ETV Bharat / science-and-technology

కరోనా రీఇన్​ఫెక్షన్ మరింత ప్రమాదకరమా? - రెండోసారి కరోనా వ్యాప్తి

కరోనాను జయించిన వారికి మళ్లీ వైరస్ సోకిన ఘటనలు ఇదివరకే కొన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే కొవిడ్ బాధితులకు ఎన్ని రోజుల తర్వాత మళ్లీ ముప్పు మొదలవుతుంది? రెండోసారి కొవిడ్ వస్తే తీవ్రత తక్కువగా ఉంటుందా? మరింత ప్రమాదకరంగా ఉంటుందా? వైరస్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుంది? వంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

covid-reinfection-
కరోనా రీఇన్​ఫెక్షన్ మరింత ప్రమాదకరమా?
author img

By

Published : Jun 15, 2021, 7:38 PM IST

మలేసియాకు చెందిన లీ ఖాయ్ మింగ్ అనే వ్యక్తి రెండోసారి కరోనా బారిన పడ్డ కొద్దిరోజులకే ప్రాణాలు కోల్పోయాడు. కరోనా నుంచి కోలుకున్న నాలుగు నెలల వ్యవధిలోనే అతడికి మరోసారి కొవిడ్ నిర్ధరణ అయింది. రెండు రోజుల పాటు లక్షణాలు కనిపించే సరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు మింగ్. కొన్ని మందులు ​ ఇచ్చినా.. పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో కరోనా టెస్టు చేయించుకోగా.. అందులో పాజిటివ్​గా వచ్చింది. ఎనిమిది రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి మరణించాడు.

ఇలా అనేక కరోనా రీఇన్​ఫెక్షన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తొలిసారి వైరస్​ను జయించిన వారికి మళ్లీ ఎందుకు కరోనా సోకుతుందనే అంశం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. రీఇన్​ఫెక్షన్ ఎందుకు వస్తుంది? కరోనా నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి.

రెండోసారి వైరస్ పక్కా?

కొవిడ్ వైరస్, దాని వేరియంట్లు మనుషులకు ఎలా సోకుతాయనే విషయంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఒక్కసారి కరోనా సోకినంత మాత్రాన వైరస్​కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ సాధించినట్టు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం మనుషుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్​లు నాలుగు రకాలు. వాటిని 22ఈ, ఎన్ఎల్63, ఓసీ43, హెచ్​కేయూ1గా వర్గీకరించారు. వీటి బారిన పడిన రోగులు.. కొంత వరకు వైరస్​లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని సాధిస్తారు. కానీ తర్వాత కొంత కాలానికి రీఇన్​ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

కొవిడ్-19కు కారణమవుతున్న సార్స్-కోవ్-2 కూడా ఇలాంటిదే. దీని ద్వారా కూడా రీఇన్​ఫెక్షన్ జరిగే అవకాశం ఉంది. అయితే సార్స్​-కోవ్-2 పూర్తిగా కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కాబట్టి.. దీనికి సంబంధించి రీఇన్​ఫెక్షన్, ఇమ్యూనిటీ స్థాయుల గురించి స్పష్టమైన సమాచారం లేదు. దీనిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు.

ఇమ్యూనిటీ.. అందరికీ కాదు!

ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొవిడ్-19 ఇన్​ఫెక్షన్ రోగులకు రికవరీ అయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు రోగనిరోధక శక్తి లభిస్తుంది. కొంతమంది వైరాలజిస్టులు సైతం ఇదే వెల్లడించారు. అయితే, అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పలేం. పైన చెప్పిన మలేసియా రోగికి నాలుగు నెలల వ్యవధిలోనే వైరస్ రెండోసారి దాడి చేసింది.

"రీఇన్​ఫెక్షన్​లు ఎంత తరచుగా సంభవిస్తున్నాయనే అంశాన్ని తెలుసుకునేందుకు అధ్యయనాలు జరగాలి. దీని బట్టి రోగనిరోధక శక్తి ఎంతకాలం పనిచేస్తుందనే విషయం మనకు తెలుస్తుంది. భారీ స్థాయిలో వస్తున్నాయా? తక్కువ తీవ్రతతో రీఇన్​ఫెక్షన్ వస్తోందా అనేది తెలుసుకోవాలంటే.. అధ్యయనం నిర్వహించాలి."

-ఎష్​లై ట్యూట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో

రెండోసారి కరోనా అత్యంత తీవ్రంగా ఉంటుందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి వైరస్ సోకితే లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయేమో అన్న అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. అయితే, వైరస్ కొత్తది కాబట్టి రీఇన్​ఫెక్షన్​పై పూర్తి సమాచారం ఇంకా రాలేదు. రెండోసారి కరోనా బారిన పడ్డవారికి లక్షణాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయంపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు.

అన్నింటికీ మూలం ఏడీఈ!

అయితే, రీఇన్​ఫెక్షన్ విషయంలో దశాబ్దాల నుంచి నిపుణులు విశ్వసించే ఓ విధానం ఉంది. అదే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్​హాన్స్​మెంట్(ఏడీఈ). బాధితులు రెండోసారి ఒకే వైరస్​ బారిన పడ్డ సమయంలో ఇది సంభవిస్తుంది. తొలిసారి ఇన్​ఫెక్షన్ సోకినప్పుడు శరీరంలో తయారైన యాంటీబాడీలు.. వ్యాధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే రెండోసారి ఇవే యాంటీబాడీలు ఇందుకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వైరస్​ను శరీర కణాల్లోకి చేర్చేందుకు ఇవి వాహకాలుగా ఉపయోగపడతాయి.

ఇదీ చదవండి: కరోనా టీకాతో దేశంలో తొలి మరణం

సార్స్-కోవ్-2 విషయంలో ఏడీఈ పాత్ర ఎంతవరకు ఉంటుందనే విషయం పూర్తిగా తెలియలేదు. అయితే, ఇప్పటివరకు నమోదైన రీఇన్​ఫెక్షన్ కేసులను పరిశీలిస్తే.. రోగుల్లో రెండు రకాల లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరిలో మునుపటితో పోలిస్తే తీవ్రత అధికంగా ఉంటే మరికొందరిలో తక్కువగా ఉంటోంది.

"తొలి ఇన్​ఫెక్షన్ సందర్భంగా స్వల్ప లక్షణాలు అనుభవించిన వారు మరోసారి కరోనా బారిన పడే అవకాశం ఉంది. తొలిసారి బలమైన రోగనిరోధక శక్తి రూపొందని కారణంగా రెండోసారీ వారికి కరోనా రావొచ్చని భావిస్తున్నా."

-జోయెల్ మోసాంగ్, ఎపిడమాలజీ విభాగం అధ్యక్షుడు, లగ్జెంబర్గ్ నేషనల్ హెల్త్ అథారిటీ

ఛాన్స్ తీసుకోవద్దు!

కరోనాకు సంబంధించి అనేక విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పైన పేర్కొన్న అంశాలతో పాటు ముఖ్యమైన మరో విషయంపైనా అధ్యయనం జరగాల్సి ఉంది. కరోనా రీఇన్​ఫెక్షన్ అంటే.. శరీరంలో ఉన్న వైరసే మళ్లీ రీయాక్టివేట్ అయినట్టా.. లేదంటే కొత్తగా వైరస్​ సోకినట్టా అనే అంశం తేలాల్సి ఉంది. మరోవైపు, ఇదివరకే కరోనా సోకినవారికి కొత్త మ్యూటెంట్లు ముప్పుగా పరిణమించాయన్న విషయంపైనా పరిశోధన జరగాల్సి ఉంది.

చివరగా.. కరోనా రెండోసారి వస్తుందనే విషయానికి సంబంధించి స్పష్టమైన పరిశోధనలేవీ జరగలేదు. వైరస్ వల్ల ఇమ్యూనిటీ లభిస్తుందా? ఇమ్యూనిటీ వచ్చిన వారికి మళ్లీ సోకుతుందా? అనే విషయాలపై స్పష్టత లేదు. కాబట్టి, ముందు జాగ్రత్తగా భౌతిక దూరం పాటిస్తూ, పరిశుభ్రంగా ఉండటం మర్చిపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: 'డెల్టా ప్లస్'​ కరోనా​పై కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.