అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ రెండో వార్షిక డెవలపర్స్ సదస్సును ప్రారంభించింది. ఐఫోన్లు, ఐమ్యాక్‌లు సహా ఇతర డివైజ్‌లకు సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. పెయిడ్ ఐ క్లౌడ్ సర్వీస్‌కు మరింత ప్రైవసీ పెంచడం, ఒరిజినల్ ఐపాడ్లను గుర్తించేందుకు వీలుగా మై సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
అన్నింటికీ ఒకే మౌస్, కీబోర్డ్..
యాపిల్ త్వరలో కొత్త మ్యాక్ ఓఎస్‌ను విడుదల చేయనుంది. దీనిని యూనివర్సల్ కంట్రోల్‌గా పేర్కొంది యాపిల్. పేరుకు తగ్గట్లుగానే.. దీనతో ఐమ్యాక్ డెస్క్‌టాప్ కంప్యూటర్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్, ఐపాడ్ వంటి అన్ని గాడ్జెట్లను ఒకే మౌస్, కీబోర్డ్‌తో కంట్రోల్ చేసేందుకు వీలు కలగనుంది.
మరింత ప్రైవసీ..
పెయిడ్ ఐ క్లౌడ్ యూజర్లకు మరింత ప్రైవసీ కల్పించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఈ-మెయిల్ అడ్రస్‌ను హైడ్ చేయడం, వీడియోలను ఎన్‌క్రిప్ట్ రూపంలో భద్రపరుచుకోవడం, సఫారీలో వీపీఎన్ తరహా డేటా ఎన్క్రిప్షన్ విధానం వంటివి ఇందులో ఇన్నాయి.
పెయిడ్ ఐ క్లౌడ్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది యాపిల్. 5 జీబీ క్లౌడ్ స్టోరేజీ వరకు ఉచితంగానే పొందొచ్చని వెల్లడించింది. 50 జీబీ స్టోరేజీకి కోసం నెలకు ఒక డాలర్ చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.
ఐఓఎస్ 15 ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై యాపిల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే సాధారణంగా యాపిల్ ఫ్రీ అప్డేట్లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంటుంది.
ఇదీ చదవండి:Bitcoin: పాస్‌వర్డ్ చెప్పకుండా చనిపోతే..?