చైనీస్ సూపీ చికెన్ మంచూరియాను ఒక్కసారి చేసుకున్నారంటే ఇక వదల్లేరు. మరి ఆ రెసిపీ చూసేయండి..
కావల్సినవి
చికెన్ - 350 గ్రా (ముక్కల్లా కోయాలి).
గుడ్డు మిశ్రమం కోసం
గుడ్లు - రెండు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి), మొక్కజొన్నపిండి, మైదా - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాలపొడి - చెంచా, వెనిగర్ - చెంచా, సోయాసాస్, రెడ్ చిల్లీసాస్ - ఒకటిన్నర చెంచా.
సాస్ కోసం
అల్లంవెల్లుల్లి తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, చికెన్ ఉడికించిన నీరు - రెండున్నర కప్పులు, నీళ్లు - పావుకప్పు, సోయాసాస్, టొమాటో కెచెప్ - రెండు టేబుల్‌స్పూన్లు, రెడ్‌చిల్లీ సాస్ - ఒకటిన్నర టేబుల్‌స్పూను, వెనిగర్ - చెంచా, మిరియాలపొడి - చెంచా, చక్కెర, ఉప్పు - అరచెంచా, మొక్కజొన్నపిండి - టేబుల్‌స్పూను, ఉల్లికాడలు - కట్ట, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ
అయితే మరీ ఎర్రగా వేయిస్తే.. గట్టిగా అయిపోతాయని మరవకూడదు. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక అల్లంవెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, తెలుపురంగు ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. నిమిషం అయ్యాక చికెన్ ఉడికించిన నీరు పోయాలి. తరవాత మొక్కజొన్న పిండి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. రెండు మూడు నిమిషాలయ్యాక పావుకప్పు నీటిలో మొక్కజొన్న పిండి అందులో వేయాలి. ఇది కాస్త చిక్కగా అయ్యాక వేయించిన చికెన్ వేసి కలపాలి. కాస్త ఉడుకుతున్నప్పుడు మిగిలిన ఉల్లికాడల తరుగు వేసి దింపేస్తే చాలు.
ఇదీ చదవండి: దిల్ ఖుష్ చేసే 'దమ్ కా చికెన్' రెసిపీ!