ETV Bharat / science-and-technology

ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్.. జాబిల్లిపై అసలు పని షురూ! కొత్త ఫొటోలు చూశారా? - ప్రగ్యాన్ రోవర్ ఫోటోలు

Chandrayaan 3 Rover Landing Time : చంద్రయాన్-3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్​లోని ప్రగ్యాన్ రోవర్.. జాబిల్లిపై పరిశోధనలకు సిద్ధమైంది. విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్.. చందమామపై తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలను ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.

chandrayaan 3 rover landing time
chandrayaan 3 rover landing time
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 7:07 AM IST

Updated : Aug 24, 2023, 11:38 AM IST

Chandrayaan 3 Rover Landing Time : జాబిలిపై విజయవంతంగా అడుగు పెట్టి ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్న చంద్రయాన్-3 ఇక అసలు పని మొదలుపెట్టనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్ రోవర్ ( Pragyan Rover Images ) 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది. సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ శోధిస్తాయి. ఇందుకోసం ఆధునిక పరికరాలను ఇస్రో జాబిలిపైకి పంపింది. కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్ రోవర్‌ బయటకు వచ్చిన తొలిఫొటోను ఇస్రో పంచుకుంది.

chandrayaan-3-rover-landing-time
బయటకు వస్తున్న ప్రగ్యాన్ రోవర్

Pragyan Rover on Moon Experiments : చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై ల్యాండయ్యాక కొన్ని గంటల తర్వాత దాని ర్యాంప్ విచ్చుకుంది. ల్యాండర్​లోని ఆరు చక్రాల ప్రగ్యాన్ రోవర్‌ జాబిల్లి ఉపరితలంపైకి ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. చంద్రుడి నేలపై అది సెకనుకు సెంటీమీటర్ వేగంతో నడక సాగిస్తూ పలు పరిశోధనలు చేపట్టనుంది. జాబిల్లిపై పరిశోధనలు చేయడానికి ఐదు శాస్త్రీయ పేలోడ్లను వాటిలో ఇస్రో అమర్చింది. ల్యాండర్‌, రోవర్‌ జీవిత కాలం 14 రోజులు. చంద్రునిపై పగలు అంటే భూమిపై 14 రోజులతో సమానం. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌరఫలకాల సాయంతో శక్తి సమకూర్చుకుని ల్యాండర్‌, రోవర్‌ పరిశోధనలు నిర్వహిస్తాయి. ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమ్మీద ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్‌ చేసినప్పటికీ రోవర్‌ మాత్రం ల్యాండర్‌కు మాత్రమే కమ్యూనికేట్‌ చేసే వీలుంది.

  • Chandrayaan-3 Mission:
    Updates:

    The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.

    Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom

    — ISRO (@isro) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విక్రమ్‌ ల్యాండ్‌ అవగానే ప్రగ్యాన్‌ బయటకు రాలేదు. ఇందుకు గంటల సమయం పట్టింది. విక్రమ్‌ దిగిన చోట చంద్రుని ధూళి పైకి లేస్తుంది. జాబిల్లి గురుత్వాకర్షణ భూమితో పోల్చితే చాలా తక్కువ కాబట్టి ఆ ధూళి తిరిగి ఉపరితలంపై పడేందుకు చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ఇందుకు ఒక రోజు సమయం కూడా పట్టొచ్చని ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ఆ సమయంలో రోవర్‌ బయటకు వస్తే.. ఆ దుమ్ము ప్రగ్యాన్‌ కెమెరాలు ఇతర పరికరాలకు నష్టం చేస్తుంది. అందుకే గంటల సమయం తర్వాత రోవర్‌ను బయటకు తీసుకువచ్చినట్లు ఇస్రో తెలిపింది.

పరిశోధనలు ఇవే...
Pragyan Rover Moon Experiments : చంద్రుడిపై విలువైన లోహాలు ఉన్నాయనే అంచనాలున్న నేపథ్యంలో ప్రగ్యాన్ రోవర్‌ పరిశోధనలకు సిద్ధమైంది. 26 కిలోల బరువుండే ప్రగ్యాన్‌ రోవర్‌లో ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌-రే స్పెక్టోమీటర్‌-APXS, లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌- LIBS ఉంటాయి. ల్యాండింగ్‌ ప్రాంతం చుట్టూ ఉన్న నేల, రాళ్లలో మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఐరన్ వంటి మూలకాలను గుర్తించే పనిలో ఇది నిమగ్నమవుతుంది. ఇక గుణాత్మక, పరిమాణాత్మక మూలకాల విశ్లేషణకు చంద్రుని ఉపరితలంపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి రసాయన కూర్పును, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించడంలో LIBS సహాయపడుతుంది. ల్యాండింగ్ పూర్తైన కాసేపటికే బెంగళూరులోని ఇస్రాక్ట్-మాక్స్‌తో విక్రమ్‌కు కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పడ్డాయి. ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్ రోవర్ రెండు కీలక పరిశోధనలు చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.

"ప్రగ్యాన్ రోవర్ బయటకు రాగానే రెండు కీలక పరిశోధనలు జరుగుతాయి. మొదటి పరిశోధనలో భాగంగా లేజర్ బీమ్​ను పంపిస్తాం. అది చంద్రుడిపై ఉన్న మూలకాలను గుర్తిస్తుంది. రెండో పరిశోధన ఏంటంటే.. అక్కడ ఉన్న రేడియో యాక్టివ్ మెటీరియల్స్ విడుదల చేసే ఆల్ఫా పార్టికల్స్​.. ఉపరితలంపై ఎక్స్​రే ఫ్లోరోసెన్స్ సృష్టిస్తాయి. వాటిని పరిశీలించి రసాయన కూర్పును గుర్తిస్తాం. చంద్రయాన్-3పై చేసే కీలక ప్రయోగాలు ఇవే" అని సోమ్​నాథ్ వివరించారు.

Pragyan Rover Images : చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైంది. విక్రమ్ తన గమ్యం దిశగా సాగే కొద్దీ... ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగింది. ఇస్రో శాస్త్రవేత్తలు పంపిన కమాండ్‌కు అనుకూలంగా ల్యాండర్‌ పలు దశల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలుత గంటకు 6 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించిన విక్రమ్ వేగాన్ని క్రమంగా తగ్గించారు. అప్పటిదాకా ఒకింత ఏటవాలుగా ఉన్న ల్యాండర్ నిట్టనిలువు స్థితికి చేరుకుంది. చివరగా 150 నుంచి 100 మీటర్ల ఎత్తుకు వచ్చాక తనలోని సెన్సర్లు, కెమెరాలను ఉపయోగించుకుంటూ ఉపరితలాన్ని స్కాన్ చేసింది. ల్యాండింగ్ కోసం చదునైన ప్రదేశాన్ని పక్కాగా నిర్ధరించుకుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాల సమయంలో జాబిల్లిపై సురక్షితంగా కాలు మోపి చరిత్ర సృష్టించింది.

chandrayaan 3 rover landing time
విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశం.. చిత్రంలో ల్యాండర్ కాలి నీడ

చదునైన ప్రదేశాన్ని విక్రమ్ ఎంచుకున్న ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. అందులో ల్యాండర్ కాళ్లకు సంబంధించిన నీడ కూడా కనిపిస్తున్నట్లు పేర్కొంది. చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్ జాబిల్లిపై శాశ్వతంగా మన ముద్ర వేసింది. ర్యాంప్ నుంచి దిగగానే ప్రగ్యాన్ వెనక చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్నం, ఇస్రో ముద్రలను చందమామపై అద్దింది. చంద్రుడిపై గాలిలేదు కాబట్టి ఈ ముద్రలు ఎన్నేళ్లయినా అలాగే ఉండిపోనున్నాయి.

Chandrayaan 3 Landed on Moon : సాఫ్ట్​ ల్యాండింగ్ సక్సెస్.. చంద్రయాన్​ 3తో లాభాలివే..

Chandrayaan 3 : తమిళనాడు మట్టి స్పెషల్​.. చంద్రయాన్​-3లో 'కీ రోల్​'.. ఎలాగంటే..

Last Updated : Aug 24, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.