ETV Bharat / priya

రాణి గారి 'రాయల్‌ చాక్లెట్‌ కప్‌ కేక్‌' రెసిపీ ఇది! - etv bharat food

ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌-2 మహల్​లో తయారు చేసిన 'చాక్లెట్ కప్ కేక్' అంటే సాదాసీదాగా ఉంటుందా చెప్పండి? ఆ రుచికి స్వయంగా రాణిగారే ఫిదా అయిపోయారంటే వాటి రుచి ఆషామాషీగా ఉండదు. మరి అంతటి రుచికరమైన కప్ కేక్స్ మనింట్లోనే తయారు చేసుకుందామా ? ఆలస్యమెందుకు రెసిపీ చూసేయండి..

Queen Elizabeth II's favourite royal choclate cup cakes recipe in telugu
రాణి గారి 'రాయల్‌ చాక్లెట్‌ కప్‌ కేక్‌' రెసిపీ ఇది!
author img

By

Published : Aug 1, 2020, 1:00 PM IST

ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌-2 ఇంట బేక్ చేసిన కేక్ రెసిపీని మీ ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా..

Queen Elizabeth II's favourite royal choclate cup cakes recipe in telugu
రాణి గారి 'రాయల్‌ చాక్లెట్‌ కప్‌ కేక్‌' రెసిపీ ఇది!

స్పాంజ్‌ కప్‌ కేక్స్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు (15 మందికి సరిపోయేలా)

వెనిగర్‌ - 15 గ్రాములు

పాలు - 300 మి.లీ.

వెజిటబుల్‌ ఆయిల్‌ - 50 మి.లీ.

బటర్‌ (కరిగించి చల్లార్చాలి) - 60 గ్రాములు

గుడ్లు - 2

వెనీలా ఎసెన్స్‌ - 5 మి.లీ.

సెల్ఫ్‌ రైజింగ్‌ పౌడర్‌ (ఉప్పు, మైదా, బేకింగ్‌ పౌడర్‌తో తయారు చేసిన పిండి మిశ్రమం) - 250 గ్రాములు

కొకోవా పౌడర్‌ - 75 గ్రాములు

చక్కెర పొడి - 300 గ్రాములు

బేకింగ్‌ సోడా - 10 గ్రాములు

వైట్‌ చాక్లెట్‌ చిప్స్‌ - 100 గ్రాములు

కప్‌ కేక్‌ మౌల్డ్స్‌ - 15

బటర్‌ క్రీమ్‌ టాపింగ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

డార్క్‌ చాక్లెట్‌ - 90 గ్రాములు

బటర్‌ - 100 గ్రాములు

ఐసింగ్‌ షుగర్‌ - 125 గ్రాములు

రంగు కోసం ఫుడ్‌ కలర్స్‌ వాడొచ్చు.

స్పాంజ్‌ కేక్‌ తయారీ విధానం

ముందుగా ఒవెన్‌ను 150 డిగ్రీల వద్ద ప్రీ-హీట్‌ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సెల్ఫ్‌ రైజింగ్‌ పౌడర్‌, చక్కెర, బేకింగ్‌ సోడా, కొకోవా పౌడర్‌లను వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు, వెనీలా ఎసెన్స్‌, బటర్‌, ఆయిల్‌, పాలు, వెనిగర్‌ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిన పొడి మిశ్రమంలో ఈ తడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఆ తర్వాత ఇందులో చాక్లెట్‌ చిప్స్‌ వేయాలి. ఇవి ఇష్టం లేని వాళ్లు డ్రై ఫ్రూట్స్‌ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కప్‌ కేక్‌ మౌల్డ్స్‌లో పోసుకోవాలి. వీటిని బేకింగ్‌ ట్రేలో ఉంచి 15-18 నిమిషాల పాటు ఒవెన్‌లో ఉంచి బయటికి తీయాలి. ఈ క్రమంలో కేక్‌ బంగారు వర్ణంలోకి మారి.. ముట్టుకుంటే స్పాంజ్‌ను తలపిస్తుంది. ఇప్పుడు ఈ కప్‌ కేక్స్‌ను చల్లార్చాలి.

బటర్‌ క్రీమ్‌ తయారీ విధానం

ఒక గిన్నెలో ఐసింగ్‌ షుగర్‌, బటర్‌ వేసి క్రీమ్‌లా మారేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇందులో కరిగించిన డార్క్‌ చాక్లెట్‌ను గోరు వెచ్చగా ఉండగానే వేయాలి. ఇప్పుడు ఈ క్రీమ్‌తో కప్‌ కేక్స్‌పై అందంగా డెకరేట్‌ చేస్తే యమ్మీ స్పాంజ్‌ కప్‌ కేక్స్‌ తయార్‌!

ఇదీ చదవండి: 'బ్రెడ్‌ ఉప్మా' ఓసారి ట్రై చేయాల్సిందే సుమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.