iPhone 14 Pro, iPhone 14 Pro max New Feature: టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ గురించి తాజా సమాచారం బయటకు వచ్చింది. ఈ సిరీస్‌లోని ప్రో మోడల్స్.. కొత్త డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంటాయని తెలిసింది. 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ విడుదల కానున్నాయి. 13 సిరీస్‌తో పోలిస్తే కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్లతో ఇవి లాంఛ్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఉండే అమోలెడ్ (Always On Display-AOD) డిస్‌ప్లే ఫీచర్ ఈ కొత్త ఐఫోన్లకు రానుందని సమాచారం.
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో ఫోన్లు.. ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే (Always On Display-AOD) ఫీచర్‌తో వస్తాయని ఆంగ్ల వార్త సంస్థ బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. యాపిల్ వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో పని చేసినట్టే ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ మొబైల్స్‌లోనూ 'ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే'(AOD) పనిచేస్తుందని తెలిపింది. అయితే వాచ్ సిరీస్‌లో వినియోగించిన LTPO డిస్‌ప్లేనే ఈ మొబైల్స్‌కు యాపిల్ పొందుపరుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదని చెప్పింది.
అసలేంటీ ఫీచర్?
దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల్లో 'ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే'(AOD) ఫీచర్ ఉంటుంది. మొబైల్ లాక్ వేసినా.. టైమ్, నోటిఫికేషన్ల సింబల్స్ సహా మరిన్ని వివరాలు ఫోన్‌పై ఎప్పుడూ కనిపిస్తుంటాయి. అయితే 'ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే' ఆన్ చేసుకుంటే ఎప్పుడూ స్క్రీన్ యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ బ్యాటరీని వినియోగించుకుంటుంది. అయితే తరచూ ఫోన్ చెక్ చేసుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాగా, ఐఫోన్ 13 ప్రో మోడల్‌కే ఈ ఫీచర్ వస్తుందని గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే అది జరగలేదు. ఇప్పుడు మాత్రం ఐఫోన్ 14 ప్రో మోడల్స్ డిస్‌ప్లేకు AOD ఫీచర్ యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: మీ ఫొటోతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. ఇలా తయారు చేసుకోండి..
200 మెగాపిక్సెల్ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?