Momos Case Latest Update : ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బిహార్ నుంచి వచ్చిన అల్మాస్ అనే వ్యక్తి చింతల్ బస్తీలో ఉంటూ మోమోస్ తయారు చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గత నెల శుక్రవారం 25న రేష్మా బేగం అనే మహిళ సింగడకుంటలోని వెజిటబుల్ మార్కెట్లో మోమోస్ కొనుగోలు చేసి తినగా, మూడు రోజుల తర్వాత మృతి చెందారు.
అక్టోబర్ 25న కుమార్తెను వెంట తీసుకువెళ్లిన రేష్మ బేగం అక్కడే వినియోగిస్తున్న మోమోస్ కొని ఇంటికి తీసుకువెళ్లారు. తన కుమార్తెలతో కలిసి వాటిని తిన్నారు. తర్వాతి రోజు నుంచి వారంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. రెండో రోజు రేష్మ బేగం నోటి నుంచి నురగరావటం గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేష్మ బేగం మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మృతురాలి సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు మోమోస్ విక్రయించిన వారిపై ఫిర్యాదు చేశాడు. ఘటనను దర్యాప్తు చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మయోనైజ్ కారణమా? : హైదరాబాద్‌లోని నందినగర్‌లో సింగాడకుంట బస్తీ, గౌరిశంకర్ కాలనీలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఈ సంతలో వెజ్, నాన్‌వెజ్ మోమోస్‌తో పాటు చికెన్ పకోడి విక్రయిస్తుంటారు. దిల్లీ హట్ మోమోస్ షాపులో రేష్మబేగంతో పాటు ఆమె పిల్లలు, మరికొందరు బస్తీ వాసులు మోమోస్‌తో పాటు ఇచ్చిన మయోనిజ్, మిర్చితో తయారు చేసిన చట్నీ తిన్నారు. రాత్రి నుంచే చాలా మందికి వాంతులతో ఇబ్బంది పడ్డారు. అందరూ స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జీహెచ్ఎంసీ మోమోస్ స్టాల్ నుంచి నమూనాలు సేకరించింది. మయోనైజ్ కల్తీ కారణమే దీనికి కారణమని ప్రథమికంగా గుర్తించారు. మరోవైపు మయోనైజ్‌తో ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు హోటల్స్, రెస్టారెంట్లలో దీని వినియోగాన్ని నిషేధించింది.
మోమోస్ బాగున్నాయని తింటే ఓ మహిళ మృతి - 50 మందికి అస్వస్థత
మయోనైజ్ తిని 17 మందికి అస్వస్థత - రక్తపరీక్షల్లో ఏం తేలిందంటే?