ETV Bharat / science-and-technology

ఎంతసేపు మొబైల్‌ వాడారో చెప్పేస్తుందట! - రాజకీయ నాయకులు ఫోన్ వాడకంపై యాప్

చట్టసభల్లో ఏ నాయకుడు ఎంతసేపు మొబైల్‌ ఉపయోగిస్తున్నారనేది తెలుసుకునేందుకు బెల్జియంకు చెందిన డ్రైస్‌ డిపూర్టర్‌ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ ఒక ప్రోగ్రాం రాశారు. ఇది ఫేస్‌ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేస్తుంది. వాళ్లు సభలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతసేపు మొబైల్ ఉపయోగిస్తున్నారనేది దీని సాయంతో తెలుస్తుంది.

Flemish Scrollers
నయా యాప్
author img

By

Published : Jul 26, 2021, 7:27 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసే చోట మొబైల్‌ఫోన్ వినియోగిచడం అనేది సర్వసాధారణం. దీనివల్ల ఉత్పాదకత దెబ్బతింటుందనేది చాలా మంది వాదన. అయితే చట్టసభల్లో లేదా ప్రభుత్వ సమావేశాల్లో ముఖ్యమైన అంశాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు వాటిపై దృష్టి సారించకుండా మొబైల్‌ఫోన్‌ను చూస్తూ ఉంటున్నారు.

చట్టసభల్లో..

దీంతో చట్టసభల్లో ఏ నాయకుడు ఎంతసేపు మొబైల్‌ ఉపయోగిస్తున్నారనేది తెలుసుకునేందుకు బెల్జియంకు చెందిన డ్రైస్‌ డిపూర్టర్‌ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ ఒక ప్రోగ్రాం రాశారు. ఇది ఫేస్‌ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేస్తుంది. వాళ్లు సభలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతసేపు మొబైల్ ఉపయోగిస్తున్నారనేది దీని సాయంతో తెలుస్తుంది. ఆ సమయంలో వారు ఎందుకోసం అంటే తాము మాట్లాడాల్సిన అంశానికి సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నారా, మెయిల్స్‌ చెక్ చేస్తున్నారా, సామాజిక మాధ్యమాలను చూస్తున్నారా లేదా ఇతరత్రా కార్యక్రమాలకు మొబైల్‌ ఉపయోగిస్తున్నారా అనేది మాత్రం తెలియదు.

అక్కడ ప్రయోగాత్మకంగా..

ఈ సాఫ్ట్‌వేర్‌ను బెల్జియం పార్లమెంట్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియోను 'ది ఫెల్మిష్ స్క్రోలర్‌' అనే ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ను యాప్‌ రూపంలో త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని డిపూర్టర్‌ తెలిపారు. దీనివల్ల చట్టసభల్లో తమ నాయకులు ఏం చేస్తున్నారనేది సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

విభిన్నమైన ఛాట్‌ యాప్​..

డిపూర్టర్‌ గతంలోనే డై విత్‌ మీ అనే ఒక విభిన్నమైన ఛాట్‌ యాప్‌ని అభివృద్ధి చేశారు. ఫోన్‌లో బ్యాటరీ ఛార్జింగ్ 5 శాతం కన్నా తక్కువ ఉంటేనే ఈ యాప్ పనిచేస్తుంది. మీ ఫోన్‌ బ్యాటరీ 5 శాతం ఉన్నప్పుడు యాప్‌ ఓపెన్ చేసి ఇతరులతో ఛాట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ ఫోన్ డేటా సేకరిస్తోంది.. తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.