ETV Bharat / science-and-technology

మీరు చెప్తే బిగ్​బీ అమితాబ్ పాడతారు.. ఎలాగంటే?

మీరు అమెజాన్ అలెక్సా వినియోగదారులా! అయితే ఇకపై అందులో అమితాబ్ బచ్చన్ వాయిస్​ను వినొచ్చు. అదెలాగో తెలుసుకోండి.

Amitabh
అమితాబ్
author img

By

Published : Aug 20, 2021, 8:42 AM IST

అభిమానులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హీరో అమితాబ్‌ బచ్చన్‌ను కలవాలనుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఆయన వాయిస్‌ను మాత్రం వినే అవకాశాన్ని అమెజాన్ కల్పించింది. ఎలాగంటారా..? అలెక్సా పవర్‌ డివైస్‌ ద్వారా బిగ్‌ బీ వాయిస్‌ను వినచ్చు. ఈ విషయాన్ని అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి సెలబ్రిటీ వాయిస్‌ ఆగస్టు 19 నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఎలా వినొచ్చంటే?

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ముందుగా అమెజాన్ షాపింగ్ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అందులో మైక్ బటన్‌ను నొక్కి బిగ్‌బి వాయిస్‌ను యాడ్‌ చేసుకోవాలి. ఈ వాయిస్‌ ఫీచర్‌ను ఎనబుల్‌ చేసుకోవడానికి ఏడాదికి రూ.149 కట్టాల్సి ఉంటుంది. దీంతో బిగ్‌ బీ చెప్పే కథలు, పద్యాలు, టంగ్‌ ట్విస్టర్స్‌, స్ఫూర్తిదాయమైన సందేశాల్లాంటివి వినే అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణ విషయాలు, షాపింగ్‌ అప్‌డేట్స్‌తో పాటు పాటలు కూడా ప్లే చేసుకోవచ్చు. మైక్‌ను నొక్కి 'అమిత్‌ జి' ప్లే సాంగ్స్‌ అంటే చాలు మన స్మార్ట్‌ఫోన్లో పాటలు మోగుతాయి.

అమెజాన్‌తో కలిసి పనిచేయడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. "అలెక్సాతో నా వాయిస్‌ను పరిచయం చేయడం నాకొక కొత్త అనుభూతినిచ్చింది. సరికొత్త వాయిస్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నా శ్రేయోభిలాషులు నాతో మాట్లాడబోతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీని గురించి వారి రెస్పాన్స్‌ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.

బిగ్‌బి వాయిస్‌ను యాడ్‌ చేసుకోవాలిలా..

  • ముందుగా అమెజాన్‌ షాపింగ్‌ యాప్‌లో మైక్‌ను నొక్కి పట్టి 'అలెక్సా.. ఇన్ట్రాడ్యూస్‌ మీ టూ అమితాబ్ బచ్చన్‌' అనే కమాండ్‌ను ఇవ్వాలి.
  • తర్వాత 'అలెక్సా..ఎనబుల్‌ అమిత్‌ జి వేక్‌ వర్డ్‌' అనే ఫీచర్‌ను ఎనబుల్‌ చేసుకోవాలి.
  • అమెజాన్‌ యాప్‌లోని అలెక్సా సెక్షన్‌కు వెళ్లి సెట్టింగ్స్‌లో 'అమిత్‌ జి' అనే వర్డ్‌ను ఎనేబుల్‌ చేయాలి.
  • ఒకసారి వేక్‌ వర్డ్‌ను ఎనేబుల్ చేశాక మనకు కావాల్సిన సదుపాయాలను అలెక్సా అందిస్తుంది.
  • హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఒకవేళ భాషను మార్చుకోవాలనుకుంటే 'అలెక్సా స్పీక్‌ ఇన్‌ హిందీ/ఇంగ్లీష్‌' అనే సందేశాన్ని ఇస్తే సరిపోతుంది.

ఇవీ చూడండి: మన హీరోలకు విలన్లు.. అదిరే కాంబినేషన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.