ETV Bharat / science-and-technology

ప్రచారం జీరో.. బ్రాండ్​లు మాత్రం హీరో! - టెస్లా

ప్రపంచంలో అత్యంత బ్రాండ్​ వాల్యూతో దూసుకెళ్తున్న కొన్ని సంస్థలు వ్యాపార ప్రకటనలకు మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నాయి. అయినా అవి అంతగా ప్రాచుర్యం పొందడానికి గల కారణమేంటి? ఆ సంస్థలేమిటో తెలుసుకోండి.

rolls royce
రోల్స్​ రాయిస్​
author img

By

Published : Aug 14, 2021, 12:40 PM IST

బట్టలు, కార్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్​ సామాను.. ఇలా వస్తువు ఏదైనా అది పాపులర్​ కావాలంటే దానికి ప్రమోషన్​లు​ తప్పనిసరి. కానీ, వ్యాపార ప్రకటనలపై తక్కువ మొత్తాన్ని వెచ్చిస్తూ తమదైనా బ్రాండ్​వాల్యుతో మార్కెట్లో దూసుకెళ్తున్న బ్రాండ్​లు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఓ సారి చూద్దాం.

రోల్స్​ రాయిస్​​

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల సంస్థ రోల్స్​ రాయిస్. బ్రిటన్​కు చెందిన ఈ సంస్థను 1906లో స్థాపించారు. ఈ బ్రాండ్​కు ఉన్న సంపన్న కస్టమర్ల ద్వారానే ప్రచారం లభిస్తోంది. వ్యాపార ప్రకటనల కోసం దాదాపు ఎటువంటి పెట్టుబడి పెట్టదనే చెప్పాలి.

క్రిస్పీ క్రీమ్​

నోరూరించే స్వీట్లకు ఈ సంస్థ పెట్టింది పేరు. ప్రకటనలకు సంబంధించి ఈ సంస్థ ఎన్నడూ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిందే లేదు. కస్టమర్లు ఒకరితో మరొకరు ఈ బ్రాండ్ గురించి మాట్లాడటం ద్వారానే దీనికి ఇంత పాపులారిటీ వచ్చింది.

టప్పర్​వేర్​

ప్లాస్టిక్​ వస్తువులకు టప్పర్​వేర్​ సంస్థ చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కిచెన్​ వేర్​, గృహోపకరణాలు, ఫుడ్​ స్టోరేజ్​ చేయడానికి ఈ వస్తువులు ఉపయోగిస్తారు. ఇంతవరకు ఈ సంస్థ అడ్వర్టైజ్​మెంట్​ రూపంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటే నమ్మగలరా!.

నేచురల్స్​ ఐస్​క్రీమ్​

'టేస్ట్​ ది ఒరిజినల్'​ పేరుతో ఫేమస్​ అయింది నేచురల్స్​ ఐస్​క్రీమ్. ఇండియాకు చెందిన ఈ కంపెనీని 1984లో స్థాపించారు. పబ్లిక్​ టాక్​ ద్వారా చాలా మంది కస్టమర్లను ఆకర్షించింది. ఇంతవరకు ఈ సంస్థ ప్రకటనల కోసం డబ్బులు ఖర్చు చేయలేదు.

టెస్లా

దిగ్గజ కార్ల సంస్థ టెస్లాను ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్​ మస్క్​ కాలిఫోర్నియా వేదికగా 2003లో స్థాపించారు. ఈ సంస్థ దాని బ్రాండ్​ వాల్యూ పెంచుకునేందుకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు.

జరా

దుస్తుల వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది జరా సంస్థ. ఈ కంపెనీ కేవలం 0.3 శాతం మాత్రమే అడ్వర్టైజ్​మెంట్​లకు ఖర్చు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఈ షోరూమ్​లు మెగాసిటీలలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ఇదీ చదవండి: థియేటర్ లాంటి అనుభూతి ఇకపై ఇంట్లోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.