ETV Bharat / science-and-technology

Bengaluru science gallery: ఇది సైన్స్‌ మ్యూజియం మాత్రమే కాదు... అంతకుమించి..

author img

By

Published : Nov 28, 2021, 5:11 PM IST

ఆ మ్యూజియంలోకి ‘సైన్స్‌ అంటే ఏమిటీ?’ అన్న ప్రశ్నతో వెళితే ‘సైన్స్‌ కానిదేదీ!’ అన్న జవాబుతో తిరిగొస్తారు. ‘అసలు సైన్స్‌ లేనిదెక్కడ!’ అన్న నిజాన్నీ గ్రహిస్తారు. ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూపువాళ్లైనా సరే... జిజ్ఞాసతో అడుగుపెడితే మిమ్మల్నీ ఓ ‘పార్ట్‌టైమ్‌’ సైంటిస్టులుగా మార్చేస్తారు. కర్ణాటక రాజధాని నగరంలో ఉన్న ఈ ‘సైన్స్‌ గ్యాలరీ-బెంగళూరు’ కేవలం ఓ సైన్స్‌ మ్యూజియం మాత్రమే కాదు... అంతకుమించిందని (Bengaluru science gallery Specialties) చెప్పొచ్చు. ప్రపంచంలో ఇలాంటివి మరో ఏడు మాత్రమే ఉన్నాయి... ఆసియాలో ఇదే మొదటిది!

Bengaluru science gallery Specialties
Bengaluru science gallery Specialties

ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’ వంటి పుస్తకాలకి మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు అలాంటి సమాచారాన్ని ఇచ్చే యూట్యూబ్‌ వీడియోలు వచ్చేశాయి. అలాంటి పాపులర్‌ వీడియోల దృశ్యాలను మరింత అత్యాధునిక సాంకేతికతతో నేరుగా చూపించ గలిగితే ఎలా ఉంటుందీ... ఆ పనే చేస్తుంది ఈ సైన్స్‌గ్యాలరీ. ‘మన నగరాల్లోని సైన్స్‌ సెంటర్‌లూ, మ్యూజియంలు చేసేది ఇదే కదా’ అన్న సందేహం రావొచ్చు... అవన్నీ రకరకాల సైన్స్‌ వస్తువుల్ని చూపించి ‘ఏమిటీ? ఎందుకూ?’ అని వివరిస్తాయి. కానీ ఈ గ్యాలరీ అక్కడితో ఆగకుండా ‘ఎలా?’ అన్నదానిపైన ఎక్కువ దృష్టిపెడుతుంది. అది కూడా మనల్ని పూర్తిగా ఈ శాస్త్రీయ విశ్లేషణలో భాగస్వాముల్ని(Bangalore science gallery Specialties in telugu) చేస్తుంది. ఉదాహరణకి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ గురించి వివరించాలనుకోండి... అసలు మామూలు బొమ్మలు కదిలే దృశ్యంగా ఎలా మారుతాయో చెబుతారు. మీతోనే వాటిని గీయిస్తారు. వాటిని 2డీ యానిమేషన్‌గానూ, తర్వాత 3డీగానూ, గ్రాఫిక్స్‌గానూ మీచేతే చేయిస్తారు!

Bengaluru science gallery Specialties
సైన్స్‌ గ్యాలరీలో శాస్త్రీయ విశ్లేషణ

సూక్ష్మక్రిముల చప్పుడు..!

రోడ్డుపైన నిలిచిపోయే నీళ్లలో సూక్ష్మక్రిములు ఉంటాయని తెలుసు... వాటిని మైక్రోస్కోపుతోనే చూడగలమని వినే ఉంటాం. ఈ గ్యాలరీలో ఓ చోట అలాంటి ఒక మైక్రోస్కోపులోని లెన్స్‌ల స్థానంలో అతిచిన్న మైక్రోఫోన్‌లని పెట్టి ఓ పరికరాన్ని(Bengaluru science gallery Specialties) తయారుచేశారు. అది నీటిలో ఉన్న క్రిముల కదలికలతో ఏర్పడే అతిసూక్ష్మమైన చప్పుళ్లని పెద్దగా చేసి వినిపిస్తుంది! దానితోపాటూ అసలు ‘బతకడం అంటే ఏమిటీ?’ అన్న ప్రశ్నతో మన ఎదుట ఓ పేపర్‌పైన చిన్నరొయ్యల(ష్రింప్స్‌) గుడ్లని ఎండబెడతారు. పేపర్‌ పూర్తిగా ఎండిపోయాక ఆ గుడ్లు నిర్జీవమైన పేపర్‌ముక్కల్లాగే అనిపిస్తాయి... ప్రాణానికి సంబంధించిన ఏ సూచనా వాటిల్లో ఉండదు. అవే గుడ్లని మరో గంటసేపు నీళ్లలో పెడితే ఆ గుడ్లకి ప్రాణం వచ్చే వింతని చూపించి... ‘జీవం’ అన్న భావనకి కొత్త అర్థం చెబుతారు.

రోబోలతో కలిసి జీవించాల్సి వస్తే ఎలా..

భవిష్యత్తులో రోబోలతో కలిసి జీవించాల్సి వస్తే ఆ సమాజం ఎలా ఉంటుందో అత్యాధునిక పరికరాల సాయంతో చూపి ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఈ గ్యాలరీలోని రెస్టరంట్‌లో తినే తిండి కూడా సైన్స్‌ మన జీవితంలో ఎంత విడదీయరాని భాగమో(Bengaluru science gallery) చెబుతుంది. బంగాళాదుంప చిప్స్‌, తాగే నీరూ, పాలల్లో ఏ మూలకాలున్నాయో... వాటిని పీరియాడిక్‌ టేబుల్‌లో ఏ విధంగా గుర్తుపట్టాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా వివరిస్తారు. ఈ గ్యాలరీలో మీరు తిరిగేటప్పుడు ఎంత ఆక్సిజన్‌ పీల్చారో, మీ నుంచి ఎంత కార్బన్‌ డయాక్సైడ్‌ వచ్చిందో కూడా అప్పటికప్పుడు లెక్కించి అబ్బురపరుస్తారు!

Bengaluru science gallery Specialties
సైన్స్‌నీ కళలనీ సమానంగా జోడించిన గ్యాలరీ

మీరు చదివింది ఏదైనా..

మనలో చాలామంది టెన్త్‌ తర్వాత కామర్సో, ఇంజినీరింగో, ఆర్ట్సో తీసుకుని ప్యూర్‌ సైన్స్‌కి దూరమైపోతుంటారు. అయినా, సైన్స్‌పైన ఆసక్తిని చంపుకోలేక పోతుంటారు. అలాంటి వాళ్లూ ఇక్కడికొచ్చి తమకి ఆసక్తి ఉన్న అంశంపైన అవగాహన పెంచుకుని ఏకంగా పరిశోధనాపత్రాన్నీ(Science exhibition in bangalore) సమర్పించొచ్చు. ఇందుకోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ), యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి సంస్థల్లోని నిపుణులూ సహకరిస్తారు. ఇందులో నిష్ణాతులయ్యా రనిపిస్తే మీరూ ఆన్‌లైన్‌ ద్వారా దేశ విదేశీయులకి మాస్టర్‌ క్లాస్‌లని నిర్వహించొచ్చు! నిజానికి ఈ సైన్స్‌ గ్యాలరీ వ్యవస్థాపకురాలు జాహ్నవి ఫాల్కే కూడా ఒకప్పుడు ఆర్ట్స్‌ చదువుకుని విజ్ఞానశాస్త్రం బాటపట్టినవారే. ఆ తర్వాత ఆమె లండన్‌ కింగ్స్‌ కళాశాలలో ఫిజిక్స్‌ బోధకురాలయ్యారు. లండన్‌ సైన్స్‌ మ్యూజియమ్‌ క్యూరేటర్‌గానూ మారారు! మనదేశంలో సైన్స్‌ ఏ కొందరికో కాకుండా అందరికీ చేరువచేయాలని ఆమెకి ఉండేదట. అప్పుడే ఆమె దృష్టి డబ్లిన్‌ నగరంలో ఉన్న ట్రినిటీ కాలేజీకి చెందిన సైన్స్‌ గ్యాలరీపైన పడింది. సైన్స్‌నీ కళలనీ సమానంగా జోడించిన గ్యాలరీ ఇది. ఇలాంటివి డబ్లిన్‌తో పాటూ బెర్లిన్‌, డెట్రాయిట్‌, మెల్‌బోర్న్‌, రోటర్‌డ్యామ్‌, అట్లాంటా, లండన్‌, నగరాల్లోనూ ఉన్నాయి. వీటన్నింటినీ సైన్స్‌గ్యాలరీ ఇంటర్నేషనల్‌ అన్న సంస్థ నిర్వహిస్తుంటుంది. ఆ సంస్థ కిందే ఆమె బెంగళూరులో ఈ సైన్స్‌ గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఈ సారి బెంగళూరు వెళితే ఈ సైన్స్‌ ప్రపంచాన్నీ చూసొస్తారుగా..!

ఇదీ చదవండి: revanth salutes to farmer: అద్భుతమైన పాట పాడిన 93 ఏళ్ల రైతుకు రేవంత్​రెడ్డి పాదాభివందనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.