ETV Bharat / science-and-technology

ఈ ఐదు యాప్స్‌ చాలా డేంజర్​.. వెంటనే డిలీట్‌ చేసుకోండి!

డేటాను తస్కరిస్తున్న ఐదు ప్రమాదకరమైన మాల్‌వేర్‌ యాప్‌లను ఇటీవల గుర్తించిన గూగుల్​.. తాజాగా వాటిని ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అవేంటో తెలుసుకుందాం.

Beware of these malware apps on Google Play Store! Delete from your phone now
ఫోన్‌లో ఈ ఐదు యాప్స్‌ ఉన్నాయా?
author img

By

Published : Jun 24, 2022, 9:46 AM IST

ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన మాల్‌వేర్‌ యాప్‌లను గుర్తించి ఎప్పటికప్పుడు గూగుల్‌ నిషేధం విధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఐదు యాప్‌లను తొలగించింది. ఇవి స్పైవేర్‌ యాప్‌లుగా పనిచేస్తూ మొబైల్‌లోని ఇతర యాప్‌ల నుంచి డేటాను తస్కరిస్తున్నాయట. ఇవి మీ మొబైల్‌లో ఉంటే అన్‌ ఇన్‌స్టాల్‌ చేసేయండి.

ఈ యాప్స్‌ ఉన్నాయా?
PIP Pic Camera Photo Editor: పీఐపీ పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌ యాప్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఇందులోని మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలను దొంగలిస్తోందట. దీనిని పది లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం.

Wild & Exotic Animal Wallpaper: వైల్డ్‌ అండ్​ ఎక్సోటిక్‌ యానిమల్‌ వాల్‌పేపర్ యాప్‌లో మాస్క్వెరేడింగ్ అనే యాడ్‌వేర్ ఉంటుంది. ఇది మొబైల్‌లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మారుస్తుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇక ఈ యాప్‌ను 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట.

Zodi Horoscope – Fortune Finder: జోడి హారోస్కోప్‌ - ఫార్చ్యూన్‌ ఫైండర్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా వివరాలను తస్కరిస్తోంది. దీన్ని కూడా 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారట.

PIP Camera 2022: కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు 'పీఐపీ కెమెరా 2022' యాప్‌ను వాడుతుంటారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్‌వేర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తోంది. ఈ యాప్‌ను 50 వేల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం.

Magnifier Flashlight: మ్యాగ్నిఫిషర్‌ ప్లాష్‌లైట్‌ యాప్‌లో వీడియో, స్టాటిక్‌ బ్యానర్‌ యాడ్స్‌ ఎక్కువగా వస్తాయి. సైబర్‌ నేరగాళ్లు వీటి నుంచి యాడ్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపి డేటాను సేకరిస్తున్నారు. దీనిని 10 వేల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

యాప్స్‌లో మాల్‌వేర్‌ ఎలా పనిచేస్తుంది?
ఆండ్రాయిడ్ యాప్స్‌ ఉపయోగించే యూజర్లకు మాల్‌వేర్ ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా డేటా చోరికి పాల్పడుతూనే ఉంటుంది. యాప్‌లలో తరచుగా యాడ్స్‌ ను తీసుకొస్తూ యూజర్లను వాటిపై క్లిక్‌ చేయాలని పదేపదే అడుగుతూ ఉంటోంది. ఒకవేళ యూజర్‌ క్లిక్‌ చేస్తే మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. యూజర్ల ముఖ్యమైన సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటాను సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తుంది.

మాల్‌వేర్‌ను అడ్డుకోవడం ఎలా..?
ఫోన్‌లో మాల్‌వేర్‌ / వైరస్ ఉన్నట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా యాంటీ వైరస్‌ లేదా యాంటీ మాల్‌వేర్‌ ప్రోగ్రాం ఇన్‌స్టాల్‌ చేసుకోమని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఫోన్‌ని పూర్తిగా స్కాన్ చేసి ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్‌ ఉంటే గుర్తించి రిపోర్టు చూపిస్తాయి.

ఫోన్‌లో మాల్‌వేర్ తొలగించేందుకు ఉన్న మరో మార్గం ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని యాప్‌లు డిలీట్ అయిపోయి, ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉన్నాయో... అలా సెట్టింగ్స్‌ వస్తాయి. ఫోన్ ప్యాక్టరీ రీసెట్ చేయాలంటే కాంటాక్ట్స్‌తో పాటు ఇతర డేటాను బ్యాకప్ చేసుకోవడం మరిచిపోకండి.

ఇదీ చదవండి: ట్విట్టర్​లో భారీ మార్పు​.. ఇకపై 2,500 అక్షరాల వరకు ట్వీట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.