ETV Bharat / priya

రామయ్యకు.. భక్తితో నైవేద్యాలు చేయండిలా! - శ్రీరామ నవమి వంటకాలు

శ్రీరామ నవమి నాడు... సీతారాముల కల్యాణాన్ని చూడటం తప్ప వండుకునేందుకు ప్రత్యేకంగా ఏముంటాయని అనుకుంటాం. ఆ రోజున పానకం, వడపప్పును కూడా కాస్త వెరైటీగా చేసుకుంటూనే వీటినీ వండి స్వామికి నివేదించొచ్చు.

food
food
author img

By

Published : Apr 10, 2022, 6:45 AM IST

Updated : Apr 10, 2022, 7:04 AM IST

పానకం
food
పానకం

కావలసినవి: బెల్లం తరుగు: అరకప్పు, నీళ్లు: రెండు కప్పులు, శొంఠిపొడి: పావుచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, యాలకులపొడి: అరచెంచా, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: చిటికెడు, పచ్చకర్పూరం: చిటికెడు, తులసి ఆకులు: అయిదారు.

తయారీవిధానం: ఓ గిన్నెలో నీళ్లు, బెల్లం తరుగు వేసుకుని పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిందనుకున్నాక తులసి ఆకులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలపాలి. పానకాన్ని గ్లాసుల్లో పోశాక తులసి ఆకులు, కావాలంటే రెండు ఐసుముక్కలు వేసుకుంటే సరి.

కార్న్‌ క్యాబేజీ వడ
food
కార్న్‌ క్యాబేజీ వడ

కావలసినవి: మినప్పప్పు: కప్పు, క్యాబేజీ తరుగు: కప్పు, స్వీట్‌కార్న్‌: అరకప్పు, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, కొత్తిమీర: కట్ట, జీలకర్ర: అరచెంచా, కారం: అరచెంచా.

తయారీవిధానం: మినప్పప్పును నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు పూర్తిగా వంపేసి... పప్పును మిక్సీలో వేసుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గారెల పిండిలా రుబ్బుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో బరకగా దంచిన స్వీట్‌కార్న్‌, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక కొద్దిగా పిండిని తీసుకుని ప్లాస్టిక్‌ కవరు మీద వడలా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.

రవ్వ అప్పాలు
food
రవ్వ అప్పాలు

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, చక్కెర: కప్పు, యాలకులపొడి: అరచెంచా, నీళ్లు: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు రవ్వ, యాలకులపొడి వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక చక్కెర, రెండు చెంచాల నెయ్యి వేసి మరోసారి కలపాలి. చక్కెర కరిగి... హల్వాలా అయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమం వేడి కొద్దిగా చల్లారుతున్నప్పుడు మళ్లీ ఒకసారి కలిపి చిన్నచిన్న అప్పాల్లా చేసుకుని పెట్టుకోవాలి. తరువాత రెండుమూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

కోసంబరి
food
కోసంబరి

కావలసినవి: నానబెట్టుకున్న పెసరపప్పు: కప్పు, కీరదోస: రెండు (తురమాలి), క్యారెట్లు: నాలుగు (తురమాలి), మామిడికాయ: ఒకటి (సన్నగా తరగాలి), కొబ్బరితురుము: అరకప్పు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: రెండు చెంచాలు, ఇంగువ: పావుచెంచా, నిమ్మరసం: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత.

తయారీవిధానం: నానబెట్టుకున్న పెసరపప్పును ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో నూనె, ఇంగువ, తాలింపు దినుసులు, కరివేపాకు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఇంగువ, తాలింపు దినుసులు, కరివేపాకు వేయించుకుని పెసరపప్పు పైన వేసి బాగా కలపాలి.

తీపి మిక్చర్‌
food
తీపి మిక్చర్‌

కావలసినవి: బంగాళాదుంపలు: రెండు, బాదం: పది, జీడిపప్పు: పది, కిస్‌మిస్‌: పావుకప్పు, పల్లీలు: పావుకప్పు, చక్కెరపొడి: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం: ముందుగా బంగాళాదుంపల్ని చెక్కు తీసి సన్నగా, పొడుగ్గా తరుముకుని చల్లనినీటిలో వేసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌, పల్లీలను విడివిడిగా వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపల తురుమును ఒకటి రెండుసార్లు కడిగి ఆ తరువాత నూనెలో వేసి కరకరలాడేలా వేయించుకుని టిష్యూపేపర్‌మీద వేయాలి. అధిక నూనె మొత్తం పోతుంది. అలా వేయించుకున్న తురుముతోపాటూ మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలిపితే తీపి మిక్చర్‌ సిద్ధం.

ఇదీ చదవండి : సీత వెడ్స్​ రామ

Last Updated : Apr 10, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.