రుణ యాప్‌ల వ్యవహారంలో... గూగుల్ ప్లేస్టోర్ నుంచి సుమారు రెండు వందల యాప్‌లను తొలగించారు. రుణగ్రహీతలను వేధిస్తున్న సంస్థలకు చెందిన యాప్‌లను తొలగించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. స్పందించిన గూగుల్ ఆయా యాప్‌లను తొలగించింది. మరిన్ని యాప్‌లను తొలగించాలని పోలీసు అధికారులు సంస్థను కోరారు.
యాప్ నిర్వాహకులు వేధింపుల బారినపడిన వారు డయిల్ 100, లేదా సమీప పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని, ఎవరూ బలవన్మరణాకు పాల్పడవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి : పోలీసులకు చిక్కిన రుణయాప్‌ల ప్రధాన నిందితుడు