శరీరానికి కావాల్సిన ఐరన్ కోసం అరటిపళ్లు, ఇతర ఆహార పదార్థాలు తింటుంటాం. వాటితో పాటు ఎంతో రుచికరంగా, అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండే ఈ చారు చేసుకుంటే మాత్రం మీకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎలా చేసుకోవాలి?
కావాల్సిన పదార్థాలు
నానబెట్టిన ఉలవలు, బెల్లం, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎర్రమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, నూనె, పాలమీగడ
తయారీ విధానం
స్టవ్‌పై వెలిగించి, బాండీ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. దానిని వేరే పాత్రలోకి తీసుకుని అదే బాండీలోకి నానబెట్టిన చింతపండు రసం తీసుకోవాలి. అందులో కొద్దిగా మంచి నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు పోసి మరగనివ్వాలి.
మరోవైపు నానబెట్టిన ఉలవల్ని మిక్సీలో వేసుకుని, మంచినీళ్లు పోసి పేస్ట్‌గా చేసుకోవాలి. దానిని స్టవ్‌పై మరుగుతున్న చింతపండు రసంలో వేసి కలపాలి. అందులో బెల్లంను పొడిగా చేసి వేసుకోవాలి. తగినంత ఉప్పు, అంతకు ముందు తాలింపు పెట్టిన పోపు గింజలు, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో మీగడ వేసి కలిపి, స్టవ్ ఆపేస్తే సరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: