Best Earbuds Under 1500 : ప్రస్తుతం యువత వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇవి చూడడానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. అలాగే మంచి సౌండ్ క్వాలిటీని కలిగి ఉంటాయి. అయితే సాధారణ ఇయర్‌ఫోన్స్‌తో పోల్చితే వీటి ధర కాస్త ఎక్కువనే చెప్పాలి. కానీ ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్లోనే మంచి సౌండ్ క్వాలిటీతో, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఇయర్‌బడ్స్ లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.1500 అయినా ఫర్వాలేదు. మార్కెట్లో మంచి క్వాలిటీ ఇయర్‌బడ్స్ రెడీగా ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా?
బోట్ ఎయిర్‌డోప్స్ 121వీ2
BoAt Airdopes 121v2 Specifications : ఇవి బ్లూటూప్ వీ5.0 సపోర్ట్‌తో వస్తాయి. ఇన్‌స్టా వేక్ ఎన్ పెయిర్ టెక్నాలజీతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్.. మీ డివైజ్‌తో సులువుగా కనెక్ట్ అయిపోతాయి. ఇందులోని 380ఎమ్ఏహెచ్ క్యారీ కమ్ ఛార్జింగ్ కేస్ 10.5 గంటల ప్లేటైమ్‌ను ఇస్తుంది. దానితో పాటు 3.5 గంటల పాటు మంచి ఆడియో ఎక్స్పీరయన్స్ను అందిస్తుంది.
బోట్ ఎయిర్‌డోప్స్ 121వీ2లో 8ఎమ్ఎమ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇందులోని స్టీరియో కాలింగ్ ఫీచర్.. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు క్లియర్ కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌లోని మల్టీఫక్షన్ బటన్ కంట్రోల్‌తో వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో సుమారు రూ.1245గా ఉంది.
జెబ్రోనిక్స్ జెబ్ సౌండ్ బాంబ్ 1
Zebronics Zeb Sound Bomb 1 Features : ఈ మోడల్ ఎయిర్ బడ్స్.. మంచి క్వాలిటీ సౌండ్‌ను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ వీ5.0 సపోర్టుతో వస్తాయి. అలాగే మీ సెల్‌ఫోన్‌లోని మ్యూజిక్‌ను మంచిగా మ్యాచ్ చేస్తుంది. దీనిలో 6ఎమ్ఎమ్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇది మీకు మంచి సౌండ్ క్వాలిటీని ఇస్తుంది. దీని ఛార్జింగ్ కేస్ చాలా చిన్నగా ఉండి.. మీతో పాటు ఎక్కడికైనా చాలా సులువుగా తీసుకుపోవడానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం దీని ధర సుమారుగా రూ.798గా ఉంది.
హామర్ కో 2.0
Hammer Ko 2.0 specs : ఈ ఇయర్‌బడ్స్‌ను కాల్స్, మ్యూజిక్, గేమింగ్, స్పోర్ట్స్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. హామర్ కో 2.0 టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్‌కు బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. ఇది ఇన్స్టాంట్, లాంగ్ డిస్టాన్స్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులోని 13ఎమ్ఎమ్ డైనమిక్ డ్రైవర్స్.. మంచి క్వాలిటీ సౌండ్‌ను అందిస్తాయి. కాల్స్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. దీనిని కేవలం 2 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
ముఖ్యంగా ఈ హామర్ కో 2.0 ఐపీఎక్స్4 సర్టిఫికేట్ కలిగి ఉంది. దీనిని ప్రత్యేకంగా స్వీట్ ఫ్రీ ట్రైనింగ్ కోసం, స్పోర్ట్ యాక్టివిటీ కోసం రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.2,299 గా ఉంది. మీ బడ్జెట్ కంటే కాస్త ఎక్కువైనప్పటికీ.. ఇది మంచి ఎంపిక అవుతుంది.
బోట్ ఎయిర్‌డోప్స్ 141
Boat Airdopes 141 Features : ఈ ఇయర్ బడ్స్.. ప్లేటైమ్ 9 గంటల వరకు వస్తుంది. దీనితో పాటు వచ్చే నెక్‌బ్యాండ్ మంచి గ్రేడ్ సిలికాన్ ఫినిష్‌తో.. మీకు మంచి వేరింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. దీనిలోని బ్లూటూత్ కనెక్టవిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,099గా ఉంది.
బౌల్ట్ ఆడియో ఎయిర్‌బాస్ క్యూ10
Boult Audio Airbass Q10 Features : ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేక ఏమిటంటే.. దీనిలో లో-లేటన్సీ గేమింగ్ మోడ్ (<120ఎమ్ఎస్). దీని బ్యాటరీ లైఫ్ 24 గంటలు. ఈ ఇయర్‌బడ్స్ ఫుల్ టచ్ కంట్రోల్‌ను కలిగి ఉండి.. మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ ఇన్ ఇయర్ స్టైల్ డిజైన్‌తో, బ్లూటూత్ 5.0 సపోర్టుతో మంచి ఆడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే ఇందులోని సోలో మల్టీ ఫక్షన్ బటన్.. మ్యూజిక్ ప్లే/పాజ్, ప్రీవియస్/స్కిప్ ట్రాక్స్, ఆన్సర్/రిజెక్ట్ కాల్స్‌ను ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1399గా ఉంది.