ETV Bharat / priya

చిరుజల్లుల వేళ 'పొటాటో వెడ్జెస్‌' చేసుకోండిలా! - wtv bharat food

వాతావరణం చల్లబడగానే.. వేడివేడిగా ఏదైనా తినాలని మనసు కోరుతుంది. కానీ, అప్పటికప్పుడు ఏం చేసుకోవాలో తెలియక సతమతవుతారు చాలామంది. ఇప్పుడు ఆ సమస్య లేదు.. కేవలం బంగాళదుంపలతో గరంగరం పొటాటో వెడ్జెస్‌ ఎలా చేసుకోవాలో చూసి, చేసేయండి మరి.

potato
చిరుజల్లుల వేళ 'పొటాటో వెడ్జెస్‌' చేసుకోండిలా!
author img

By

Published : Aug 16, 2020, 1:01 PM IST

Updated : Aug 16, 2020, 2:40 PM IST

పొటాటో వెడ్జెస్ రెస్టారెంట్లలో రుచి చూసి ఉంటాం కానీ, ఇంట్లో ట్రై చేస్తే ఆ రుచి రావట్లేదేంటీ అనుకుంటాం. మరి ఆ తయారీ సీక్రెట్ ఏంటో చూసి.. ఓ సారి ట్రై చేయండి..

కావల్సినవి

  • బంగాళాదుంపలు - మూడు
  • మైదా - అరకప్పు
  • ఎండుమిర్చి గింజలు - చెంచా
  • కసూరీమేథీ - అరచెంచా
  • చాట్‌మసాలా - ముప్పావుచెంచా
  • ఉప్పు - తగినంత
  • నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ

బంగాళాదుంపల్ని కడిగి.. తుడిచి పొడవాటి ముక్కల్లా కోసుకోవాలి. ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అరచెంచా ఉప్పు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు మరిగాక బంగాళాదుంప ముక్కల్ని వేయాలి. అవి ముప్పావు వంతు ఉడికాక దింపేసి నీళ్లు వంపేయాలి. అవి తడిలేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని కలపాలి. అందులో బంగాళాదుంప ముక్కల్ని ముంచి.. కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. కావాలనుకుంటే పైన కొద్దిగా ఉప్పు చల్లుకోవచ్చు. వీటిని పిల్లలకు స్నాక్స్‌లా ఇవ్వొచ్చు.

ఇదీ చదవండి: 'చికెన్‌ ఘీ రోస్ట్‌'.. తింటే వదల్లేని టేస్ట్!

Last Updated : Aug 16, 2020, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.