ETV Bharat / priya

చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా.. - healthy food

వేసవి వచ్చిందంటే చాలు ప్రతి భారతీయ ఇంట్లో 'చాస్​' ఉండాల్సిందే.. అదేనండి మజ్జిగ. అయితే, ఎప్పుడూ పెరుగులో ఇన్ని నీళ్లు, ఉప్పు కలిపేసుకుని మజ్జిగ తాగితే బోరు కదా! అందుకే, మజ్జిగకు మరింత రుచిని, ఔషద విలువలను అందించే చాస్​ను సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి!

buttermilk
వేసవిలో రుచికరమైన చాస్ చేసుకోండిలా..
author img

By

Published : Jun 4, 2020, 4:34 PM IST

ఇప్పుడంటే కూల్​డ్రింక్​లు, జ్యూస్​లు అంటూ.. ఎన్నో వేసవి ప్రత్యేక పానియాలు దొరుకుతున్నాయి. అవన్నీ కేవలం దాహాన్ని మాత్రమే తీర్చుతాయి. కానీ, సనాతన కాలం నుంచి వేసవి వచ్చిందంటే చాలు.. భారతీయుల ఆరోగ్యాలను 'చల్ల'గా కాపాడుతున్న దివ్య ఔషదం మాత్రం ఒకటే.. అదే 'చాస్'. మజ్జిగ, చల్ల, బటర్​ మిల్క్, చాస్ ఇలా​ పేరేదైనా కానీ, ఒంటికి చలవనిస్తుంది. జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలిస్తుంది. మరి, అలాంటి అద్భతమైన మజ్జిగను మరింత రుచిగా ఎలా చేసుకోవాలి అంటారా?

కావలసినవి ఇవే..

పెరుగు-500 గ్రాములు , పుదీనా ఆకులు- ఆరు, ఉప్పు-ఒక టీ స్పూను, పచ్చిమిర్చి-రెండు, అల్లం-చిన్న ముక్క, కరివేపాకు-ఒక రెబ్బ, నల్లఉప్పు-చిటికెడు, జీలకర్ర పొడి-చిటికెడు, నిమ్మకాయ-ఒకటి

ఇలా చేసేయండి..

పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకులను చిన్నచిన్న ముక్కలుగా చేసి.. పెరుగులో వేసి కలపాలి. ఆ తర్వాత లీటరు నీటిని పోసేయాలి. ఆ తర్వాత మజ్జిగా మాదిరి బాగా చిలకాలి. సర్వింగ్​ గ్లాసుల్లో తీసుకున్నాక చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం పిండుకోవాలి. అంతే, నోరూరించే ఆరోగ్యకరమైన చాస్​​ రెడీ!

మీరు, ఇంతకంటే రుచిగా మజ్జిగను తయారు చేయగలరా? అయితే, ఇంకెందుకు ఆలస్యం మీ చాస్​ రెసపీని ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఇదీ చదవండి:వేసవిలో 'ఆమ్​ కా పన్నా' తాగాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.