లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యాం. మీరు పుస్తక ప్రియులైతే పుస్తకాలు చదివేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదేమో..! కానీ, మీకు నచ్చిన పుస్తకాలను చదవడం కాకుండా ఆడియో రూపంలో వినాలనుకునే వారికి.. తక్కువ సమయంలో పుస్తకం పూర్తి చేయాలనుకునే వారికి పుస్తకాలు అందుబాటులో ఉంచింది ఆడిబుల్ (Audible) అనే యాప్.
ఇందులో అనేక రకాల ఆడియో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో మీ పనులు చేసుకుంటూనే పుస్తకం వినేయొచ్ఛు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారు అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నా ఆడియో బుక్ పెట్టేయొచ్చు.
మీ ఫోన్‌తో అమెజాన్ అకౌంట్‌లో లాగిన్ అయితే చాలు. అనేక ఆడియో బుక్స్ అందుబాటులోకొస్తాయి. సబ్‌స్క్రైబ్ చేసుకుని నచ్చిన పుస్తకాన్ని ఎంచుకొని వినొచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుకోవచ్చు.