డిసెంబర్లో మొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. మానవ రహిత మిషన్‌ను భూ కక్ష్యలోకి పంపనున్నట్లు చెప్పింది. కరోనా వల్ల ఇప్పటికే గగన్‌యాన్ ప్రయోగం ఆలస్యమైనట్లు ఇస్రో తెలిపింది. లాక్డౌన్లతో హార్డ్‌వేర్ పంపిణీ మందగించినట్లు పేర్కొంది. దీంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదని వివరించింది.
గగన్‌యాన్‌ను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి మానవ రహిత మాడ్యూల్‌ను డిసెంబర్ 2021లో, రెండోది 2022-23లో అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో వివరించింది.
గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. ఎక్కువ గంటలు పనిచేసైనా ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి:IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్!