Paneer Recipes in Telugu: పనీర్.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. పనీర్‌తో ఏ వంటలైనా ఎంతో రుచిగా ఉంటాయి. అయితే పనీర్‌తో ఎప్పుడూ చేసే వంటలే కాకుండా వెరైటీగా చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే. స్పైసీగా, క్రిస్పీగా ఉండే పనీర్ లాలిపాప్, చిల్లీ పనీర్ ట్రై చేయండి. మరి అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
పనీర్ లాలిపాప్:
Paneer Lollipop:
కావలసిన పదార్థాలు:
- సోయాకీమా: అరకప్పు
- పనీర్ తురుము: ముప్పావుకప్పు
- ఉడికించిన బంగాళాదుంప: ఒకటి
- అల్లం తరుగు: పావుచెంచా
- పచ్చిమిర్చి ముక్కలు: రెండు చెంచాలు
- ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు
- జీలకర్రపొడి: 1 టీ స్పూన్
- గరం మసాలా: అరచెంచా
- చిల్లీ ఫ్లేక్స్: అరచెంచా
- మిరియాలపొడి: అరచెంచా
- నిమ్మరసం: రెండు చెంచాలు
- కొత్తిమీర తరుగు: పావుకప్పు
- బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు
- బ్రెడ్‌పొడి:అరకప్పు
- నూనె: వేయించేందుకు సరిపడా
- ఐస్‌క్రీమ్ పుల్లలు: కొన్ని
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!
తయారీ విధానం:
- సోయాకీమాలో కప్పు నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
- వేడి చల్లారాక నీళ్లు పిండేసి కీమాను ఓ గిన్నెలో వేసుకోవాలి.
- ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి.
- కలిపిన మిశ్రమాన్ని నిమ్మకాయంత తీసుకుని లాలీపాప్ ఆకృతిలో వచ్చేలా చేసి ఆ తర్వాత ఐస్‌క్రీమ్ పుల్లను గుచ్చాలి.
- ఇదేవిధంగా అన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
- వీటిని సాస్‌తో తింటే సూపర్‌గా ఉంటాయి..
మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్‌లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!
చిల్లీ పనీర్
Chilli Paneer:
కావలసినవి
- మొక్కజొన్నపిండి: పావుకప్పు
- మైదా: రెండు టేబుల్‌స్పూన్లు
- అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా
- కారం: అరచెంచా
- మిరియాలపొడి: పావుచెంచా
- ఉప్పు: తగినంత
- పనీర్ ముక్కలు: పదిహేను
- నూనె: వేయించేందుకు సరిపడా
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
సాస్‌కోసం:
- వెల్లుల్లి తరుగు: చెంచా
- పచ్చిమిర్చి: రెండు
- ఉల్లికాడల తరుగు: పావుకప్పు
- ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు
- క్యాప్సికం ముక్కలు: కొన్ని
- చిల్లీసాస్: చెంచా
- టమాట సాస్: టేబుల్‌స్పూను
- వెనిగర్: టేబుల్‌స్పూను
- సోయాసాస్: టేబుల్‌స్పూను
- కారం: పావుచెంచా
- ఉప్పు: తగినంత
- మిరియాలపొడి: పావుచెంచా
How to Prepare Methi Mutton Curry : మటన్ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!
తయారీ విధానం:
- ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి, మైదా, అల్లంవెల్లుల్లిముద్ద, కారం, మిరియాలపొడి, ఉప్పు వేసి అన్నింటినీ కలపాలి.
- ఇందులో పావుకప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మరోసారి కలిపి, పనీర్ ముక్కలు వేయాలి.
- వాటన్నింటికీ ఈ మిశ్రమం పట్టేలా జాగ్రత్తగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూన పోలి కాగనివ్వాలి.
- ఇప్పుడు పనీర్‌ను రెండుమూడు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి, ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
- ఇప్పుడు స్టౌమీద మరో బాణలి పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేయించాలి.
- ఓ నిమిషం తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, చిల్లీసాస్, టొమాటోసాస్, వెనిగర్, సోయాసాస్, కారం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేయాలి.
- ఓసారి కలిపిన తరువాత వేయించుకున్న పనీర్ ముక్కలు వేసి మరోసారి కలిపి 5 నిమిషాలయ్యాక దింపేయాలి. అంతే స్పైసీ చిల్లీ పనీర్ రెడీ.. ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి..
How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!
పోషకాలు: పనీర్‌లో మంచి కొవ్వులు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ తదితర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఆకలిని అదుపులో ఉంచుకోవాలంటే పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పనీర్‌ను తీసుకోవడం వల్ల మహిళలకు మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఒత్తిడి, చిరాకు నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఎముక సంబంధిత సమస్యలను నివారిస్తాయి.
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!
Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!
Chettinad Chicken Recipe : సండే స్పెషల్.. నోరూరించే చెట్టినాడ్ చికెన్