ETV Bharat / science-and-technology

బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్‌ కహానీ తెలుసా? - ఇంటర్నెంట్​ రూపురేఖల్ని మార్చిన బ్రౌజర్లు ఏవి

కంప్యూటర్‌ కనిపెట్టింది ఎవరు అనగానే.. చార్లెస్‌‌ బ్యాబేజ్‌ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ, నిత్యం మనకు కావాల్సిన విషయాల్ని తెలుసుకోవడం కోసం వినియోగించే ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఎవరు కనిపెట్టారో తెలుసా? ప్రస్తుతం మార్కెట్లో క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వంటి బ్రౌజర్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. మరి.. తొలి బ్రౌజర్‌ ఏది? ఎలా ఆవిష్కృతమైంది? బ్రౌజర్‌లో బ్రౌజింగ్‌ చరిత్రను గమనించే నెటిజన్లు.. దాని అసలు చరిత్ర గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది అలాంటి ఆలోచనే చేసి ఉండరు.. అందుకే బ్రౌజర్‌ చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి..

history of browsers
బ్రౌజర్ల చరిత్ర
author img

By

Published : Mar 23, 2021, 12:05 PM IST

మానవుడి అభివృద్ధికి అగ్ని, నీరు మూల కారణమైనట్లుగానే.. ప్రస్తుత డిజిటల్‌ యుగానికి www(వరల్డ్‌ వైడ్‌ వెబ్‌) ఆవిష్కరణే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీన్ని 1989లో సర్‌ టిమ్‌ బెర్నర్స్‌-లీ ప్రతిపాదించారు. ది యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సమయంలో సమాచారం బదలాయింపులో ఉన్న ఇబ్బందులను బెర్నర్స్‌ గమనించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య సమాచారం వేగంగా బదిలీ జరగడానికి వీలుగా ఏదైనా చేయాలని భావించారు. పలు ప్రయత్నాల అనంతరం 1990లో వరల్డ్‌వైడ్‌వెబ్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్‌లో www బ్రౌజర్‌ను ఆవిష్కరించి.. హెచ్‌టీఎంల్‌, హెచ్‌టీటీపీ, యూఆర్‌ఎల్‌ వంటి ఇంటర్నెట్‌ బేసిక్‌ కాన్సెప్ట్‌ను తెలియజేశారు. దీనికి నెక్సస్‌ అని పేరు పెట్టారు.

WWW lay foundation to Digital era
డిజిటల్‌ యుగానికి నాంది పలికిన WWW

అయితే, ఆయన బ్రౌజర్‌ కోసం నెక్ట్స్‌ కంపెనీ కంప్యూటర్‌లో కోడింగ్‌ చేయడం వల్ల కేవలం ఆ కంప్యూటర్ల మధ్యే సమాచారం బదిలీ అయ్యేది. సమస్య గుర్తించి బెర్నర్స్‌ సహా ఆయన సహోద్యోగులు కలిసి అన్ని కంప్యూటర్లకు ఉపయోగకరంగా మార్పులు చేశారు. దానికి లైన్‌ మోడ్‌ బ్రౌజర్‌ అని నామకరణం చేశారు. ఈ బ్రౌజర్‌లో కేవలం టెక్స్ట్‌ మాత్రమే కనిపిస్తుంటుంది.

Tim Berners lee
టిమ్‌ బెర్నర్స్‌-లీ

టెక్స్ట్‌ + గ్రాఫిక్స్‌ = మొజాయిక్‌

నెక్సస్‌ బ్రౌజర్‌లో కేవలం టెక్స్ట్‌ మాత్రమే బ్రౌజింగ్‌ చేసే వీలు ఉంటుంది. అందుకే, దీనికి మించిన బ్రౌజర్‌ను 1993లో యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సూపర్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఎన్‌సీఎస్‌ఏ) రూపొందించింది. మొజాయిక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ బ్రౌజర్‌లో టెక్స్ట్​‌తోపాటు ఇమేజెస్‌, గ్రాఫిక్స్‌ కలిపారు. ఇది ఓపెన్‌ సోర్స్‌ బ్రౌజర్‌ కాదు. కాకపోతే.. నాన్‌ కమర్షియల్‌గా ఉచితంగా వినియోగించే అవకాశం ఉండేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రౌజర్‌ బాగా పాపులరైంది. 1997 వరకు దిగ్విజయంగా కొనసాగింది. దీనికంటే ముందు యూనిక్స్‌ కంప్యూటర్ల కోసం ఎరినా బ్రౌజర్‌ అందుబాటులోకి వచ్చింది. సెల్లో, లినిక్స్‌ 2.0, ఏమొజాయిక్‌ వంటి బ్రౌజర్లు ఉనికిలో ఉండేవి.

mosaic browser
మొజాయిక్​ బ్రౌజర్

బ్రౌజర్‌ యుద్ధానికి నాంది.. నెట్‌స్కేప్‌

1994లో ఎన్‌సీఎస్‌ఏ రూపొందించిన మొజాయిక్‌ బ్రౌజర్‌ కోసం పనిచేసిన మార్క్‌ ఆండ్రీస్సెన్‌, ఎరిక్‌ బినా వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్‌సీఎస్‌ఏ నుంచి బయటకు వచ్చేశారు. అదే ఏడాది మొజాయిక్‌కు పోటీగా నెట్‌స్కేప్‌ బ్రౌజర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత దీన్ని నెట్‌స్కేప్‌ నావిగేటర్‌గా పేరు మార్చారు. 1994లోనే ఐబీఎం సంస్థ ఐబీఎం వెబ్‌ ఎక్స్‌ప్లోరర్‌, యాపిల్‌ సంస్థ మ్యాక్‌ వెబ్‌ను ఆవిష్కరించాయి. వాటితోపాటు మరికొన్ని బ్రౌజర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. కానీ, ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన నెట్‌స్కేప్‌ నావిగేటర్‌ బ్రౌజర్‌ను యూజర్లు విపరీతంగా ఆదరించారు. 1995లో నెట్‌స్కేప్‌ నావిగేటర్‌ 90శాతం మార్కెట్‌ సాధించింది.

net scape
నెట్‌స్కేప్‌

ఆలస్యంగా మేల్కొన్న మైక్రోసాఫ్ట్‌

వివిధ సంస్థలు బ్రౌజర్లను రూపొందించి విజయవంతంగా కొనసాగుతుంటే.. కంప్యూటర్లు.. వాటిలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించే దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మాత్రం ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌పై తాత్సారం చేసింది. చివరకు బ్రౌజర్‌ ప్రాధాన్యం తెలుసుకొని రేసులో నిలబడింది. 1995లో విడుదల చేసిన విండోస్‌ 95 సాఫ్ట్‌వేర్‌లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 1.0 బ్రౌజర్‌ను ఇన్‌బిల్ట్‌గా పెట్టింది. ఎక్కువ మంది మైక్రోసాఫ్ట్‌నే ఉపయోగించేవారు కాబట్టి.. ఆటోమెటిక్‌గా ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వినియోగం బాగా పెరిగింది. బ్రౌజర్‌ రేసులో తాము ముందుండాలనే ఉద్దేశంతో కంప్యూటర్లను తయారు చేసే కంపెనీలను ఇన్‌బిల్ట్‌గా ఉండే ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసి వేరే బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే వెసులుబాటు ఇవ్వకుండా చేసింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆగ్రహించి మైక్రోసాఫ్ట్‌పై కేసు నమోదు చేసింది. 2001లో ఈ కేసు పరిష్కారమైంది. అయినా.. చాలాకాలం పాటు ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరరే నంబర్‌వన్‌ బ్రౌజర్‌గా నిలిచింది. 2003లో 95శాతం యూజర్లు దీనిని వాడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

internet explorer
ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌

మొజిల్లా పుట్టిందిలా..

మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ రాకతో నెట్‌స్కేప్‌కు ఆదరణ తగ్గిపోయింది. దాదాపు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న నెట్‌స్కేప్‌ను 1998లో ఏఓఎల్‌ సంస్థ కొనుగోలు చేసింది. కొన్ని నెలల తర్వాత నెట్‌స్కేప్‌ బ్రౌజర్‌కు లైసెన్స్‌ విధానం రద్దు చేసి అందరూ ఉచితంగా ఉపయోగించుకునేలా చేసింది. బ్రౌజర్‌ సోర్స్‌కోడ్‌ను కూడా బహిరంగపర్చింది. దీంతో ఇతరులకు సొంతగా మరో బ్రౌజర్‌ రూపకల్పన చేసే అవకాశం దక్కినట్లయింది. ఈ నేపథ్యంలో మొజిల్లా ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. మొదట్లో నెట్‌స్కేప్‌ నావిగేటర్‌ను అభివృద్ధి పరిచి వినూత్నంగా ఆవిష్కరించాలని మొజిల్లా వ్యవస్థాపకులు భావించారు. ఆ తర్వాత సొంతగానే మొజిల్లా1.0 పేరుతో 2002లో బ్రౌజర్‌ను ప్రారంభించారు. 2003 మొజిల్లా ఫౌండేషన్‌ స్థాపించి.. ఫైర్‌ఫాక్స్‌ 1.0ను విడుదల చేశారు.

Mozilla Firefox
మొజిల్లా

గూగుల్‌ క్రోమ్‌ ఎంట్రీ..

1998లో గూగుల్‌ సంస్థ ఏర్పాటైంది. కేవలం సెర్చ్‌ ఇంజిన్‌లా ఇంటర్నెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన గూగుల్ అనతి కాలంలో విశేష ఆదరణ పొందింది. అప్పటికే యాహూ, ఏఓఎల్‌ వంటి అనేక సెర్చ్‌ ఇంజిన్లు అందుబాటులో ఉన్నా.. శోధనకు గూగుల్‌ సులువుగా ఉండటం వల్ల నెటిజన్ల మనసు దోచుకుంది. ఇంటర్నెట్‌ యూజర్లకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో మొజిల్లా సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులను తమ సంస్థలో నియమించుకొని 'గూగుల్‌ క్రోమ్‌' బ్రౌజర్‌ను అభివృద్ధి చేసింది.

Google Chrome
గూగుల్​ క్రోమ్​

2008లో గూగుల్‌ క్రోమ్‌1.0ను తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు అలవాటు పడ్డ నెటిజన్లు మొదట్లో క్రోమ్‌ వైపు మొగ్గుచూపలేదు. కానీ, ఆ తర్వాత క్రోమ్‌ పుంజుకుంది. తొలినాళ్లలో కేవలం 1 శాతం వాటా ఉన్న గూగుల్‌ క్రోమ్‌.. ప్రస్తుతం బ్రౌజర్ల వాడకంలో 64శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇవే కాకుండా మరికొన్ని బ్రౌజర్లు మార్కెట్లోకి వచ్చినట్లే వచ్చి కనుమరుగయ్యాయి. ఇంకొన్ని నిలదొక్కుకొని కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గూగుల్‌ క్రోమ్‌.. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌తోపాటు మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఒపెరా, సఫారీ(ఐఓఎస్‌),పేల్‌మూన్‌, సీ మంకీ, వివాల్డి వంటి అనేక బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి:టెలిగ్రామ్ కొత్త ఫీచర్​.. 'వాయిస్​ చాట్​​ 2.0'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.