ETV Bharat / science-and-technology

చంద్రయాన్-2 ఘనత.. జాబిల్లి చుట్టూ 9 వేల సార్లు...

చంద్రయాన్-2 స్పేస్​క్రాఫ్ట్ అద్భుతంగా పనిచేస్తోందని ఇస్రో అధికారులు తెలిపారు. జాబిల్లికి సంబంధించి నాణ్యమైన చిత్రాలను పంపిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు ఈ స్పేస్​క్రాఫ్ట్ తిరిగి వచ్చిందని వెల్లడించారు.

chandrayaan 2
చంద్రయాన్-2
author img

By

Published : Sep 6, 2021, 5:07 PM IST

చంద్రయాన్-2 ప్రయోగంలో (chandrayaan 2) భాగంగా ఇస్రో పంపించిన స్పేస్​క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించిందని అధికారులు తెలిపారు. స్పేస్​క్రాఫ్ట్​లోని ఇమేజింగ్, సైంటిఫిక్ పరికరాలు అద్భుతమైన సమాచారాన్ని భూమి మీదకు తిరిగి పంపిస్తున్నాయని వెల్లడించారు.

చంద్రయాన్-2 పరికరం రెండేళ్ల పనికాలం (chandrayaan 2 launch date) పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్రో రెండు రోజుల లూనార్ సైన్స్ (isro lunar science workshop) వర్క్​షాప్ నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన ప్రారంభోపన్యాసంలో ఇస్రో ఛైర్మన్ కే శివన్ (isro chairman) ఈమేరకు వివరాలు వెల్లడించారు. స్పేస్​క్రాఫ్ట్ మీద ఉన్న ఎనిమిది పేలోడ్​లు.. వంద కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడిని పరిశీలిస్తున్నాయని తెలిపారు.

"ఈ రోజు వరకు చంద్రయాన్-2.. చంద్రుడి చుట్టూ 9 వేలకు పైగా పరిభ్రమించింది. మాకు అందిన సమాచారాన్ని విద్యా సంస్థలకు అందుబాటులో ఉంచుతున్నాం. అందరి భాగస్వామ్యంతో మరింత సమాచారాన్ని వెలికి తీయాలని భావిస్తున్నాం. ఇప్పటివరకు విశ్లేషించిన ఫలితాలు.. చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ శాటిలైట్ అద్భుతమైన సమాచారాన్ని పంపిస్తోంది."

-కే శివన్, ఇస్రో ఛైర్మన్

చంద్రయాన్ 2లోని ఉప వ్యవస్థలన్నీ.. సమర్థంగా పనిచేస్తున్నాయని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ వనిత తెలిపారు. మరిన్ని సంవత్సరాల పాటు ఈ సమాచారం భూమికి అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బిటార్​లోని ఇమేజింగ్ పేలోడ్​లు చందమామకు సంబంధించి అత్యద్భుతమైన ఫొటోలను పంపించాయని చెప్పారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్​షాప్​లో.. చంద్రయాన్-2 మిషన్ (chandrayaan 2 mission) ఆపరేషన్లు, ప్రాజెక్టు ట్రాకింగ్, డేటా ఆర్కైవల్ వంటి అంశాలపై ప్రసంగాలు జరగనున్నాయి. ఇస్రో, డిపార్ట్​మెంట్ ఆఫ్ సైన్స్​కు చెందిన శాస్త్రవేత్తలు, విద్యా సంస్థల్లోని పరిశోధకులు ఇందులో పాల్గొంటున్నారు. ఇస్రో వెబ్​సైట్​తో పాటు ఫేస్​బుక్​లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. సాధారణ విద్యార్థులు, విద్యా సంస్థలు సహా అన్ని వర్గాలకు చంద్రయాన్-2 పంపిన సమాచారంపై విస్తృత అవగాహన కోసం ఈ ఏర్పాట్లు చేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.