అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్.. బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌ను భారత్‌లో లాంఛ్ చేసింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. గత నెలలో అమెరికాలో ప్రారంభించిన ఈ ఆఫర్ భారత్‌లో పరిమితకాలమే ఉంటుందని పేర్కొంది.
ఏంటీ ఆఫర్..?
యాపిల్ ఉత్పత్తులైన ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ ప్రో, మ్యాక్ మినీలో ఏ మోడల్‌ను కొనుగోలు చేసినా.. సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా ఇస్తుంది యాపిల్. ఇప్పటికే విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందిస్తున్న 'ఉన్నత విద్యా ఆఫర్'కు దీనిని అనుసంధానించవచ్చని యాపిల్ ఇండియా తెలిపింది.
మరిన్ని..
'బ్యాక్ టు స్కూల్' ఆఫర్‌తో పాటు.. వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది యాపిల్. మ్యాక్‌బుక్ కొనుగోలుపై 20శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. రూ.49 రీఛార్జ్‌తో యాపిల్ మ్యూజిక్, మూడు నెలలపాటు యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్లు సైతం ఇవ్వనుంది.
ఎలా వర్తిస్తుంది?
యాపిల్ అందిస్తున్న 'బ్యాక్ టు స్కూల్' ఆఫర్‌ను పొందాలంటే.. దేశంలోని ఏదో ఒక సంస్థలో విద్యార్థిగా ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. తాము విద్యార్థులమేనని కచ్చితమైన రుజువులు చూపాలి. దీనిని తమ సైట్‌లోని 'యూని డేస్'(UNiDAYS) ద్వారా ధ్రువీకరించనున్నట్లు యాపిల్ పేర్కొంది. ఈ పోర్టల్‌లో విద్యార్థి ఐడీ నంబర్, పాఠశాల చిరునామా వంటి వివరాలను అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం భారతదేశంలో ఆన్‌లైన్ యాపిల్ స్టోర్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్‌లను పొందే వీలుంది.
ఇవీ చదవండి: