ETV Bharat / science-and-technology

పాస్​వర్డ్​లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్​పర్ట్స్ మాటేమిటి? - ఎమోజీలను పాస్​వర్డ్స్​లో ఉపయోగించవచ్చా

Can I Use Emojis In Passwords In Telugu : మీరు ఎమోజీలతో పాస్​వర్డ్​లు క్రియేట్ చేసుకున్నారా? అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎమోజీలను కేవలం ఫన్​ కోసం మాత్రమే ఉపయోగించాలని, సెక్యూరిటీ కోసం కాదని వారు అంటున్నారు. అది ఎందుకో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Can I Use Emojis In Passwords
Why should not use Emojis in passwords
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 1:32 PM IST

Can I Use Emojis In Passwords : సోషల్ మీడియాలో మన భావాలను సింపుల్​గా వ్యక్తం చేయడం కోసం ఎమోజీలను వాడుతూ ఉంటాం. అయితే కొంత మంది ఈ ఎమోజీలను ఉపయోగించి పాస్​వర్డ్​లను క్రియేట్​ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచి ఐడియా కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

1. మీ అకౌంట్​ లాక్ అయిపోవచ్చు!
సాధారణంగా కొన్ని ప్లాట్​ఫామ్స్​ ఎమోజీ పాస్​వర్డ్​లను సపోర్ట్ చేస్తాయి. మరికొన్ని సపోర్ట్ చేయవు. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్​ఫామ్స్​లో మీరు లాగిన్ కాలేరు. కొన్నిసార్లు మీరు ఉపయోగించే ప్లాట్​ఫామ్స్​ తమ పాస్​వర్డ్ రూల్స్ మారుస్తుంటాయి. ఇలాంటి సందర్భంలోనూ.. మీరు క్రియేట్​ చేసుకున్న ఎమోజీ పాస్​వర్డ్​లతో లాగిన్ కాలేరు. అలాగే కంపాటిబిలిటీ సమస్యలు కూడా ఏర్పడవచ్చు.

2. మీ పాస్​వర్డ్​ను సులువుగా ఊహించవచ్చు!
నార్డ్​పాస్​ రీసెర్చ్​ ప్రకారం, ప్రపంచంలో చాలా మంది అత్యంత సులువైన పాస్​వర్డ్​లను క్రియేట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు 123456, admin, password, iloveyou, 111111, 123123, abc123, qwerty, lovely, welcome లాంటి పాస్​వర్డ్​లను పెట్టుకుంటున్నారు. ఇలాంటి సింపుల్ పాస్​వర్డ్​లను సైబర్ నేరగాళ్లు చాలా సులువుగా క్రాక్ చేయగలరు. ఇదే విధంగా ఎమోజీ పాస్​వర్డ్​లను కూడా హ్యాకర్స్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే, చాలా మంది మోస్ట్ పాప్యులర్ ఎమోజీలనే ఉపయోగిస్తూ ఉంటారు.

3. క్రాస్ ప్లాట్​ఫాం ఇష్యూస్​ వస్తాయ్​!
వాస్తవానికి ఎమోజీలు అన్నీ యూనీకోడ్ స్టాండర్డ్స్​లోనే ఉంటాయి. కనుక అన్ని ప్లాట్​ఫామ్స్​కీ ఇవి సపోర్ట్ చేస్తాయి. కానీ, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే.. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్​లలో ఈ ఎమోజీలు డిఫరెంట్​గా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు సరైన ఎమోజీని ఎంచుకోవడం కష్టమవుతుంది. దీనితో మీరు సరైన పాస్​వర్డ్​ను ఎంటర్ చేయలేరు. పైగా మీరు ఇలా ఎక్కువ సార్లు తప్పుడు ఎమోజీ పాస్​వర్డ్​ను టైప్​ చేస్తే.. మీ అకౌంట్​ రీ-వెరికేషన్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సార్లు పూర్తిగా మీ అకౌంట్ లాక్​ లేదా బ్లాక్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

4. తీవ్రమైన అసౌకర్యానికి గురికావల్సి వస్తుంది!
సెక్యూరిటీ విషయాన్ని పక్కన పెడితే.. డెస్క్​టాప్​, ల్యాప్​టాప్​ల్లో ఎమోజీలు వాడడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా మనం స్మార్ట్​ఫోన్​ల్లో చాలా సులువుగా ఎమోజీలను వాడేస్తూ ఉంటాం. కానీ డెస్క్​టాప్​, ల్యాప్​టాప్​ల్లో ఎమోజీలను వాడాలంటే.. ViVeTool లాంటి వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ వీటి ద్వారా ఎమోజీ పాస్​వర్డ్​లను టైప్​ చేయడం ఏమాత్రం సౌకర్యవంతంగా ఉండదు.

5. షోల్డర్ సర్ఫింగ్​​ జరగవచ్చు!
సాధారణంగా మనం స్మార్ట్​ఫోన్లలో ఎక్కువగా ఎమోజీలు వాడుతుంటాం. ఈ స్మార్ట్​ఫోన్లు మనం రీసెంట్​గా ఉపయోగించిన ఎమోజీలను టాప్​ కార్నర్​లో డిస్​ప్లే చేస్తూ ఉంటాయి. కనుక మన పక్కన ఉన్నవారు చాలా సులువుగా.. మనం ఏయే ఎమోజీలు వాడేమో తెలుసుకోగలుగుతారు. అలాగే సైబర్​ నేరగాళ్లు కూడా.. మన ఫోన్లలో కొన్ని రకాల స్పై యాప్స్​ ఇన్​స్టాల్​ అయ్యేలా చేసి, మన స్క్రీన్​ను రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇలా మనం వాడిన ఎమోజీలను షోల్డర్ సర్ఫింగ్​ ద్వారా సైబర్​ నేరగాళ్లు సులువుగా గుర్తించగలుగుతారు. దీనివల్ల మన వ్యక్తిగత సమాచారం మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోతుంది. కనుక వీలైనంత వరకు ఎమోజీలతో పాస్​వర్డ్​లను క్రియేట్ చేసుకోవడం మానుకోవాలి.

స్ట్రాంగ్​ పాస్​వర్డ్స్ క్రియేట్ చేసుకోవడం ఎలా?
How To Create Strong Password : అంకెలు, అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లు ఉపయోగించి కాంప్లెక్స్​ పాస్​వర్డ్​లను క్రియేట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే మీరు సేఫ్​గా ఉంటారు. ఎందుకంటే కాంప్లెక్స్ పాస్​వర్డ్​లను క్రాక్​ చేయడం అంత సులభమేమీ కాదు. అయితే ఇలా క్రియేట్ చేసుకున్న కాంప్లెక్స్ పాస్​వర్డ్​లను మనం గుర్తించుకోవడం కూడా కాస్త కష్టమే. అందుకే వీటిని సీక్రెట్​గా ఒక నోట్​బుక్​లో రాసుకోవాలి. లేదంటే మంచి పాస్​వర్డ్ మేనేజర్​ యాప్​లను ఉపయోగించవచ్చు.

మీరు స్ట్రాంగ్ పాస్​వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పటికీ.. టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్​ను కూడా ఎనేబుల్ చేసుకోండి. అది మీ అకౌంట్​కు మరింత భద్రతను చేకూరుస్తుంది.

ఇయర్​బడ్స్ పోగొట్టుకున్నారా? సింపుల్​గా​ కనిపెట్టేయండిలా!

రూమ్​లో ఉన్న స్పై కెమెరాలను గుర్తించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.