ETV Bharat / priya

మైమరపించే 'గుల్​కండ్​ షేక్​' రెసిపీ​ మీకోసం!​ - rose shake in telugu

భానుడి తాపానికి ఒంట్లో శక్తి ఆవిరైపోతోందా? రోజంతా ఉల్లాసంగా ఉంచే.. చల్లచల్లని టేస్టీ మిల్క్​షేక్​ తాగితే బాగుండనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. గులాబి పరిమళంతో మిమ్మల్ని మైమరపించే 'గుల్​కండ్​ షేక్​'ను రెండు నిమిషాల్లో తయారు చేసేసుకోండిలా...

summer drinks gulkand milkshake recipe
మైమరపించే 'గుల్​కండ్​ షేక్​' రెసిపీ​ మీకోసం!​
author img

By

Published : Jun 6, 2020, 2:01 PM IST

రోజాలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో.. అంతే ఆరోగ్యాన్నిస్తాయి. ! వాటి సువాసన మనసుకు హాయినిస్తుంది. గులాబి రేకులు ఆహారంగా తీసుకుంటే శరీరానికి చలవనిచ్చి.. రోజంగా తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. అలాంటి గుబాళించే గులాబి పూలను, తేనె, చక్కెరలో ఊరబెడితే తయారవుతుంది గుల్​కండ్​. మార్కెట్​లో సులభంగా లభించే గుల్​కండ్​ను నేరుగా తింటే అద్భుతంగా ఉంటుంది. అదే ఆ గుల్​కండ్​తో​ మిల్క్​ షేక్​ చేసుకుంటే అదిరిపోతుంది. అజీర్తిని దూరం చేసే గుల్​కండ్​ షేక్​ను సింపుల్​గా తయారు చేసుకోవచ్చు..

మైమరపించే 'గుల్​కండ్​ షేక్​' రెసిపీ​ మీకోసం!​

కావలసినవి ఇవే...

చల్లని పాలు-500 మి.లీ. , గుల్​కండ్​-2 చెంచాలు, పిస్తా, బాదాం-2 చెంచాలు, ఓ గులాబి పువ్వు- అలంకరణకు.

చిటికెలో చేసేయండిలా..

చల్లని పాలను రెండు గ్లాసుల్లో పోసేయండి. వాటిలో చెరో చెంచా గుల్​కండ్​ వేసి బాగా కలపండి, ఎంతలా అంటే గుల్​కండ్​ మొత్తం పాలల్లో కలిసిపోయేంతగా. బాదాం, పిస్తాలను చిన్న ముక్కలుగా దంచుకుని రెండు గ్లాసుల్లోనూ మీ రుచికి సరిపడినంత వేసుకోండి. తాజా గులాబి రెబ్బలను పై నుంచి గార్నిష్​ చేసి.. కాసింత ప్రేమను కలిపి సర్వ్​ చేయండి.

ఈ ఈజీ గుల్​కండ్​ మిల్క్​ షేక్​ను తప్పకుండా ట్రై చేసి.. మీ అనుభవాన్ని ఈటీవీ భారత్​తో పంచుకోవడం మాత్రం మరచిపోకండి.

ఇదీ చదవండి:చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.