ETV Bharat / priya

చేపలతో ఈజీగా చిరుతిళ్లు చేసుకుందామిలా..! - etv bharat food

చాలా మంది చేపలు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఒకరు వాసన అంటే.. ఒకరు ముళ్లు అంటారు. ఆరోగ్యానికి మేలు చేసే చేపలని ఎలా వండితే ఇష్టంగా తింటారో ఆ రెసిపీస్ మీ కోసం తీసుకొచ్చాం. అపోలో ఫిష్, చేప పకోడి, కట్‌లెట్‌ ఇలా చేసుకుంటే చేపలు నచ్చని వారు కూడా వదలరంతే! రెసిపీస్ సంగతి సరే చేపలు వాసన లేకుండా, ముళ్ళు లేకుండా శుభ్రం చేసేదెలా అంటారా దానికీ ఓ చిట్కా ఉంది చూసేయండి..

try-apolo-fish-fish-pakodi-fish-cutlet-and-other-fish-recipe-and-know-how-to-cut-fish
చేపలతో ఈజీగా చిరుతిళ్లు చేసుకుందామిలా..!
author img

By

Published : Aug 25, 2020, 1:00 PM IST

చేపలు తినాలని ఉన్నా రెండు విషయాలు వెనకడుగు వేసేలా చేస్తాయి. ఒకటి ముళ్లు... రెండోది శుభ్రం చేసే ప్రక్రియ. ఈ రెండింటిని అధిగమించడం రాకపోతే ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే చేపల్ని మనం తినలేం. గర్భిణులు... గుండెజబ్బులున్న వాళ్లు సైతం తినే ప్రొటీన్లు చేపల్లో ఉంటాయి.

try-apolo-fish-fish-pakodi-fish-cutlet-and-other-fish-recipe-and-know-how-to-cut-fish
శుభ్రం చేయండిలా...

ముళ్లు లేకుండా చేపలు శుభ్రం చేసుకుందాం!

పైన పొలుసు తీసి... అడ్డంగా ముక్కలుగా తరగడం సంప్రదాయ పద్ధతి. మనలో చాలామందికి ఈ విధానం మాత్రమే తెలుసు. కానీ ఫిష్‌ ఫిల్లేయింగ్‌ అనేది కొత్త టెక్నిక్‌. దీనివల్ల చేపలని ముళ్లు లేకుండా కోసుకుని.. ఆ చేపముక్కలతో అద్భుతమైన వంటకాలు చేసుకోవచ్చు. పల్చని, పొడవాటి, పదునైన కత్తితో ఈ ఫిల్లేయింగ్‌ చేస్తారు.

శంఖుల కింద నుంచి కత్తిపెట్టి ముల్లుపై నుంచి తోక వరకూ కత్తిని లాగుతారు. ఇలానే చేపకి రెండు పక్కలా చేస్తారు. తలని వేరుచేస్తారు. అలాగే చర్మాన్ని కూడా వేరు చేస్తారు. బరువు ఎక్కువగా ఉన్న పెద్ద చేపలని ఇంత తేలిగ్గా ఒక్కదెబ్బతో ఫిల్లేయింగ్‌ చేయలేం. ఒక చేపని నాలుగు ముక్కలు చేస్తారు. అధికంగా పైకి పొడుచుకు వచ్చినట్టుగా ఉన్న ముళ్లని ప్లైయర్‌(పట్టకారులాంటిది)తో తొలగించుకోవచ్చు. ఈ ఫిల్లేయింగ్‌ కోసం ప్రత్యేకంగా కత్తులు దొరుకుతాయి. ఇవి పల్చగా, పొడుగ్గా, పదునుగా ఉంటాయి. పెద్దపెద్ద మాల్స్‌లో చేపలు కొన్నప్పుడు... అడిగితే వాళ్లే ఫిల్లేయింగ్‌ చేస్తారు. కొర్రమేను, వంజరం, చందువ, పండుగొప్పవంటివి ఇలా ఫిల్లేయింగ్‌ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.

రెసిపీస్

ఇప్పుడు చేపతో వివిధ రకాల చిరుతిళ్లు చేసుకోవడం ఎలానో చూద్దాం. ముళ్లు కనిపించకుండా, చేతికి వాసన అంటుకోకుండా... ఫిష్‌ కట్‌లెట్‌, అపోలో ఫిష్‌, పకోడి వంటివి చేసుకోవచ్చు.

ఉప్పు, కారం, వెల్లుల్లిపేస్ట్‌, మసాలాలు ఒక పాత్రలో విడిగా కలుపుకొని రుచి చూసి అప్పుడు చేపకు పట్టిస్తే మంచిది. ముందే చేపపై వేస్తే రుచి చూడ్డానికి చేపవాసన ఇబ్బంది పెడుతుంది.

అపోలో ఫిష్

అపోలో ఫిష్‌

అపోలోఫిష్‌ అనేది చాలా మంది చేపలో ఓ రకం అనుకుంటారు. కానీ కాదు. ఇది వంటకం పేరు. చేసుకోవడం కూడా చాలా సులభం. దీనికోసం ఫిల్లేయింగ్‌ చేసిన చేపలని చిన్నముక్కలుగా చేసుకుని నీళ్లు లేకుండా వార్చుకోవాలి. చేప ముక్కలమీద ఉప్పు, నిమ్మరసం, మిరియాలపొడి, పసుపు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌, కార్న్‌ఫ్లోర్‌, గుడ్డులోని తెల్లసొన వేసి కలుపుకోవాలి. అరకేజీ చేపకు రెండు చెంచాల కార్న్‌ఫ్లోర్‌, చెంచా మైదా, ఒక గుడ్డు తెల్లసొన కలిపి చేపకి పట్టించాలి. నూనెలో ముక్కలని డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేరే పాత్రలో కొద్దిగా నూనె పోసుకుని ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మనం వేయించి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. చైనీస్‌ రుచిలో కావాలనుకుంటే చిల్లీసాస్‌, సోయాసాస్‌ వేసుకోవచ్చు.

చేప పకోడి

చేప పకోడి

వేలు మందంతో చేప ముక్కలు కోసి పెట్టుకుని ముందుగా ఉప్పు కలిపిన గుడ్డుతెల్లసొనలో ముంచి, వాటిని బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. దానిపై మైదాపిండి చల్లుకోవాలి. ఇలా చల్లడాన్ని డస్టింగ్‌ అంటారు. వీటిని నూనెలో వేయించి తీసుకోవడమే. బియ్యప్పిండి, సెనగపిండి కూడా కలుపుకుంటారు కొందరు.

కట్ లెట్

కట్‌లెట్‌

చేపలని ముందుగా ఆవిరిమీద ఉడికించి పెట్టుకోవాలి. చేత్తో చిదిమితే పుట్టులా తయారవుతుంది. దీనికి బంగాళాదుంపలని ఉడికించి చిదిమి పెట్టుకున్న మిశ్రమాన్ని, మైదా, మొక్కజొన్నపిండి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు, పచ్చి మిరపకాయ ముక్కలు, గరంమసాలా వేసి ఆ మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలి. వీటిని కట్‌లెట్‌లా చేసుకుని ఎగ్‌ వైట్‌, బ్రెడ్‌ పొడిలో దొర్లించి తీయాలి. వీటిని పాన్‌పై రెండు వైపులా కాల్చుకుంటే కట్‌లెట్‌ సిద్ధం.

ఇదీ చదవండి: ఇలా చేస్తే ఇడ్లీ ఇష్టపడనివారూ తినేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.