రుచికరమైన ఆంధ్రా స్పెషల్ వంటకం 'ఉలవచారు కోడి కూర'(ulavacharu benefits) ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం..
కావాల్సినవి..
చికెన్ (అర కేజీ), ఉలవచారు (ఒక కప్పు), హోల్ గరంమసాలా-కొద్దిగా, పచ్చి మిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు (ఒక కప్పు), కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్(1 స్పూన్), పసుపు (అర స్పూన్), కారం(1 స్పూన్), గరంమసాలా పొడి(1 స్పూన్), ఉప్పు, ఫ్రెష్ క్రీమ్(అర కప్పు),
తయారీ విధానం..
స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడి అయిన తర్వాత నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత హోల్ గరంమసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత పసుపు, గరంమసాలా, కారం, ఉలవచారు వేసి కలిపి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఫ్రెష్క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా రుచికరమైన ఆంధ్రా ఉలవచారు కోడికూర రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: