ETV Bharat / priya

Vinayaka Chavithi Special Prasadalu Telugu: వినాయక చవితి ప్రసాదాలు.. గణపయ్యకు అత్యంత ఇష్టమైనవి ఇవే! - చింతపండు పులిహోర తయారీ విధానం తెలుగు

Vinayaka Chavithi Special Prasadalu Telugu : వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. దేశమంతటా సందడి వాతావరణం నెలకొంది. గల్లీ నుంచి దిల్లీ దాకా బొజ్జగణపయ్యలు కొలువుదీరుతున్నారు. అయితే.. గణపతిని భోజనప్రియుడు అంటారు. మరి ఆయన పండుగ నాడు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు ఏంటో.. మీకు తెలుసా?

Vinayaka Chavithi Special Prasadalu
Vinayaka Chavithi Special Prasadalu Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 10:08 AM IST

Updated : Sep 18, 2023, 8:06 AM IST

Vinayaka Chavithi Special Prasadalu Telugu: చవితి ఉత్సవాల్లో రకరకాల వినాయక విగ్రహాల తర్వాత.. అత్యంత ముఖ్యమైనవి ప్రసాదాలే. బొజ్జగణపయ్య గణపయ్య భోజనప్రియుడు అన్నసంగతి తెలిసిందే. అందుకే.. ఈ పండుగ వేళ.. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలు తయారు చేసి.. ఆశీర్వాదాలు కోరుతుంటారు భక్తులు. మరి గణపతికి ఇష్టమైన ప్రసాదాలేంటో.. వాటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.

పాల ఉండ్రాళ్లు:

How to Make Pala Undrallu in Telugu: బొజ్జ గణపయ్యకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పాల ఉండ్రాళ్లు. అయితే వీటిని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఈ ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యపు పిండి : కప్పున్నర
  • పాలు : 2 1/2 కప్పులు
  • చక్కెర : 100 గ్రా
  • యాలకుల పొడి : చిటికెడు
  • సాబుదానా(సగ్గుబియ్యం) : 3 టేబుల్‌ స్పూన్స్‌
  • నూనె : పావు టీస్పూన్‌

తయారీ విధానం :

  • ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు(ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్లు), నూనె పోసి మరిగించాలి.
  • ఆ నీళ్లలో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.
  • కొద్దిగా నూనె చేతులకు రాసుకొని ఆ పిండిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
  • ఇలా అన్నీ చేసి పెట్టాక ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి ఆవిరి మీద వీటిని ఉడికించాలి.
  • ఈ లోపు గిన్నెలో పాలు పోసి మరిగించాలి.
  • పాలల్లో సాబుదానా(ఓ పావుగంట నానబెట్టుకోవాలి), చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి.
  • కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి.
  • ఆ తర్వాత ఉడికించిన ఉండ్రాళ్లను వేసి సన్నని మంట మీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.

చింతపండు పులిహోర:

Chintapandu Pulihora Making Process Telugu:
కావాల్సినవి :

  • బియ్యం : ఒక కప్పు
  • చింతపండు: కొద్దిగా
  • పసుపు : ఒక టేబుల్‌ స్పూన్‌
  • పల్లీలు : 3 టేబుల్‌ స్పూన్స్‌
  • ఆవాలు : ఒక టీ స్పూన్‌
  • శెనగపప్పు : ఒక టేబుల్‌ స్పూన్‌
  • జీలకర్ర : ఒక టేబుల్‌ స్పూన్‌
  • ఎండు మిరపకాయలు : 4
  • నూనె, ఉప్పు : తగినంత
  • పచ్చిమిర్చి-4
  • మిరియాలు- ఒక టేబుల్​ స్పూన్​
  • కరివేపాకు-తగినంత

తయారీ విధానం :

  • చింతపండులో వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి కాసేపు నాననివ్వాలి.
  • ఆ తర్వాత అన్నం మెత్తగా కాకుండా కొంచెం పొడిపొడిగా వండాలి.
  • తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చింతపండు రసం, కొన్ని నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోసి.. చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
  • ఈలోపు కడాయిలో నూనె పోసి ఆవాలు, శెనగపప్పును వేయించాలి. ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • తర్వాత కొంచెం పెద్ద ప్లేట్​(అంటే పులిహోర కలపడానికి వీలుగా ఉండేది) తీసుకుని అందులో ఉడికించిన అన్నం, కొద్దిగా నూనె, కొంచెం పసుపు వేసి ముందుగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అన్నంలో.. ఉడికించిన చింతపండు రసం.. ఉప్పు తగినంత వేసుకుని మరొకసారి కలుపుకోవాలి.
  • తర్వాత కలిపిన అన్నంలో.. అంతకుముందు నూనెలో వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, శెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేసి బాగా కలపాలి.
  • అంతే పులిహోర నైవేద్యం మీ ముందుంటుంది.

మోదక్‌:

How to Prepare Modak in Telugu:
కావాల్సిన పదార్థాలు :

  • బియ్యపు పిండి : ఒక కప్పు
  • నెయ్యి : 3 టీస్పూన్స్‌
  • బెల్లం తురుము : ఒక కప్పు
  • కొబ్బరి తురుము : 2 కప్పులు
  • యాలకులు : 3
  • ఉప్పు : చిటికెడు

తయారీ విధానం :

  • కడాయిలో నెయ్యి వేసి బెల్లం, కొబ్బరి తురుము వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయొచ్చు.
  • దీంట్లో యాలకులు వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.
  • ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో ఉప్పు, నెయ్యి వేసి కాసేపు ఉంచి దించేయాలి.
  • ఈ నీళ్లు చల్లారక ముందే.. బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా పూరీ పిండిలా కలుపుకోవాలి.
  • వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ముద్దని చిన్న దొప్పలా చేసుకోవాలి.
  • దీంట్లో బెల్లం మిశ్రమాన్ని ఉంచి మళ్లీ బంతిలా చేసుకోవాలి. దీన్ని మనకు నచ్చిన రీతిలో ముడుచుకోవచ్చు.
  • ఇలా అన్నీ చేసుకున్నాక.. ఇడ్లీ పాత్రలో ఒక గుడ్డ వేసి సిద్ధం చేసిన మోదక్​లను ఉంచాలి.
  • సుమారు పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే గణపయ్యకు ఇష్టమైన మోదకాలు సిద్ధం.

రవ్వ లడ్డూ:

Ravva Laddu Making Process:
కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ : ఒక కప్పు
  • చక్కెర : ఒక కప్పు
  • ఎండు కొబ్బరి పొడి : అర కప్పు
  • పాలు : పావు కప్పు
  • యాలకులు : 4
  • నెయ్యి : 3 టేబుల్‌ స్పూన్స్‌
  • జీడిపప్పు : 10
  • కిస్మిస్‌ : 10

తయారీ విధానం :

  • చక్కెర, యాలకులను కలిపి మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్‌, జీడిపప్పులను వేయించుకోవాలి. గోల్డెన్​ కలర్​ వచ్చాక కడాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోని పక్కన పెట్టాలి.
  • అదే బాండీలో మిగతా నెయ్యి వేసి స్లిమ్​లో రవ్వను వేయించుకోవాలి.
  • రవ్వ రంగు మారిన తర్వాత పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న కిస్మిస్​, జీడిపప్పులను వేసి కలపాలి.
  • చివరగా పాలు వేసి మరికొద్దిసేపు కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీది నుంచి దించి వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవాలి. చల్లగా అయితే లడ్డూలు చేయడం కష్టం.

స్వీట్‌ పొంగల్‌

Sweet Pongal Making Process Telugu:
కావాల్సిన పదార్థాలు

  • బియ్యం : అర కప్పు
  • పెసరపప్పు: అర కప్పు
  • బెల్లం తురుము : అర కప్పు
  • యాలకుల పొడి : చిటికెడు
  • పచ్చ కర్పూరం : చిన్నది
  • నెయ్యి : 3 టేబుల్‌స్పూన్‌
  • జీడిపప్పు : 12
  • కిస్మిస్‌ : 12
  • లవంగాలు : 2
  • ఎండు కొబ్బరి ముక్కలు : 2 టేబుల్‌ స్పూన్స్‌

తయారీ విధానం :

  • కుక్కర్‌లో పెసరపప్పు వేయించుకొని దించేయాలి. ఇందులోనే బియ్యం పోసి రెండూ కలిపి బాగా కడగాలి.
  • ఆ తర్వాత నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పెద్ద గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటమీద చిక్కగా అయ్యే వరకు ఉంచి దించి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు ముందుగా ఉడికించిన అన్నం, పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా పప్పు గుత్తితో మెదపాలి. దీంట్లో బెల్లం పాకం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  • దీన్ని స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద ఉంచాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి వేసి కలపాలి.
  • ఇది అయ్యేలోపు.. చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌, లవంగాలు, కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి.
  • వీటన్నింటిని ఉడుకుతున్న పొంగల్‌లో వేసి రెండు నిమిషాలు ఉంచి దించేస్తే సరి. దించేముందు పచ్చ కర్పూరం వేసి కలపాలి.

రవ్వ అప్పాలు

How to Make Ravva Appalu Telugu:
కావాల్సిన పదార్థాలు

  • బొంబాయి రవ్వ : ఒక కప్పు
  • చక్కెర : 3/4 కప్పు
  • యాలకులు : 3
  • నెయ్యి : 5 టేబుల్‌స్పూన్స్‌
  • నూనె : తగినంత

తయారీ విధానం :

  • ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు.. కొద్దిగా నెయ్యి వేసి రెండు నిమిషాల తర్వాత రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి.
  • 5 నిమిషాలు సన్నని మంటమీద ఉంచి మూత పెట్టి దించేయాలి. కాస్త చల్లారనిచ్చి చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి.
  • ఇప్పుడు దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి.
  • కలిపినప్పుడు తప్ప.. మిగతా సమయంలో మూత పెట్టే ఉంచాలి.
  • ఐదు నిమిషాలు అయ్యాక దించేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
  • చేతికి నెయ్యి రాసుకొని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం చేయాలి. ఆ తర్వాత బాండీలో నూనె పోసి అప్పాలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

చూశారుగా మీరు కూడా వాటిని ఇంట్లో తయారు చేసి.. బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకోండి.

Vinayaka Chavithi Wishes 2023 Special Telugu Quotes: వినాయక చవితి స్పెషల్.. ఈ గణపతి కోట్స్​తో శుభాకాంక్షలు చెప్పండి!

Vinayaka Chavithi 2023 Sep 18th or 19th?: వినాయక చవితి ఎప్పుడు..? 18నా..? 19వ తేదీనా..?

Vinayaka Chavithi 2023 Pooja Vidhanam Telugu : వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి..? పూజా విధానం ఏంటి..?

Last Updated : Sep 18, 2023, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.