ETV Bharat / priya

చిటపటల వేళ 'మొక్కజొన్న గారెలు' చేసుకోండిలా! - corna wada recipe

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. మొక్కజొన్న గారెలు తింటూ ఉంటే.. ఆహా అంతకు మించిన ఆనందమేముంటుంది చెప్పండి. వానాకాలం మొక్కజొన్నపొత్తులను ఎర్రటి బొగ్గులపై కాల్చుకుని తినడం ఎంత బాగుంటుందో.. కుటుంబమంతా కూర్చుని ఈ గారెలు పంచుకుంటే ఆ మజానే వేరు. మరింకెందుకు ఆలస్యం నోరూరించే మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి...

try-mokkajonna-gaarelu-or-makka-vada-with-corns
చిటపటల వేళ 'మొక్కజొన్న గారెలు' చేసుకోండిలా!
author img

By

Published : Jul 22, 2020, 10:32 AM IST

వానాకాలంలో లభించే మొక్కజొన్నలతో గారెలు చేసుకుంటే... సీజనల్​ పోషకాలు మీ శరీరానికి ఇట్టే అందుతాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు కాబట్టి, సాయంకాలం ఏ స్నాక్​ చేయాలా? అని ఆలోచించే పని ఉండదు. మరి రెసిపీ చూసేసి మీరూ ట్రై చేయండి.

try-mokkajonna-gaarelu-or-makka-vada-with-corns
చిటపటల వేళ 'మొక్కజొన్న గారెలు' చేసుకోండిలా!

కావాల్సినవి

  • మొక్కజొన్న గింజలు - ఒకటింపావు కప్పు
  • శెనగపప్పు - అరకప్పు (గంట పాటు నీళ్లలో నానబెట్టాలి)
  • ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
  • పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగినవి)
  • అల్లం - చిన్నముక్క
  • జీలకర్ర - అరటీస్పూన్‌
  • తరిగిన కొత్తిమీర - కొద్దిగా
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ..

ముందుగా మిక్సీ జార్‌లో కప్పు మొక్కజొన్న గింజలు, నానబెట్టిన శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం.. వేసి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, మిగిలిన పావు కప్పు మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరచేతులకు కాస్త నూనె రాసుకొని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని మునివేళ్లతో గారెల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడిచేసుకొని ఈ గారెల్ని అందులో వేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయినట్లే!

ఇదీ చదవండి: నువ్వుల జొన్న రొట్టెతో ఆరోగ్యం గట్టిగుంటది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.