తుంది. మనం గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చిన్న టెక్స్ట్​ కన్పిస్తుంది. అలా అందరికీ తెలియకుండా సైలెంట్​గా గ్రూప్​ నుంచి లెఫ్ట్​ కావాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికోసం వాట్సాప్​ కొత్త ఫీచర్​ను తీసుకురానుంది. దీనితో మనం గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే అడ్మిన్​కు తప్ప గ్రూప్​లో ఇతర సభ్యులెవరికీ ఆ విషయం తెలియదు. ఎలాంటి సందేశం కూడా కన్పించదు. మనకు ఇష్టం లేని గ్రూప్​ల నుంచి సైలెంట్​గా వెళ్లిపోవచ్చు. ఈ ఫీచర్​ను ప్రస్తుతం వాట్సాప్ వెబ్​లో పరీక్షిస్తున్నారు.

Status rich link preview: ప్రస్తుతం వాట్సాప్​ స్టేటస్​లో ఏదైనా వెబ్​సైట్ లింక్ షేర్ చేసినప్పుడు అది సాధారణ టెక్స్ట్​లాగే కన్పిస్తుంది. వాట్సాప్​ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్​లో.. ఎవరైనా స్టేటస్​లో లింక్ షేర్​ చేస్తే దానికి సంబంధించిన డీటైల్డ్​ ప్రివ్యూ కన్పించనుంది. అంటే లింక్​ సంబంధించి ఫొటోతో పాటు వెబ్​సైట్ వివరాలు కన్పిస్తాయి. కొత్త ఫీచర్​లో ప్రివ్యూ ద్వారా ఎక్కువ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Double verification code: ప్రస్తుతం వాట్సాప్ అకౌంట్‌కు వేరే డివైజ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు.. ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. అనంతరం వాట్సాప్‌ వినియోగానికి యాక్సెస్ లభిస్తుంది. డబుల్ వెరిఫికేషన్‌ ఫీచర్ వల్ల.. ఈ కోడ్ సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసినా.. వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ అవ్వడానికి మరొక ఆరు అంకెల.. కోడ్‌ను కూడా ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. రెండోసారి వచ్చే కోడ్​.. మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. ఆ కోడ్​ను ఎంటక్​ చేసి.. వాట్సాప్​ లాగిన్​ కావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 16 లక్షలకు పైగా ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం.. అందులో మీదీ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.