ETV Bharat / science-and-technology

Chandrayaan 3 ILSA : చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించిన 'ఇల్సా'​.. సవ్యంగానే 'రోవర్' సెర్చ్​ ఆపరేషన్!​

Chandrayaan 3 ILSA : జాబిల్లిపై చంద్రయాన్-3 పేలోడ్​లు శాస్త్రీయ పరిశోధన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడిపై ఉష్ణోగ్రత, సల్ఫర్​ మూలకానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశాయి. తాజాగా ల్యాండర్​లో ఉన్న ఇల్సా పేలోడ్​ చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించింది.

chandrayaan 3 ILSA payload
chandrayaan 3 ILSA payload
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 7:04 AM IST

Updated : Sep 1, 2023, 7:47 AM IST

Chandrayaan 3 ILSA : చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్​, రోవర్​ పేలోడ్​లు శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్​ వంటి మూలకాల లభ్యత సమాచారాన్ని ఇప్పటికే చేరవేశాయి. ఈ క్రమంలోనే విక్రమ్‌ ల్యాండర్‌లో ఉన్న 'ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ- ILSA' పేలోడ్‌.. తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేసింది. ఈ మేరకు ఇస్రో సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో వెల్లడించింది.

  • Chandrayaan-3 Mission:
    In-situ Scientific Experiments

    Instrument for the Lunar Seismic Activity (ILSA) payload on Chandrayaan 3 Lander
    -- the first Micro Electro Mechanical Systems (MEMS) technology-based instrument on the moon --
    has recorded the movements of Rover and other… pic.twitter.com/Sjd5K14hPl

    — ISRO (@isro) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Lander Findings : చంద్రయాన్‌-3 ల్యాండర్‌లోని 'ఇల్సా' పేలోడ్‌.. జాబిల్లి ఉపరితలంపై రోవర్‌, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది. దీంతోపాటు చంద్రుడి ఉపరితలంపై సహజంగా ఏర్పడినట్లు భావిస్తున్న ప్రకంపనలను కూడా గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ కొనసాగిస్తోంది. మరోవైపు 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్- MEMS సాంకేతిక ఆధారంగా రూపొందించిన పరికరం అని ఇస్రో వెల్లడించింది. 'ఇల్సా' పేలోడ్‌ను 'లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో- ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌' రూపొందించిందని తెలిపింది. దాన్ని చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని తెలిపింది.

'రోవర్​ సవ్యంగానే పనిచేస్తోంది'
Chandrayaan 3 Rover Updates : చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన ప్రగ్యాన్ రోవర్‌ సవ్యంగా పనిచేస్తున్నట్లు.. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ తెలిపారు. 14రోజులవరకు మిషన్‌ విజయవంతంగా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

"అన్ని సవ్యంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు పగటి నుంచి రాత్రి వరకు డేటా కోసం ఎదురుచూస్తున్నాం. డేటా బాగా అందుతోంది. అన్నీ ఆరోగ్యంగా పనిచేస్తున్నాయి. 14రోజులు పూర్తయ్యే వరకు మా మిషన్‌ విజయవంతంగా ముగుస్తుందని ఆశిస్తున్నాం"
--ఎస్‌.సోమ్‌నాథ్‌, ఇస్రో ఛైర్మన్‌

'ఆదిత్య-ఎల్​1కు అంతా రెడీ'
Aditya L1 Launch Date : సూర్యుడి రహస్యాలను ఛేందించేందుకు ఇస్రో రెడీ అయింది. ఈ మేరకు ప్రయోగించనున్న ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను నింగిలోకి పంపేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్​ తెలిపారు. ఇప్పటికే రాకెట్​, ఉపగ్రహం సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. శనివారం (2023 సెప్టెంబర్ 2) ఆదిత్య-ఎల్1 ప్రయోగం చేపట్టనుండగా.. శుక్రవారం కౌంట్​డౌన్ మొదలవుతుందని ఆయన చెప్పారు.

  • VIDEO | "We are getting ready for the launch. Rocket and satellite are ready. We have completed the rehearsal for the launch. Tomorrow, we have to start the countdown for the launch," says ISRO chairman S Somanath on Aditya-L1 Mission, scheduled for launch on September 2.… pic.twitter.com/7UBrIFoTEo

    — Press Trust of India (@PTI_News) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Soft Landing : ల్యాండర్​ అడుగుపెడుతున్నప్పుడు చంద్రుడిని చూశారా?

Chandrayaan 3 Pragyan Rover Landing : చంద్రుడిపై భారత సంతకం! 'ప్రగ్యాన్' ల్యాండింగ్ వీడియో చూశారా?

Last Updated : Sep 1, 2023, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.