బ్రెడ్.. మార్కెట్లో ఎక్కువగా లభించే, తినడానికి అనుకూలంగా ఉండే సులువైన, తేలికైన ఆహారం. దీన్ని సాధారణంగా మైదాతో తయారు చేస్తారు. హోల్గ్రెయిన్తో తయారు చేసిన బ్రెడ్లు ఆరోగ్యానికి మంచివి. ఈ బ్రెడ్లు మనకు రకరకాలుగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొందరు దీన్ని ఉదయం అల్పాహారంగా కూడా తీసుకుంటుంటారు. అయితే అసలు బ్రెడ్ తినడం మంచిదేనా? ఎలాంటి బ్రెడ్ తీసుకోవాలి? బ్రెడ్ తినేటప్పుడు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోండి.
బ్రెడ్ తినడం మంచిదేనా?
బిజీ లైఫ్ కారణంగా చాలామంది బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రెడ్ తీసుకుంటున్నారు. బ్రెడ్ టోస్ట్ లేదా బ్రెడ్ ఆమ్లెట్‌తో ఉదయం అల్పాహారం ముగించేస్తున్నారు. అయితే బ్రెడ్ తినేముందు అందులో పిండి పదార్థం ఎక్కువగా, పీచు తక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిది.
"బ్రెడ్ ఆరోగ్యకరం కాదని చాలామంది అంటుంటారు. అయితే సరైన బ్రెడ్‌ను ఎంపిక చేసుకుంటే అలా జరగదు. పిండితో కాకుండా బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడం ఉత్తమం."
బ్రౌడ్ బ్రెడ్ మోసాలతో జాగ్రత్త..
బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచింది. అయితే అందులో కల్తీ జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మైదా బ్రెడ్కే కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్‌గా విక్రయిస్తుంటారు. కాబట్టి.. ప్యాకెట్ వెనుక భాగంలో రాసి ఉండే ఇంగ్రీడియెంట్స్ జాబితాలో మైదా, హోల్ వీట్ ఎంత శాతం మేర ఉన్నాయో చెక్ చేసుకోవాలి.
బ్రెడ్ ఎందుకు తీసుకోకూడదు?
మైదాతో చేసిన బ్రెడ్‌లో ఎలాంటి పోషకాలుండవు. పైగా అనవసర కొవ్వు పదార్థం అందులో ఉంటుంది. మైదా, స్వీట్ బ్రెడ్లను పక్కనపెట్టడమే మేలు.
ఇవీ నష్టాలు..
- మూడు పూటలా బ్రెడ్ తీసుకునేవారికి ఎక్కువ మొత్తంలో పిండి పదార్థంతో పాటు, ఉప్పు కూడా దాదాపు 137 గ్రాములు లభిస్తుంది. ఈ కారణంగా శరీరంలో ఉప్పు శాతం పెరిగి.. అధిక రక్తపోటు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
- బ్రెడ్‌లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పైగా, బ్రెడ్ తిన్న కొద్ది సేపటికే ఆకలి వేస్తుంది. పదేపదే తిన్నట్లైతే ఊబకాయానికి దారితీస్తుంది.
బ్రెడ్‌లో హోల్‌గ్రెయిన్ ఉండేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అందులోని తృణధాన్యాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే ఈ బ్రెడ్‌ను కూడా మితంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొన్నిరకాల నూనెలను కలుపుతారు.
బ్రెడ్ తినేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తలు..
బ్రెడ్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బ్రెడ్ ఎంపికలో, నిల్వ చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. వీటికి జామ్, బటర్లు పెట్టుకోకుండా తినాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Bran Uses: తవుడు.. పోషకాల తోడు